నిర్వాణషట్కమ్


మనోబుద్ధ్యాహంకార చిత్తాని నాహం
నశ్రోత్రం నజిహ్వ న చఘ్రాణ నేత్రం
నచ వ్యోమ భూమిర్నతేజోనవాయు
శ్చిదానంద రూపం శివోహం శివోహం

మనస్సు బుద్ధి అహంకారం చిత్తం నేను కాదు. కర్ణములు రుచి వాసన ఇది కూడా నేను కాదు. ఆకాశం భూమి తేజస్సు వాయువు జడము ఇవియు నేను కాదు. నేను  యొక్క స్వరూపము శివతత్త్వము. ఆ నేను శివుడనే!

అహం ప్రాణసంజ్గో నవైంపం ఇచ్చవాయు
ర్నవాసప్తధాతు ర్నవాప ఇచ్చకోశః
నవాక్ పాణిపాదౌ నచోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం

నేను పంచప్రాణాలు కాను పంచ వాయువులు కాను రక్త మాంస మేధో ఆస్థి మజ్జ శుక్లం రసం నేను కాదు. పంచకోశాలు నేను కాదు వాక్ పాణి పాదాలు నేను కాదు ఉపస్థలం కాను. నేను కేవలము చిదానంద రూపుడను శివుడను నేను!

నపుణ్యం నపాపం నసౌఖ్యం నదుఃఖం
నమంత్రాన తీర్థం నవేదా నయజ్ఞః
అహం భోజనం నైవ భోజ్యంభోక్తా
శ్చిదాననంద రూపః శివోహం శివోహం

నాకు పుణ్యం లేదు పాపం లేదు. సుఖం లేదు. దుఃఖం లేదు. మంత్ర జపం లేదు. తీర్థసేవలేదు. వేదములు లేవు యజ్ఞములు లేవు. అన్నం నేను కాదు భోజనం నేను కాదు భోజ్యం భోక్తా నేను కాదు. నేను కేవలం చిదానంద రూపుడను ఆ శివుడను నేనే.

నమే ద్వేషరాగా నమే లోభమోహో
మదోమేనైవ మాత్సర్యభావః
నధర్మో నచార్ధో నకామో నమోక్షః.
శ్చిదానందరూపః శివోహం శివోహం

నాకు రాగద్వేషాలు లేవు. లోభామోహాలు లేవు. మదమాత్సర్యాలు లేవు. ధర్మార్థకామ మోక్షాలు లేవు. నేను కేవలం చిదానంద రూపుడను, శివుడనే శివుడని నేను.

నమృత్యుర్నశజ్కా నమేజాతిభేధః
పితానైవ మేనైవ మాతానజహ్మ
నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య
శ్చిదానందరూపః శివోహం శివోహం

నాకు మృత్యువు లేదు. భయం లేదు. జాతి భేదాలు లేవు. తండ్రి, తల్లి భావన లేదు. బంధువులు లేరు. మిత్రులు లేరు. గురువు లేడు శిష్యులు లేరు. నేను చిదానంద రూపుడను శివుడను. ఆ శివుడను నేను.

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వే నిర్ధియాణాం
నవాబింధనంనైవ ముక్తిర్నబంధః
శ్చిదానందరూపం శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను వికల్పరహితుడను. నేను నిరాకారుడను. సర్వవ్యాపకుడను. అన్ని ఇంద్రియములతో నాకెప్పుడు సంబంధం లేదు.  బంధం లేదు. ముక్తి లేదు నేను చిదానందరూపుడను శివుడను. ఆ శివుడను నేనే!


శంకరాచార్యుల రచనలలో నిర్వాణషట్కమ్ ఒకటి. దీనికి ఆత్మషట్కమ్ అనే పేరు కూడ ఉంది. నిర్వాణం అంటే ముక్తి అంటే ఆరు. నేనునిజస్వరూపాన్ని నిర్వాణషట్కమ్ లో శంకరులు వివరించారు.