రుద్రము - నమకము - అనువాకము 3
అనువాకము 3
యజుస్సు 1.
నమస్సహమానాయనివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః.
విరోధులను అభిభవించు (పరాభవించు)
రుద్రునకు నమస్కారము
మిక్కిలి విరోధులను బాధించు రుద్రునకు నమస్కారము. అంతటను సంపూర్ణముగా బాధించు శూర
సేనలకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.
యజుస్సు 2.
నమః
కకుభాయ నిషంగిణే స్తేనానాంపతయేనమః.
కకుభ (అర్జునవృక్షము వలె ప్రథానుఁడైనట్టి) సదృశమైన, ఖడ్గము చేతఁ గల శివునకు నమస్కారము. గుప్త చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 3.
నమోనిషంగిణ ఇషుధిమతే తస్కరాణాంపతయే నమః.
ధనుస్సును సంధించుటకు చేత
బాణము కలిగినట్టియు, పృష్ఠ భాగమున కట్టఁ బడిన అమ్ముల పొది కలిగినట్టి శివునకు నమస్కారము. ప్రకట చోరులకు పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 4.
నమో
వంచతే పరి
వంచతే స్తాయూనాంపతయే నమః.
యజమానికి ఆప్తుఁడై అతని క్రయ విక్రయాది వ్యవహారము లందు మెలగుచు, ఎచ్చట నైనను, ఏమాత్ర మైనను అతని ద్రవ్యమును అపహరించుట యనెడి వంచన మొనరించు వాని స్వరూపముతో నుండు శివునకు నమస్కారము. పైన చెప్పినట్లు యజమానిని బాగుగా మోసగించు శివునకు నమస్కారము. రాత్రి యందు పగటి యందు అన్యులకు తెలియనీయక యజమాని సొత్తు నపహరించు వారికి పాలకుఁడైన శివునకు నమస్కారము.
యజుస్సు 5.
నమోనిచేరవే పరిచరాయారణ్యానాంపతయేనమః.
నిరంతరము సంచార శీలము కలవాఁడు, బాగుగా సంచరించునట్టి శివునకు నమస్కారము. నిరంతరము అరణ్యమునందుండు వారి ప్రభువైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమస్సృకావిభ్యో జిఘాగ్ ం సద్భ్యో ముష్ణతాంపతయేనమః.
వజ్రమును బోలిన స్వశరీరమును రక్షించువారు సృకావినులు. వజ్రము వంటి తమ శరీరము రక్షించు వారికి నమస్కారము. కృషికులై స్వామి ధాన్యము అపహరించు వారికి ప్రభువైన శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమో
உసిమద్భ్యో నక్తంచరద్భ్యః
ప్రకృంతానాంపతయేనమః.
ఖడ్గము కల చోరులకు నమస్కారము. రాత్రి సంచరించువారై వీధులలో పోవు వారిని పీడించు చోరులకు నమస్కారము. కుత్తుకలు కత్తిరించి అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమః.
శిరస్సును కాపాడు తలపాగా కలిగినట్టి పర్వతముల సంచరించు నట్టి శివునకు నమస్కారము. భూమిని అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము.
యజుస్సు 9.
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవోనమః.
బాణములు కలిగినట్టి మీకు నమస్కారము. ధనుస్సులు కలిగినట్టి మీకు నమస్కారము.
యజుస్సు 10.
నమ అతన్వానేభ్యః.ప్రతిదధానేభ్యశ్చవోనమః.
ధనుస్సున త్రాటిని ఆరోపించు మీకు నమస్కారము. ధనుస్సున బాణమును సంధించు మీకు నమస్కారము.
యజుస్సు 11.
నమ అయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చవోనమః.
వింటి త్రాటిని ఆకర్షించునట్టి మీకు నమస్కారము. ధనుస్సు నుండి బాణములను విడుచు నట్టి మీకు నమస్కారము.
యజుస్సు 12.
నమో
உస్యద్భ్యో విధ్యద్బ్యశ్చవోనమః.
లక్ష్యము వరకు బాణము విడుచునట్టియు, లక్ష్యము నందు బాణము ప్రవేశ పెట్టు మీకు నమస్కారము.
యజుస్సు 13.
నమ ఆసీనేభ్యశ్శయానేభ్యశ్చవోనమః.
కూర్చుండునట్టియును, నిద్రించునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 14.
నమస్స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవోనమః.
నిద్రించునట్టి మీకు నమస్కారము. మీల్కొని యుండునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 15.
నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవోనమః.
నిశ్చలముగా నుండునట్టి మీకు నమస్కారము. పరుగెత్తునట్టి మీకు నమస్కారము.
యజుస్సు 16.
నమస్సభాభ్యస్సభాపతిభ్యశ్చవోనమః.
సంఘముగా నున్న వారికి నమస్కారము. సంఘముగా నున్నవారికి ప్రభు వగు మీకు నమస్కారము.
యజుస్సు 17.
నమో
అశ్వేభ్యో உ శ్వపతిభ్యశ్చవోనమః.
అశ్వ విగ్రహులకు నమస్కారము. తనదగు ధనము లేని వానికి నమస్కారము. ఎవరి నుండియు ఏమియును గ్రహింపకుండుటచే రేపటికవసరమగు ధనము లేనివారికి నమస్కారము. అశ్వాధ్యక్షులును మహాశ్రీ గల వారును అగు మీకు నమస్కారము.
అనువాకము 3 సమాప్తము.