రుద్రము - నమకము - అనువాకము 11


అనువాకము 11
ఋక్కు 1.
సహస్రాణి సహస్రశో యేరుద్రా  అధిభూమ్యాం
తేష్హాగ్ ంసహస్ర యోజనే వహన్వాని తన్మసి.
భూమి యొక్క ఉపరి భాగమున రుద్రులు సహస్ర ప్రకారులై సహస్ర సంఖ్యాకులై, కలరో ఆరుద్రులయొక్క ధనుస్సులును, మాకంటే సహస్ర యోజనములు దాటిన పిమ్మట గల దేశమున తొలగింపబడిన వింటి త్రాడు కలవిగా జేసి ఉంచుము.

ఋక్కు 2.
అస్మిన్ మహత్యర్ణవే ంతరిక్షేభవా అధి.
కాన వచ్చు మహా సముద్రముతో సమానమైన అంతరిక్షము నాశ్రయించి యున్న రుద్రమూర్తి విశేషములు సహస్ర యోజనముల దూరమున ఉండుగాక.

ఋక్కు 3.
నీలగ్రీవాశ్శితి కంఠాః శర్వా అధః క్షమాచరాః.
రుద్రుని యొక్క మూర్తి విశేషములు కొన్ని ప్రదేశములందు నీల వర్ణములును, ఇతర ప్రదేశములందు శ్వేత వర్ణములై యుండును. నీల కంఠములు హింసించు నవియును పాతాళమున సంచరించు నవియును ఐయున్నవి.

ఋక్కు 4.
నోలగ్రీవాశ్శితికంఠా దివగ్ రుద్రా ఉపశ్రితాః.
నీల శ్వేత వర్ణములును, నలుపు కంఠమునందు గల రుద్రాంశ గల దేవాదులు  స్వర్గమును ఆశ్రయించి యుండిరి.

ఋక్కు 5.
వృక్షేషు సస్పింజరా నీల గ్రీవా విలోహితాః.
వృక్షము లందు రుద్రులు కలరో వారు లేత గడ్డి వలె పింజర వర్ణము కలవారు. నీల వర్ణమైన గ్రీవము కలవారు. కొందరు విశేషముగ రక్త వర్ణము కలవారు.

ఋక్కు 6.
యే భూతానామధిపతియో విశిఖాసః కపర్దినః.
రుద్రులు కాన రాని శరీరము కలవారై మనుష్యులకు ఉపద్రవములను గావించు భూత గణములకు ప్రభువులో వారిలో కొందరు నున్నగా చేయ బడిన   శిరస్సులు కలవారై జటాజూటము లకలవారై జీవులను హింసిచు చున్నారు. వారు దూరముగా నుందురు గాక.

ఋక్కు 7.
యే అన్నేషు వివిద్యంతి పాత్రేషు పిబతో జనాన్.
రుద్రులు (రుద్రాంశ గలవి) భుజింప దగిన వస్తువు లందు గూఢముగా నున్నవై జనులను విశేషముగా బాధించు చున్నవో త్రాగ తగిన పాలు మున్నగు వానిలో నున్నవై త్రాగుచున్న జనులను విశేషముగా బాధించు చున్నవో అవి దూరముగా నుండును గాక.

ఋక్కు 8.
యే పథాం పథి రక్షయ ఐలబృదా యవ్యుధః.
రుద్రులు లౌకికములును వైదికములునగు మార్గములను రక్షించువారో , అన్న సమూహమును భరించువారో, అన్న ప్రదానముచే జీవులను పోషించువారో, వారు మిశ్రములై విరోధులతో యుద్దము చేయువారు అగుచున్నారు. వారు దూరముగా ఉందురుగాక.
నవమము,

యజుస్సు1.
తీర్థాని ప్రచరంతి సృకావంతోనిషంగిణః.
రుద్రులు కాశీ ప్రయాగాది క్షేత్రములను రక్షించుటకు సంచరించుచున్నారో వారు ఈటెలు కలవారును, కత్తులు కలవారును అయి యుండిరి.
దశమము.

యజుస్సు 2.
ఏతావంతశ్చ భూయాగ్ ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే . తేషాగ్ సహస్ర యోజనేవ ధన్వాని తన్మసి.
రుద్రులు వేలకొలది కలరో అంతకంటె అధికులై అన్ని దిక్కులను ప్రవేశించి కలరో వారి యొక్క ధనుస్సులను వేయి యోజనముల దూరమున వింటి త్రాడు తొలగించి ఉంచుడు.
ఏకాదశ.

యజుస్సు 3.
నమో రుద్రేభోయే పృధివ్యాం ంతరిక్షే.
యే దివి  యేషామన్నంవాతోవర్షమిషవ.
స్తేభ్యోదశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీ
ర్దశోదీచీ ర్దశోర్ధ్వాస్తేనో మృడయంతు తేయం ద్విష్మోయశ్చనోద్వేష్టి తంవోజంభేదధామి.
రుద్రులు భూమిపై కలరో,ఏరుద్రులకు ఆహారమే బాణములో, అన్నమే బాణములుగా గల రుద్రులకు నమస్కారము. రుద్రులు ఆకాశమునందుఁ గాలరో, రుద్రులకు వాయువు బాణములో, రుద్రులకు నమస్కారము. రుద్రులు స్వర్గమునందు కలరో, రుద్రులకు వర్షము బాణములో, రుద్రులకు నమస్కారము. తూర్పు ముఖముగా పది వేళ్ళ చివరలు గల అంజలుల తోడను, దక్షిణ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, పడమట ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఉత్తర ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఊర్ధ్వ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, రుద్రులకు నమస్కారములు. రుద్రులు మమ్ములను సుఖపఱచుదురు గాకఎవనిని ద్వేషింతుమో, శత్రువు మమ్ములను ద్వేషించునో, శత్రు ద్వయమును రుద్రులారా! మీయొక్క తెరచి యున్న నోటిలో ఉంచుచున్నాను.

అనువాకము 11 సమాప్తము

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్మృక్షీయమామృతాత్
యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు.
కాల స్వరూపుఁడు, అఖండ ఆనంద స్వరూపుఁడు ఐన పరమాత్మతో యోగము ద్వారా మన దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు మనమూ మృత్యువు నుండి వేరు పడి అమృతత్వమును పొందుదుము గాకఅగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు విశ్వమున భువనములందును రుద్రుఁడు లీనమై యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును గాక.

తముష్టుహి యస్స్విషుసు  ధన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య 
యక్ష్వా మహే సౌ మనసాయ రుద్రం మో భిర్దేవ మసురందువస్వ.
ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు.

అయంమే హస్తో భగవానయంమే భగవత్తర: అయంమే విశ్వభేషజోయం శివాభిమ ర్శన:
శివుని తాకి, పూజించే హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము.

యేతే సహస్ర మయుతం పాశా మృత్యోమర్త్యాయ  హంతవే  తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంధిరసి రుద్రోమా విశాంతక: తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి మమ సర్వాప మృత్యుర్నస్యతు ఆయుర్వర్ధతాం
దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము,ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.
నమకము భావము సమాప్తము