రుద్రము - నమకము - అనువాకము 4
యజుస్సు 1.
నమ అవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చవోనమః.
సంపూర్ణముగా వేధించుటకు సమర్థులైన స్త్రీలకు నమస్కారము. విశేషముగా పీడించుటకు సమర్థులైన స్త్రీలగు మీకు నమస్కారము.
యజుస్సు 2.
నమ ఉగణాభ్యస్తృగ్ ంహతీభ్యశ్చవోనమః.
ఉత్కృష్ట గుణ రూపలైన సమస్త మాతృకలు మున్నగు స్త్రీలకు నమస్కారము. పరులను హింసించుటకు సమర్థులైన దుర్గ మున్నగు భయంకర దేవతలకు నమస్కారము.
యజుస్సు 3.
నమో
గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవోనమః.
విషయాసక్తులకు నమస్కారము. విషయాసక్తులను రక్షించు మీకు నమస్కారము.
యజుస్సు 4.
నమోవ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవోనమః.
నానా జాతుల సంఘములకు నమస్కారము. సంఘాధిపతులైన మీకు నమస్కారము.
యజుస్సు 5.
నమో
గణేభ్యో గణపతిభ్యశ్చవోనమః.
దేవానుచర గణములకు నమస్కారము. దేవానుచర గణములకు ప్రభువైన మీకు నమస్కారము.
యజుస్సు 6.
నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవోనమః.
వికృత రూపులైన నగ్న ముండాదులకు నమస్కారము. తురంగ గజ వక్త్రాది నానా రూపములను దాల్చు భృత్యులును అగు మీకు నమస్కారము.
యజుస్సు 7.
నమో
మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవోనమః.
అణిమా ద్యష్టైశ్వర్యములతో కూడుకొన్నవారికి నమస్కరము. అష్టైశ్వర్యములు లేని మీకు నమస్కారము.
యజుస్సు 8.
నమో
రథిభ్యో உరథేభ్యశ్చవోనమః.
శరీర రథము నధిష్టించిన పరమాత్మకును, రథులైన యోధులకును, జీవులకును నమస్కారము. రథము లేని సామాన్య జీవులకును, శరీర రథము లేని అప్రాణులున్నగు మీకును నమస్కారము.
యజుస్సు 9.
నమోరథేభ్యో రథపతిభ్యశ్చవోనమః.
రథ రూపులకు నమస్కారము. రథములకు ప్రభువులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 10.
నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చవోనమః.
రథ గజ తురగ పదాతి రూప సేనలకు నమస్కారము. సేనా నాయకులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 11.
నమః
క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చవోనమః.
రథ శిక్షకులును, రథములను గ్రహించు సారథులును అగు
మీకు నమస్కారము.
యజుస్సు 12.
నమస్తక్షభ్యోరథకారేభ్యశ్చవోనమః.
దేవాధిష్టానులైన శిల్పి విశేషులకు నమస్కారము. చక్కగా రథములను నిర్మించు శిల్పులగు మీకు నమస్కారము.
యజుస్సు 13.
నమః
కులాలేభ్యః కర్మారేభ్యశ్చవోనమః.
కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము.
యజుస్సు 14.
నమః
పుంజష్టేభ్యో నిషాదేభ్యశ్చవోనమః.
పక్షి పుంజములను సంహరించు వారికి నమస్కారము. మత్స్య ఘాతుకులైనట్టి మీకు నమస్కారము.
యజుస్సు 15.
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవోనమః.
చక్కని శరీరములను చేయునట్టి మీకు నమస్కారము. చక్కని ధనుస్సులను చేయునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 16.
నమోమృగయుభ్యశ్శ్వనిభ్యశ్చవోనమః.
మృగములను చంపెడి వ్యాధులకు నమస్కారము. కుక్కల మెడలయందు గట్టబడిన పాశములను దాల్చెడి మీకు నమస్కారము.
యజుస్సు 17.
నమశ్శ్వభ్యశ్శ్వపతిభ్యశ్చవోనమః.
శ్వాన రూపధారులకు నమస్కారము. శునక స్వాములైన మీకు నమస్కారము.
అనువాకము 4 సమాప్తము.