హనుమాన్ చాలిసా మహత్యము
ఉత్తరభారత దేశంలో క్రీII
శ II 16 వ శతాబ్దంలో
జీవించిన సంత్ తులసి దాస్ను సాక్షాత్తు వాల్మికి మహర్షి అవతారంగా భావిస్తారు.
భవిష్యత్పురాణం లో శివుడు పార్వతితో, కలియుగంలో
తులసిదాస్ అనే భక్తుడు వాల్మికి అంసతో జన్మించి ,ఓ ప్రాంతీయబాషలో రామకధ ను ప్రచారం చేస్తాడని చెప్తాడు.
తులసిదాస్ రచించిన "రామచరిత మానస్" సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర
భారతీయులకు రామ కధ ను సుపరిచితం చేసింది.
వారణసి నగరంలో జీవనాన్ని
కొనసాగించిన తులసిదాస్ నిరంతరం రామనామామృతంలో తెలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో
చాలమందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మథస్థులు
సైతం అపర రామభక్తులుగ మారుతూండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు
ఇది రుచించలేదు. తులసి దాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి
అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కాని అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇది ఇలాగ ఉండగా వారణసి లో
ఒక సదాచార సంపన్నుడైన గ్రుహస్తు,తన ఎకైక కుమారునికి చక్కని
అమ్మయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగ జీవితం సాగిస్తు ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. ఝరిగిన దారిణానికి
తట్టుకోలేకపొయిన అతని భార్య హ్ర్దయవికారముగా విలపించసాగింది.
చనిపొయిన యువకుడికి
అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమేను బంధువులంతా ఆపుతూ ఉండగా ,అమే అక్కడ పక్కన తులసిదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయ్న పదాలు
వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయ్న రామ నామ
ధ్యానం లో ఉన్నారు. హట్టత్తుగా కన్నులు విప్పి ఆమేను చుసి " దీర్ఘసుమంగళి
భవ" అని దీవించారు. అప్పుడు ఆమే జరిగినది అంతా తులసి దాస్ కు
విన్నవించుకుంది. అప్పుడు తులసి దాస్ గారు....నా నోట అసత్యం పలికించడు
రాముడు....అని అంటూ.....
అప్పుడు ఆయ్న వారి కమండలం
లో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరు
క్షణం అతను పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటన ప్రత్యేకించి తులసి
దాస్ మహిమలకు విసేషంగాప్రచారం జరిగి రామ భక్తులుగా మారెవారి సంఖ్య నానాటికి ఎక్కువ
అయిపో సాగింది.
ఇంక ఉపేక్షితే కుదరదు అని
గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషాహ్ వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన
చర్య తీస్కోవల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషాహ్ వారు
తులసి దాస్ ను తన దర్బార్లో,ఇ రప్పించారు. అప్పుడు ఆయ్న తో విచారణ
ఇలాగ సాగింది.
పాదుషాహ్ : తులసి
దాస్...మీరు రామనామం అన్నిటి కన్న గొప్పది అని ప్రచారం చేస్తున్నారట?
తులసి దాస్ : అవును ప్రభు!
ఈ సకల చరా చర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు!
రామ నామ మహిమను వర్ణించతం
ఎవరి తరం కాదు.!
పాదుషాహ్ : సరే...మెము
ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము...దానికి ప్రాణం పొయ్యండి ...రామ నామం తో
బ్రతికించండి..అప్పుడు మీరు చెప్పినది నిగమని మేము నమ్ముతాము...
టులసి దాస్ : క్షమించండి ప్రభు!
ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చ్హనుసారం జరుగుతాయి....మానవమాత్రులు
మార్చలేరు..
ఫాదుషాహ్ : అయితే తులసి
దాస్ జి! ంఈ మాట ను నిలుపుకో లేక, మీ అబద్ధాలు నిరూపించూకోలేక లాంటి మాటలు చెబుతున్నారు.మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అన్న్ని అబద్ధాలు అని
సభాముఖముగా దరిముందు ఒప్పుకోండి!
తులసి దాస్ : క్షమించండి
...నేను చెపేది నిగం!
పాదుషాహ్ కి పట్టరాని
ఆగ్రహం వచ్చింది.
"తులసి...మీకు ఆఖరి సారి
అవకాశం ఇస్తున్నాను...నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో.....నీవు చెపీఅవన్ని
అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో.." అని పాదుషాహ్ వారు తీవ్ర
స్వరంతో ఆఞ్ఙాపించాడు.
అప్పుడు తులసి దాస్ కనులు
మూస్కుని, ధ్యాన నిమగ్నుడై శ్రీ రామ
చంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్తిథిని కల్పించిన నువ్వే పరీష్కరించూకోమని
ప్రార్థించాడు.
అది రాజ ధిక్కారముగా
భావించిన పాదుషా తులసి బంధించమని ఆదెసించాడు.
అంటే.....ఎక్కడ నుండి
వచ్చాయో ....కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేసించి తులసి దాస్ ను బంధింప వచ్చిన
సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి
కదలకుండా చేసాయి. ఈ హటాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై
పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసి దాస్ కు సిమ్హద్వారంపై హనుమ దర్సనము
ఇచ్చారు. ఒదలు పులకించిన తులసి దాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేసారు.
ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన
హనుమ " తులసి ! నీ స్తోత్రము తో మాకు చాల ఆనందమైనది..ఏమి కావాలో
కోరుకో...." అన్నారు..అందుకు తులసిదాస్ "తండ్రీ! నాకేమి కావాలి....!
నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు
వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు
తండ్రీ!" అని తులసి కోరుకున్నాడు.
ఆ మాటలతో మరింత ప్రీతి
చెందిన హనుమ "తులసి ! ఈ స్తోత్రం తో మమ్మల్ను ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము" అని వాగ్దానం చేశారు.
అప్పటి నుండి ఇప్పటివరకు "హనుమాన్ చాలిసా" కామధేనువు అయ్యి భక్తులను
కాపాడుతునే ఉంది.
అపర వాల్మికి అయొఇన
తులసిదాస్ మానవళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక "హనుమాన్ చాలిస"దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలిసా పారయణ,గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి
ఎప్పటికి వెలుగుతునే ఉనౄంది...
శ్రీ రమ జయ రామ జయ జయ రామ
!!!!!!!!!