ఒక వ్యక్తి గ్రహ పరిస్థితి బాగులేనప్పుడు ఆ గ్రహానికి జపం, తర్పణం, హవనం చేయమంటారు. అప్పుడు పూజ చేయాలా? అలా చేస్తే ’నవగ్రహాల్ని ఇంట్లో పెట్టినట్లు కాదా?’ అలా పెట్టవచ్చా? జపానికి ముందు పూజ అవసరమా?
గ్రహస్థితి
బాగుపడడానికి చేసే పూజవల్ల దోషం రాదు. అది విగ్రహంలో, పటంలో జరిగేదికాదు. ఏదో ఒక బింబమందు
(పసుపుకొమ్ము వంటి వాటిపై) గ్రహాన్ని ఆరాధించడం సత్యనారాయణ వ్రతం వంటి సందర్భాలలో
మండపారాధనలో ఉన్నదే. అంతమాత్రాన గ్రహాలను ఇంట్లో పెట్టినట్లు కాదు. నిత్యపూజలలో
శనివంటి గ్రహాల ప్రతిమల్ని ఆరాధించడం తగదని అంటారు. ఆ పూజలు గ్రహాల ఆలయాలలో దూడా
చేయవచ్చు. జపానికి ముందు మానసికంగా పంచోపచార పూజవంటివి చేయాలి.