రుద్రము - నమకము - అనువాకము 5
అనువాకము 5
యజుస్సు 1.
నమో
భవాయచ రుద్రాయచ.
ప్రాణుల యుత్పత్తికి మూల
కారణమైన, జీవుల రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.
నమశ్శర్వాయచ పశుపతయేచ.
పాప
నాశకులకును, అజ్ఞానులైన పురుషులను పాలించు వారికిని నమస్కారము.
యజుస్సు 3.
నమో
నీలగ్రీవాయచ శితి కంఠాయచ.
నీలగ్రీవము స్వేత కంఠము కలవాఁడు నగు
శివునకు నమస్కారము.
యజుస్సు 4.
నమః
కపర్దినేచ వ్యుప్త కేశాయచ.
జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు (జుత్తులేనివానుకు) నమస్కారము.
యజుస్సు 5.
నమస్సహస్రాక్షాయచ శతధన్వనేచ.
ఇంద్ర వేషముచే సహస్రాక్షుఁడైన వాఁడును, సహస్ర భుజములు గల అవతారములు ధరించుటచే శతధన్వుఁడును ఐన శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమో
గిరిశాయచ శిపివిష్టాయచ.
కైలాసమున ఉండువాఁడును, శయనించువాఁడును, విష్ణువును తన హృదయమున ధరించువాఁడును అగు
శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమో
మీఢుష్టమాయచేషుమతేచ.
మేఘ
రూపమున మిక్కిలి వర్షము కురిపించువాఁడును, బాణములు కలవాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమో
హ్రస్వాయచ వామనాయచ.
(అల్ప ప్రమాణుడగుటచే) హ్రస్వముగా నున్నట్టియును, (వ్రేళ్ళు మున్నగు అవయవముల సంకోచమువలన) వామనుఁడుగా నున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 9.
నమోబృహతేచవర్షీయసేచ.
ఆకారముచే ప్రౌఢుఁడైనట్టియు, గుణములచే సమృద్ధుఁ డైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 10.
నమోవృద్ధాయచ సంవృద్ధ్వనేచ.
వయసుచే అధికుఁడైనట్టియు, శృతులచే బాగుగా వృద్ధి పొందునట్టివాఁడు నగు
శివునకు నమస్కారము.
యజుస్సు 11.
నమో
అగ్రియాయచ ప్రథమాయచ.
జగదుత్పత్తికి పూర్వమున్నట్టియు, సభలో ముఖ్యుఁడును అగు
పరమ శివునకు నమస్కారము.
యజుస్సు 12.
నమ ఆశవే చాజిరాయ చ.
అంతటను వ్యాపించినట్టి గమనకుశలుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 13.
నమశ్శీఘ్రియాయచ శీభ్యాయచ.
శీఘ్రముగా పోవు వాఁడును, ఉదక ప్రవాహముననున్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 14.
నమఊర్మ్యాయచా వస్వన్యాయచ.
తరంగములతో గూడి యున్నట్టియు, ధ్వని రహితమైన స్థిరమైన జలమున ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 15.
నమస్స్రోతస్యాయచ ద్వీప్యాయచ.
ప్రవాహమున నున్నట్టియు, జల మధ్యస్థములైన ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము.
అనువాకము 5 సమాప్తము.