సప్త మాతృకలు
సర్వదేవతలూ
శక్తిస్వరూపాలేనని స్పష్టం చేసే గాధలు అనేకం మన పురాణాల్లో చెప్పబడ్డాయి.
అలాగ పరాశక్తి
"సప్తమాతృకలు"గా అవతరించింది.
బ్రహ్మ , విష్ణు ,శివాది దేవతల శక్తులే
సప్తమాతృకలు .
1) బ్రహ్మాణి : ఈ మాతృమూర్తి
బ్రహ్మ సక్తి స్వరూపిణి. బ్రహ్మవలే హంస వాహిని, అక్షమాల,కమండలం ధరించిన శక్తి.
2) మాహేశ్వరి : శివుని శక్తి.
శివునివలే వృషభం పై కూర్చుని త్రిశూలాన్ని,వరదముద్రని ధరించి,నాగులను అలంకరించుకొని చంద్ర రేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే
మాత.
3) కౌమారి : కుమారస్వామి శక్తి
ఈ తల్లి ! శక్తి హస్త,మయుర వాహనారూఢ !
4) వైష్ణవి : విష్ణు శక్తి.
శ్రీ మహా విష్ణువువలే గరుడవాహనాన్ని అధిరోహించి,చేతులలో శంఖ ,చక్ర గదా,శార్ఙ్గ్ ,ఖడ్గ ఆయుధాలను ధరించిన
అమ్మ!
5) వారాహి : హరి అవతారమైన
యఙ్ఞ్వరాహుని శక్తి. వరాహ ముఖంతో వెలిగే తల్లి.
6) నారసిమ్హి :విష్ణువు
ధరించిన నరసిమ్హ అవతార శక్తి. సిమ్హముఖంతో,నరదేహంతో,అగ్నిమయకాంతితో దివ్యంగా రకాసించే జనని.
7) ఐంద్రీ : ఇంద్రశక్తి.
ఐరావతం పై కూర్చుని వజ్రాయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.
వీరు సప్తమాతృకలు ! అంటే
సర్వదేవతలు అమ్మ రూపాలే.జగదంబ రాక్షస సమ్హారం చేస్తూ ఉండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమేకు సహకరించాయి.
ఇలా
"సర్వంశక్తిమయం" అనే భావనతో ఉండాలి నిరంతరం. అదే మానవ జీవిత సార్ధకత!
ఆ అమ్మ అనుగ్రహమే అసలైన
వరం.
ఆ వరమే అందరం అర్ధించాలి.
అందుకు చిత్తశుద్ధితో ఆ
జగదంబను శరణు వేడాలి !
శ్రీ మాత్రే నమః శ్రీ
మాత్రే నమః శ్రీ మాత్రే నమః