బమ్మెర పోతన రచించిన భాగవతం -1
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా
సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల
విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు
మహానందాంగనాడింభకున్.
భావము :
శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని;
చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించు = ప్రార్థించు; ఎదన్ = ఎదన్; లోక =
లోకాలన్నిటిని; రక్ష = రక్షించుటనే;
ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్పమున్న వాడు; కున్ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళయందు;
సంరంభ = వేగిరపాటున్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల;
ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసేవాడు; కున్ = కి; కేళి = ఆటలందు; లోల = వినోదాలందు; విలసత్ =
ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వలనుండి; సంభూత = పుట్టిన;
నానా = వివిధ; కంజాతభవాండ = బ్రహ్మాండముల {కంజాతభవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టినవాని(బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశితనలో
కలిగిన వాడు; కున్ = కి; మహా = గొప్ప; నంద = నందుని;
అంగనా = భార్యయొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
వాలిన భక్తి
మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్
శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక
మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది
మునిము ఖ్య మనస్సరసీరుహాలికిన్
భావము :
వాలిన =
అతిశయించిన; భక్తి = భక్తితో;
మ్రొక్కెదన్ =
మ్రొక్కెదను; అవారిత =
వారింపలేని; తాండవ = తాండవమనే;
కేళి = ఆట ఆడే వాని;
కిన్ = కి; దయాశాలి = దయకలవాడి; కిన్ = కి; శూలి = శూల ధారి; కిన్ = కి; శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు {మయూఖమాలి - కిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి; బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంక - శశ (కుందేలు) గుర్తు కలవాడు - చంద్రుడు};
మౌళి = శిరస్సున ధరించిన
వాడు; కిన్ = కి;
కపాలి = పుర్రె ధరించే
వాడు; కిన్ = కి;
మన్మథ = మన్మథుని;
గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి; నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల; మనస్ = మనసులనే; సరసీరుహ = పద్మాలలోని {సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్యం; అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్ = కి.
ఆతత సేవఁ జేసెద
సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ
హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతా
నికర నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్
నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.
భావము :
1-3-ఉ. | ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేసెదను; సమస్త = సమస్తమైన; చర = చరములు; అచర = అచరములుయైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించే; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీ = భారతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవానడు; కున్ = కి; వేద = వేదాల; రాశి = సమూహాలను; నిర్ణేత = ఏర్పరిచిన వాడు; కున్ = కి; దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాత = బ్రహ్మ; కున్ = కి; నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి.
అని నిఖిల భువన
ప్రధాన దేవతా వందనంబు సేసి.
భావము :
అని = ఈ విధంగా;
నిఖిల = సమస్త; భువన = లోకలకు; ప్రధాన = ముఖ్యమైన; దేవతా = దేవతలకు; వందనంబు = నమస్కారము; సేసి = చేసి
ఆదర మొప్ప
మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి
దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి
మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోదకఖాదికిన్ సమద
మూషక సాదికి సుప్రసాదికిన్
భావము :
ఆదరము = మన్నన;
ఒప్పన్ = ఉట్టిపడేలా;
మ్రొక్కున్ = నమస్కారమును;
ఇడుదున్ = పెట్టెదను;
అద్రి = పర్వత; సుతా = పుత్రి; హృదయ = హృదయ; అనురాగ = అనురాగాన్ని; సంపాది = సంపాదించినవాడు; కిన్ = కి; దోష = పాపాలని; భేది = పోగొట్టేవాడు; కిన్ = కి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోది = సంతోషము కలిగించు వాడు; కిన్ = కి; విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; చ్ఛేది = నాశనముచేసే వాడు; కిన్ = కి; మంజు = మనోజ్ఞముగ; వాది = మాట్లాడే వాడు; కిన్ = కి; అశేష = అనేక; జగత్ = లోకములందలి; జన = జనులకు; నంద = ఆనందము; వేది = కలిగించే వాడు; కిన్ = కి; మోదక = ఉండ్రాళ్ళు; ఖాది = తిను వాడు; కిన్ = కి; సమద = చక్కగ; మూషక = ఎలుక; సాది = నడిపే వాడు; కిన్ = కి; సుప్రసాది = మంచి నిచ్చే వాడు; కిన్ = కి.
క్షోణితలంబునన్
నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక
చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికిఁ
దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ
శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
భావము :
క్షోణి = భూమి;
తలంబునన్ = తలమున;
నుదురు = నుదురు; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసకతిన్నెల్లాంటి; శ్రోణి = పిరుదులుగలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపులాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టుగలామె; కిన్ = కు; రక్షి = కోటవలె; తామర = పద్మాల; శ్రేణి = సమూహముగలామె; కిన్ = కి; తోయ = నీటిలో; జాత = పుట్టినదానిలో; భవ = పుట్టినవాని(బ్రహ్మ)యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించుకోగల; ఏక = ముఖ్యమైన; వాణి = వాక్కుగలామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల అక్షముల; దామ = మాల; శుక = చిలుక; వారిజ = తామరపువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేతధరించినామె; కిన్ = కి.
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను
గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ
జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్
నాకగుమమ్మనమ్మితిఁ జుమీబ్రాహ్మీ! దయాంభోనిధీ!
భావము :
పుట్టన్ = పుట్టలో; పుట్ట = పుట్టి ఉండ లేదు (వాల్మీకినికాదు); శరంబునన్ =
రెల్లుపొదలో; మొలవ = పుట్టి ఉండ లేదు (సుబ్రహ్మణ్యునికాదు)
(శరంబునన్ కి పాఠ్యంతరం శిరంబున మొలవ దీనికి పుట్టంబుట్టతో కలిపి శిరస్సు మీద
పుట్ట పుట్టి ఉన్నవాడను కాను, వాల్మీకిని కాదు); అంభస్ = జల; యాన = ప్రయాణ; పాత్రంబునన్ =
సాధనములో - పడవలో; నెట్టన్ = పుట్టుకను; కల్గను = పొందనివానిని (వ్యాసునికాదు); కాళిన్ = కాళి; కొల్వను = ఆరాధించను (కాళిదాసునుకాదు); పురాణింపన్ =
పురాణ (భాగవత) రచనకి; దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీఁదు = ముందు చెప్పిన; ఎట్టే = అటువంటి వారి; వెంటన్ = పద్ధతినే; చరింతున్ = నడుస్తాను; తత్ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవు = ఇవ్వుము; అమ్మ = తల్లీ; ఓ = ఓ; అమ్మ = అమ్మ; మేల్ = మంచి; పట్టున్ = దన్నుగా; నాకు = నాకు; అగుము = ఉండుము; అమ్మ = తల్లీ; నమ్మితిన్ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా; బ్రాహ్మీ = సరస్వతీదేవీ; దయ = దయనే; అంభస్ = నీటియొక్క; నిధీ = పెద్ద పోగా - సముద్రమా.
శారదనీరదేందు
ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన
రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి
సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు
నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు భారతీ!
భావము :
శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా =
మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయస్ = నీటియొక్క; నిధి = పెద్దపోగు; సిత = తెల్లని; తామరస =
తామరపువ్వు; అమర = దేవతల; వాహినీ = నదిలో -
ఆకాశగంగలో; శుభ = శుభకరమైన; ఆకారతన్ =
ఆకారతతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.
అంబ, నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ,
భా
వాంబరవీధి
విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
భావము :
1-9-ఉ. | అంబ = తల్లీ; నవ = లేత; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు
కలదానా; శారద = శరదృతువులోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = ఆడంబరంలాంటి; చారు = అందమైన; మూర్తి =
స్వరూపముకలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = ప్రస్పుటమైన; భూషణ = ఆభరణాలలోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత =
స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు
యున్నదానా; శృతి = వేద; సూక్తి =
సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావముకలదానా; భావ = భావలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్త్రుతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = చూడు; భారతీ = సరస్వతీదేవీ.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన
వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భావము :
అమ్మలు =
అమ్మలు(సప్తమాత్రుకలు); అన్ = ను; కన్న =
కన్నటువంటి(కంటెగొప్పదైన); అమ్మ = అమ్మ; ముగురు =
ముగ్గురు {ముగురు అమ్మలు - లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = అమ్మలకి; మూలపు = మూలమైన; అమ్మ = అమ్మ; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సుర = దేవతల; అరుల = శత్రువుల(రాక్షసులు); అమ్మ = అమ్మ; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = అమ్మల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ =
దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు.
హరికిం
బట్టపుదేవి, పున్నెముల ప్రో
వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు,
భారతీ గిరిసుతల్ తో నాడు
పూఁబోఁడి, తా
మరలం దుండెడి
ముద్దరాలు, జగముల్ మన్నించు
నిల్లాలు, భా
సురతన్ లేములు
వాపు తల్లి, సిరి యిచ్చున్
నిత్యకల్యాణముల్
భావము :
హరి =
విష్ణుమూర్తి; కిన్ = కి;
పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్ = తో కలిసి - తోడ; పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరి = పర్వత; సుతల్ = పుత్రిల (పార్వతి); తోన్ = తో కలిసి; ఆడు = ఆడే; పూఁన్ = పూవును; పోడి = పోలినది - స్త్రీ; తామరలు = పద్మముల; అందున్ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లు = గృహమునకు; ఆలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = నిత్యమైన; కల్యాణముల్ = శుభములు.
అని యిష్టదేవతలం
జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి
ప్రథమ కవితా
విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి,
హయగ్రీవదనుజకర
పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపు
ణతాసముల్లాసునకు
వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కథా
సుధారసప్రయోగికి
శుకయోగికి నమస్కరించి, మృధు మధుర
వచన వర్గ పల్లవిత
స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి, కతిపయ శ్లోక
సమ్మోదితసూరు
మయూరు నభినందించి, మహాకావ్యకరణ కళా
విలాసుం
గాళిదాసుం గొనియాడి కవి కమల రవిన్ భారవిన్ బొగడి
విదళితాఘు మాఘు
వినుతించి, యాంధ్రకవితాగౌరవజనమనో
హరి నన్నయ సూరిం
గైవారంబు సేసి, హరిహర చరణారవింద
వందనాభిలాషిం
దిక్కమనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వ
కవి
జన సంభావనంబు
గావించి, వర్తమాన కవులకుం
బ్రియంబు వలికి,
భావి కవుల
బహూకరించి, యుభయకావ్యకరణ
దక్షుండనై.
భావము :
అని = ఈ విధంగా;
ఇష్ట = ఇష్టమైన; దేవతలన్ = దేవతలను; చింతించి = తలచుకొని; దిన = దినమునకు; కర = కారణమైన - సూర్యుడు; కుమార = కుమారస్వామి; ప్రముఖులన్ = మొదలగు ముఖ్యులను; తలంచి = తలచుకొని; ప్రథమ = మొట్టమొదటి; కవితా = కవిత్వమును; విరచన = రచించే; విద్యా = నేర్పు అనే; విలాస = ఆటలో; అతిరేకి = ఉత్తముడు; వాల్మీకిన్ = వాల్మీకిని; నుతియించి = స్తుతించి; హయగ్రీవ = హయగ్రీవుడనే; దనుజ = దానవుని; కర = చేతితో; పరిమిళిత = కలగాపులగము చే.యబడ్డ; నిగమ = వేద; నివహ = రాశిని; విభాగ = విభజించుటకు వలసిన; నిర్ణయ = నియమాల; నిపుణతా = నైపుణ్య సాధనలో; సముల్లాసు = మంచి ఉల్లాసము గలవాడు; కున్ = కి; వ్యాసున = వ్యాసులవారి; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; శ్రీ = శుభప్రథమైన; మహా = గొప్ప; భాగవత = భాగవతము అనే; కథా = కథ అనే; సుధా = అమృత ప్రాయమైన; రస = రసాయనాన్ని; ప్రయోగి = ప్రయోగించినవాడు; కిన్ = కి; శుక = శుకుడనే; యోగి = యోగి; కిన్ = కి; నమస్కరించి = నమస్కరించి; మృధు = మృదువైన (లాలిత్యమైన); మధుర = తీయనైన; వచన = మాటల; వర్గ = మాలికలచే; పల్లవిత = చిగురించిన; స్థాణు = రాళ్లు కలిగినవాడు; కున్ = కి; బాణు = బాణుడు; కున్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; కతిపయ = ఎన్నదగిన; శ్లోక = శ్లోకాలతో; సమ్మోదిత = సంతోష పెట్ట బడిన; సూరున్ = పండితులు కలవాని; మయూరున్ = మయూరుని; అభినందించి = పొగిడి; మహా = గొప్ప; కావ్య = కావ్యాలను; కరణ = రచించే; కళా = కళలో; విలాసున్ = నేర్పరిని; కాళిదాసున్ = కాళిదాసుని; కొనియాడి = పొగిడి; కవి = కవులనే; కమల = పద్మాలకి; రవిన్ = సూర్యుడైనవాడుని; భారవిన్ = భారవిని; పొగడి = కీర్తించి; విదళిత = నిర్మూలింపబడ్డ; అఘు = పాపాలుకలవాడిని; మాఘున్ = మాఘుని; వినుతించి = పొగిడి; ఆంధ్ర = తెలుగు; కవితా = సాహిత్యంమీద; గౌరవ = గౌరవమున్న; జన = జనుల; మనస్ = మనస్సులను; హారిన్ = ఆకర్షించినవాని; నన్నయ = నన్నయ; సూరిన్ = పండితుడుకి; కై = చేతులు; వారమున్ = జోడించుట; సేసి = చేసి; హరిహర = హరిహరునియొక్క - హరి హరుల; చరణ = పాదాలనే; అరవింద = పద్మాలకి; వందన = నమస్కరించే; అభిలాషిన్ = అభిలాషగలవాడనిని; తిక్క = తిక్కన అనే; మనీషిన్ = ప్రతిభాశాలిని; భూషించి = పొగిడి; మఱియు = ఇంకను; ఇతర = ఇతరమైన; పూర్వ = ముందుతరపు; కవి = కవుల; జన = సమూహమునకు; సంభావనంబు = గౌరవాభివాదము; కావించి = చేసి; వర్తమాన = ఈనాటి; కవుల = కవుల; కున్ = కును; ప్రియంబు = ప్రియము కలుగునట్లుగా; పలికి = చెప్పి - అభినందించి; భావి = భవిష్య కాలపు; కవులన్ = కవులను; బహూకరించి = గౌరవించి; ఉభయ = రెండు రకాలైన; కావ్య = కావ్యములను; కరణ = రచించుటలో; దక్షుండన్ = సామర్థ్యముకలవాడిని; ఐ = అయ్యి.
ప్రధమ స్కంధం ఇంకా ఉంది ...........
ప్రధమ స్కంధం ఇంకా ఉంది ...........