మాఘ మాసం లో ఏ నదిలో స్నానం చేయాలి ?

కర్తీక మాసం లాగానే మాఘ మాసం స్నానం కూడా చాల విసిష్టంయినది.  మాఘ స్నానాలు ఎప్పుడు ప్రారంబించాలి ?
పుష్య మాసం లో వచ్చే పౌర్ణిమ నుంచి మాఘ పౌర్ణిమ వరకు స్నానం చేయాలి . ఒక వేల కుదరక పొతే 
మాఘ సుద్ధ పాడ్యమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరుకు అయిన చేయాలి , ఇదీ కుదరకపోతే పుష్యమాసం లో వచ్చే మకర సంక్రమణం నుంచి కుంబ సంక్రమణం వరకు అంటే మకర మాసం (మకరం లో సూర్యుడు ఉనన్తకలమ్ ) అంతా కూడా స్నానం చేయవచ్చు . ఇలా కూడా కుదరనటువంటి వాలు ముక్యమయిన ఏకాదశి , మాస సంక్రాంతి , మాస శివరాత్రి రోజు అయిన స్నానం చేయాలి . 

నదులు దగ్గరలో లేనటువంటి వాలు , ఇంట్లో సుర్యోదయనికంటే ముందే స్నానం చేసేట్టపుడు గంగా నది ని తలచుకొని స్నానం చేయవచ్చు . 

కుంబ సంక్రమణం : కుంబ సంక్రమణం కంటే 10 ఘడియలు ముందు (విశిష్టమయిన పర్వదినం-ధర్మసిందు లో చెప్పబడింది) కుంబ రాశిలోకి సూర్యుడు ప్రవేసిస్తాడు, ఇప్పుడు నది స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవటం వలన విసేషమయిన ఫలితం. ఒకవేళ నది స్నానం చేయలేని వారు తెల్లవారుఝామునే లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేయటం వలన కూడా మంచి ఫలితాలు లబిస్తాయి . 


కుంబ సంక్రమణం లో ఎకడ ఎకడ స్నానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు లబిస్తాయి :

ఇంట్లో చేసేదానికంటే ఏ నది లో చేసిన విశేషమే . అని నదులొకి గంగా నదిలో చేస్తే మరింత విశేషం . 
కాశి దగ్గర ఉన్న గంగా నది ( ఇక్కడ గంగ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తుంది ) లో స్నానం చేస్తే ఇంకా 1000 రెట్లు ఎక్కువ ఫలితానిస్తుంది . గంగానది కంటే కూడా కురుక్షేత్రం లో స్నానం చేస్తే 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది . 
కురుక్షేత్రం లో కంటే కూడా గంగా + యమునా సంగమం ప్రయాగ  లో చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుంది . 

వేణి (నది) స్నానం - ప్రయాగ లో స్నానం చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుంది. 

మాఘమాసంలో ఎప్పుడు చేసిన మంచిదే , కానీ రధ సప్తమి రోజున కానీ , బహుళ సప్తమి రోజు కానీ , మాస సంక్రాంతి (మకర సంక్రాంతి రోజు కానీ ) , కుంబ సంక్రాంతి (కుంబ సంక్రమణం) రోజు కానీ ప్రయాగ లో స్నానం చేస్తే విసిష్టమయిన ఫలితం . 

ఈ మకర మాసం (మకర సంక్రమణం మొదలుకొని కుంబ సంక్రమణం వరకు )లో ఎవరు ప్రయాగ లో స్నానం చేస్తారో , గంగా నది కి పూజ చేసి దీప దానం చేస్తారో , సాలిగ్రామ దానం చేస్తారో వారికీ కోటి రెట్ల ఫలితం లబిస్తుంది. 
ప్రయాగ లో స్నానం, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి దీప దానం అ నదిలో చేయటం వలన కోటి సూర్య గ్రహణలో స్నానం చేసిన ఫలితం వారికీ లబిస్తుంది . 

మాఘ మాసం లో చేయవలిసిన దానాలు ఏమిటి ?

మకర సంక్రాంతి రోజు కానీ , రధ సప్తమి రోజు కానీ , ఏకాదశి , ద్వాదశి , బహుళం లో కానీ , కుంబ సంక్రమణం రోజు కానీ అసలు ఏ రోజు అయిన సరే .... ప్రయాగ దగ్గర కానీ , కాశి  నది దగ్గర కానీ , ఇంటి దగ్గర కానీ గో దానం లేదా గో సంరక్షణ కోసం దానం చేయటం చాల మంచిది . 

ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి దానం చేయటం వలన దీర్గ కాలంగా ఉన్న వ్యాది నివారణ చేయటం జరుగుతుంది. 
ఒక కంచు పాత్రలో తేన పోసి దానం చేయటం వలన దీర్గ కాలంగా ఉన్న రోగాలు పోతాయి. 
ఒక కంచు పాత్రలో బెల్లం పెట్టి దానం చేయటం  వలన (లేదా బెల్లం పానకం )శోక నివారణ జరుగుతుంది. 
నవధాన్యాలు దానం చేయటం వలన గ్రహ బాధలు పోతాయి . 
ఒక రాగి పాత్ర లో నువ్వులు పోసి దానం (తిల దానం) చేయటం వలన అపమృత్యు దోషాలు , అర్ధయుషు తో ఉన్న వారి దోషాలు పోతాయి . 
మృత్యుంజయ మంత్ర జపం చేసుకుని తిల పాత్ర దానం పుణ్య క్షేత్రాలో చేస్తారో వారికీ అప మృత్యు దోషాలు నాయి పోతాయి . 

మాఘ మాసం లో మకర సంక్రాంతి లో లేదా ఎప్పుడయినా మాఘ మాసం లో లేదా ఎప్పుడు ప్రయాగ వెళ్ళినా  వేణి దానం చేయాలి ( వేణి దానం అంటే తల వెంట్రుకలు దానం చేయటం ). 
ఆడవారు , పెద్దలు ,పూర్వ సువాసినలు (బర్త చనిపోయినవాలు ) , సువాసినలు , మగవారు కానీ ఎవరయినా సరే ఈ దానం చేయవచ్చు. ఆడవారు కూడా ఇక్కడ గుండు చెయించుకొవచు లేదా కనీసం 3 కతిర్లు (వెంట్రుకల చివర్లు లేదా కొసలు 3 సార్లు కత్తిరించడం ) వేసి ఒక చేట లో పెట్టి మంగళ ద్రవ్యాలు కూడా ఉంచి (పసుపు , కుంకుమ , దువ్వెన , కాటుక , రవికలగుడ్డ , పువ్వులు ) ప్రయాగ నదిలో(సంగమం లో ) వదలాలి . ఇలా చేయటం వలన ఆడవారు గత జన్మ పాపలు , ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి. అంటే కాదు ఈ జన్మలోనే కాక మరు జన్మలో కూడా సుమంగళిగా ఉంటారు.

గంధం చెక్కని దానం ఇవటం అందులోని ఎర్ర గంధం చెక్క దానం ఇవటం ఇంకా విశేషం .

వేణి దానం చేసేటప్పుడు చదువుకొవలిసిన శ్లోకం -



రాధా సప్తమి మొదలుకొని ఆడవారు ఎలాంటి వ్రతం అయిన మొదలు పెట్టవచు . తిల దానం చేయాలి. 3 వంతులు నువ్వులు , ఒక ఒంటు చెక్కర కలిపి పంచడం వలన , పంచి న వారికీ తీసుకున్న వారికీ కూడా అప మృత్యు దోషాలు పోతాయి .