రుద్రము - నమకము - అనువాకము 10
అనువాకము 10
ఋక్కు 1.
ద్రాపే
అంధసస్ఫతే దరిద్రం నీల లోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాంమాభేర్మాஉరో
మో ఏషాం కించనామమత్.
కుత్సితమైన గతిని పొందించువాఁడా! అన్నమును రక్షించువాఁడా! ఏమియునూ లేనివాఁడా! కంఠమున నల్లనివాఁడవై ఇతరత్ర ఎఱ్ఱనివాఁడా! పుత్రపౌత్రాదుల యొక్కయు ఈ మాదగు గో మహిష్యాదుల యొక్కయు, సమూహమును భయపెట్టకుము. ఈ మోక్షమందిన అందఱిలో ఒక వస్తువునైనను నశింప జేయకుము. రోగమందినవారిగా జేయకుము.
ఋక్కు 2.
యాతే రుద్ర. శివా తనూశ్శివావిశ్వాహ భేషజీ.
శివా ఋద్రస్య భేషజీ తయానో మృడ
జీవసే.
ఓ శివుఁడా! నీదగు ఒక శరీరము శాంతమైనది. ఆ శరీరముతో మమ్ములను జీవింప జేయుటకు సుఖింప జేయుము. ఆ శరీరము అన్ని దినములందును రోగ
దారిద్ర్యాదులను తొలగించుటకు ఔషధము వంటిది కాన శుభకరమైనది. శివుని యొక్క తాదాత్మ్యము పొందుటకు ఔషధ రూపమైనదియును, జ్ఞాన దానముచే సంసార దుఃఖమును తొలగించును గాన
మంగళకరమైనదియును అగుచున్నది.
ఋక్కు 3.
ఇమాగం రుద్రాయ తవసేకపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహేమతిం. యథానశ్శమసద్ద్విపదే
చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ న్ననాతురం.
ఏ ప్రకారముగా మా యొక్క పుత్ర పౌత్రాది రూప మనుష్యునకును మహిష్యాది రూప
పశువునకును, సుఖము అగునో, ఇంతే కాదు. ఈ గ్రామము నందలి ప్రపంచము సుఖ
పూర్ణమును, ఉపద్రవ శూన్యమును అగునో అట్లు మేము రుద్రుని కొఱకు ఈ పూజ
ధ్యానము మున్నగు వానికి చెందిన బుద్ధిని గొప్పగా పోషించు చున్నాము. బల యుక్తుఁడును, తాపస వేషుఁడును, క్షీణించు ప్రతిపక్ష పురుషులు కలవాఁడు నగు రుద్రునకు సకలమును సమర్పించు చున్నాము.
ఋక్కు 4.
మృడానో రుద్రో తనో
మయస్కృధిక్షయ ద్వీరాయ నమసా విధేమతే.
యచ్ఛంచయోశ్చ మనురాయజే పితాతదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ.
ఓ శివా! మమ్ములను ఇహ లోకమున సుఖింపఁ జేయుము. ఇంతే కాదు. మాకు పర లోకమునను సుఖమును చేయుము. నశింప చేయ బడిన మా పాపములును, వీరులును గల నీకు నమస్కారముతో సేవించెదము. పాలకుఁడైన ప్రజాపతి ఏ సుఖమును, దుఃఖమునకు దూరముగా నుండుటను, ఏ లేశమును సంపాదించెనో ఆ సర్వమును మేము ఓ శివుఁడా! నీ యొక్క ప్రణయమును, స్నేహాతిశయమును కలుగగా పొంద గలము.
ఋక్కు 5.
మనో
మహాంత ముతమానో అర్భకం. మాన ఉక్షంత ముతమాన ఉక్షితం.
మానోవధీః పితరం
మోత మాతరం ప్రియా మాన
స్త నువో రుద్ర రీరిషః.
ఓ రుద్రుఁడా! మా యొక్క ముదుసలియైన పురుషుని హింసింపకు. అంతే కాదు. మా యొక్క బాలుని హింసింపకుము. అంతే కాదు. మాయొక్క నీరు చిమ్ముటకు సేవ చేయుటకును సమర్ధుఁడైన పురుషుని హింసింపకుము. అంతే కాదు. మా యొక్క గర్భమందలి పురుషుని హింసింపకుము. మా యొక్క తండ్రిని చంపకుము. అంతే కాదు.మా తల్లిని కూడా చంపకుము. మా యొక్క ప్రియమైన శరీరములను హింసింపకుము.
ఋక్కు 6.
మానస్తోకేతనయేమాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః.
వీరాన్ మానో రుద్ర భామితో உవధీర్హవిష్మంతో నమసా విధేమతే.
రుద్రుఁడా! మా యొక్క సంతానమందును దయ చూపి హింసింపకుము. మా యొక్క ఆయుర్దాయము విషయమై హింసింపకుము. మాయొక్క గోవులందును, మాయొక్క గుఱ్ఱముల విషయమై హింసను ఆచరింపకుము. కృద్ధుఁడవై మాయొక్క వీరులను, భృత్యులను వధింపకుము. మేము హవిస్సు గలవారమై నిన్ను నమస్కారముతో సేవించెదము.
ఋక్కు 7.
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్న మస్మేతే అస్తు. రక్షాచనో అధిచ దేవ బ్రూహ్యధాచనః. శర్మ యచ్ఛద్వి బర్హాః.
గోవులను చంపునట్టియు, అంతే కాదు పుత్ర పౌత్రాది పురుషులను సంహరించు నట్టియు నశింపఁ జేయఁ బడిన సేవకులు గల్గినట్టి
నీయొక్క (ఉగ్ర)రూపమున ఉండు గాక. సుఖకరమగు నీయొక్క రూపము మాయందుండుగాక. ఇంతే కాదు. మమ్ములను అన్ని విధముల కాపాడుము. అంతే కాదు. ఓ ప్రభూ! మమ్ములను ఇతరుల కంటే అధికులుగ చెప్పుము. ఇంతే కాదు రెండు లోకములను వృద్ధి చేయు నీవు సుఖమునొసంగుము.
ఋక్కు 8.
స్తుతిశ్రుతంగర్త సదం యువానం మృగన్న భీమ
ముపహత్ను ముగ్రం. మృడాజరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్ నివపంతు సేనాః.
గుహను పోలిన హృదయ పద్మమును సర్వదా ఉండునట్టియును, నిత్యము యువకుఁడైనట్తియును, భయంకరమైన సింహము వలె
ప్రళయ కాలమున సర్వ జగత్తును నశింపఁ జేయుటకు భయంకరుఁడైనట్టియు ప్రసిద్ధుఁడైన రుద్రుని ఓ నాదగు వాకా! స్తోత్రము చేయుము. మా వచనము చే స్తుతింప బడిన వాడవై ప్రతి దినము నశించు మా శరీరమునకు సుఖము చేకూర్చుము. నీ సేవలు అన్యుఁడగు శత్రువును నశింపఁ జేయు గాక.
ఋక్కు 9.
పరిణో రుద్రస్ర్యహేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతి రఘోయోః. అవస్థిరామఘవ ద్భ్యస్తనుష్వమీఢ్వస్తోకాయతనయాయ మృడయ.
శివుని యొక్క ఆయుధము మమ్ములను పూర్తిగా క్రోధముచే ప్రజ్వరిల్లునట్టియు పాప పరిహారక రూపమును గోరు శివుని యొక్క భయంకరమైన బుద్ధి మమ్ములను విడిచి పెట్టును గాక. వొరోధ వినాశనకై చెక్కుచెదరక యున్న భయంకర బుద్ధిని హవిస్సనెడి అన్నముతో గూడిన యజమానుల నుండి తొలగింపుము. భక్తుల కోరికలను అమితముగా నొసంగు రుద్రుఁడా! మా పుత్రులకు మా మనుమలకును సుఖమునొసంగుము.
ఋక్కు 10.
మీఢుష్టమశివతమశివోనస్సుమనాభవ. పరమే వృక్షి అయుధం నిధాయ కృత్తింవసాన ఆచన
పినాకం బిభ్రదాగహి.
అతిశయముగా వర్షించి తడుపువాఁడా!(కామముల నొసంగువాఁడా)మిక్కిలి శాంతమైన స్వరూపము కలవాఁడా! మమ్ములను గూర్చి శాంతుఁడవును, మంచి మనస్సుతోడను స్నేహముతోడను గూడినవాఁడవగుము. త్రిశూలాదికమును అత్యున్నతమైన మఱ్ఱి రావి మున్నగు వృక్ష జాతమునందుంచి, వ్యాఘ్ర చర్మమును మాత్రము దాల్చువాఁడవై మా కెదురుగా రమ్ము. పినాకమను ధనుస్సును హస్తమున ధరించుచు రమ్ము.
ఋక్కు 11.
వికిరిదవిలోహిత నమస్తే అస్తు భగవః. యాస్తే సహస్రగ్ ం
హేతయో உన్యమస్మన్నివపంతుతాః.
విశేషముగ భక్తుల సన్నిధిని బహు విధముల ధన రాసులను జిమ్మి ఒసంగువాఁడా! తెల్లనివాఁడా! లేదా, మిక్కిలి ఎఱ్ఱనివాఁడా! ఓ భగవంతుఁడా! నీకు నమస్కారమగు గాక. నీకు ఏ ఆయుధములు వేలకొలది కలవో (వానిని) వాటి చే మాకంతే ఇతరుఁడైన విరోధిని నశింపజేయును గాక.
ఋక్కు 12.
సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి.
ఓ శివా నీ యొక్క చేతులందు ఆయుధములు వేయి విధముల వేలకొలదీ కలవు. ఓ భగవంతుఁడా! సమర్థుఁడవగ్చు, ఆ ఆయుధములకు ముఖములను, శల్యములను మాకు పరాఙ్ముఖమగునట్లు చేయుము.
అనువాకము 10 సమాప్తము.