శ్రీ కాళహస్తిలొ భక్త కన్నప్ప


అర్జునుడు పరమేశ్వరసాయుజ్యం పడయుటకు తిన్నడుగా కలియుగమున జన్మించెను.పోత్తపినాడు అని తెలుగు దేశంలో గల ప్రాంగణంనందు" ఉడుమూరు` అను బోయపల్లె కలదు.అందు నాధనాధుడు-తండే అను బోయ దంపతులకు శివను గ్రహంచే ఓకే మగ శిశువు కలిగెను.ఆ బాలునకు తిన్నాడు అని పేరు పెట్టిరి.అతడు విల్లు విద్యలో దిట్ట అయ్యెను.ఒకనాడతాను వేటాడి అలసిపోయి చెట్టు క్రింద నిద్రించుచుండ శివుడు సాక్షాత్కారించి ఇట్లు అనెను.ఇక్కడ కొండ దగ్గర మొగలేటి ఒడ్డున శివుడు ఉన్నాడు.పోయి అతనిని కలువుము అని చెప్పెను.వెంటనే మేల్కొని చూడగా ఒక అడవి పంది కనిపించెను.ఆ పందిని వేటాడుచు దాని వెంట పడగాఅది తిరిగి తిరిగి శివుడుఉన్నచోటికి వానినిదెచ్చెను.అప్పుడు తిన్నాడు ఆ చోటనే శివుని సానిధ్యంను నిలిచిపోయి తన్మయుడై శివుని పరిపరివిధముల తన నివాస గ్రహంకు రమ్మని ప్రాద్ధించెను.కాని తన వేడుకోలు ఫలింపకపోగా నాతడచ్చటనే శివుని యెద్ద నిలిచిపోయాను.ప్రతిదినం నిద్రనుండి మేల్ఖోని ఈశ్వరుని తుష్టి యొనర్ప దగ్గర అరణ్యమునకు వెళ్లి పందిని వేటాడి చంపి,కాల్చి మాంస ఖండముల రుచి చూచి,పక్వమైన వానిని యేరి ఆకు దొప్పల యందుఉంచుకొని ఫల,పుష్ప,బిల్వదళంబులను శిరంఫై మోపి చంకయందు వింటిని,వీపున నమ్ములపోదయు పుక్కిట సువర్ణముఖినది తీర్ధంను గొని తన యరాధ్య దైవంముకడ కరుదేన్చెను.నోటితో తెచ్చిన గంగతో శివనభిషేకించి,ఆకుదోప్పలతో తెచ్చిన మాంసశకలంబులను మహా నైవేద్యంగా శివుడు ప్రీతి చెందగా తిన్నాడునందించి చుండెను.

అసమయమున శివగోచరుడను సదాచార సంపన్నుడైవ నొక బ్రాహ్మణుడు కుడా వచ్చి స్వామిని ప్రతి దినం అర్చించి పోవుచుండెను.చాలాకాలం నుండి పూజించుచున్న ఆ బ్రాహ్మణునికి కొత్తగా చేయుచుండిన తిన్నడి పూజలు,ఎంగిలి అమంగళంగా కనపడెను.దానికాతడు విచారించి " స్వామి నీ ఆలయం ఇటివల కొన్ని దినములుగా నీ రీతిగా రోతగా మారుటకు కారణమేమి మరి మరి ప్రాద్ధించి " తెలుపకున్న ప్రాణములు విడుతానని శాపదంబు చేసెను. అప్పుడు స్వామి వాక్కుగా ఇట్లు వినబడెను.ఒక చెంచు ఈ విధంగా పూజ చేయ చున్నాడు.అతడు గొప్ప భక్తుడు,వాని భక్తికి ఎంత మహిమ గలదో నీవు కుడా చూతువుగాక !. అని అతనిని తన వెనుక దాగియుండి అంతయు గంచామనేను.

కొంతః సేపటికి వాడుక మేరకు తిన్నాడు యధాప్రకారంగా వచ్చి స్వామికి అభిషేకమాచారించి తాను తెచ్చిన మాంసమును తినమనేను.కాని స్వామి తినలేదు.ఇంతలో స్వామికి ఒక కన్ను వెంట నీరు కారటం ఆరంభించెను. క్రమముగా అది అధికమై ఉండటం తిన్నాడు గమనించి స్వామికి కంటి జబ్బు వచ్చిందని చాలా భాధపడెను.వైద్యం చేసి నయం చేయాలనీ చూచాడు. గుడ్డను చుట్టగా చుట్టి నోటి ఆవిరి పెట్టి కంటి కద్దినాడు.తంగోడాకు మెత్తినాడు.నిమ్మరసంతో నూరి వేసినాడు. కలువ పూలు తెచ్చి కంటికి రుద్దినాడు.అడవి అంతయు తిరిగి వెదకి వెదకి ఎన్నో మూలికలు తెచ్చి వేసినాడు.ప్రయోజనం లేకపోయాను.అంతటితో కంటి నుండి నెత్తురు కుడా కారడం ఆరంభించెను.చివరకు కంటికి కన్నే మందు అని అనుకోని బావంతో తనకంటినొక దానిని పెకలించి స్వామి కంటిఫై అంటి పెట్టెను.దానితో స్వామి కన్ను నెమ్మదించెను.ఈ కొత్త కన్ను తొలుతటి కంటికన్నా మిక్కిలి ప్రకాశంగా కనబడెను.కాని వేను వెంటనే రెండోవ కంటి నుండి నెత్తురు కారడం ఆరంభించెను.తిన్నడప్పుడు.ఒక నవ్వు నవ్వి `ఓ స్వామి , నీ దయచే కంటికి మందు ఉన్నదీ. ` అని కాలితో నెత్తురు కారుచున్న స్వామి వారి రెండోవ కంటికి గుర్తుకై అదిమిపెట్టిన తన రెండోవ కంటిని పెకలింపబోయాను.వెంటనే శివుడు తిన్నని భక్తి పారవశ్యంకు మెచ్చి సతీ సమేతుడై ప్రతక్ష్యమై తిన్ననికి,ఆ బ్రాహ్మణునికి శివ సాయుజ్జ్యం నొసగెను.ఆనాటి నుండి తిన్నాడు శివునకు కన్నిచ్చిన సార్ధకంగా కన్నప్ప అను పేరు వచ్చి లోకులకు భక్తిమార్గ ప్రదిపకుడను శ్రీ కాళహస్తి క్షేత్రంలో భక్త శిరోధార్యంమై వేలుగొండుచున్నాడు.దేవాలయంకు దక్షిణపు శ్రేణిలోలో నున్న పర్వతం ఫై కన్నప్ప గుడియున్నది.ఈ నాటికీ భక్తులు ఆ కొండనెక్కి భక్తుడైన కన్నప్పను దర్శించుకొని ధన్యులుఅగుచున్నారు.

పరివార దేవతలు
బృగు మహర్షి అర్ధ నారీశ్వర లింగమును ప్రతిష్టించేను.అగస్త్య ప్రతిస్టితమైన నీలకంఠెశ్వర లింగం,మణికంఠెశ్వరుడు.ఆత్రేయ ప్రతిష్టితుడు.వ్యాస ప్రతిస్టత లింగం ప్రాశస్తమైనది.మర్కేండేయ ప్రతిష్టత లింగం,ప్రతిభా మూర్తి మృతుంజయేశ్వర లింగం. మర్కేండేయని కాలుని బారినుండి రక్షించిన వరమూర్తి సహస్ర లింగేశ్వరుడు,ఇంద్రాది దేవతా ప్రతిస్టతమూర్తి ఇవిగాక సప్త ఋషి ప్రతిస్టతo. రామ పరుశురామ ప్రతిస్టతములైన లింగములు కుడా గలవు.కరువు కటాకంలో మృతుంజేయశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం చేయిoచిన వర్షములు కురియును. కాలభైరవుడు ఇచ్చట క్షేత్రపాలకుడు ఇవిగాక ధర్మరాజు, యమధర్మరాజు,చిత్రగుప్తుల చేత ప్రతిస్టితంలైన లింగములు కలవు.వివిధ గణపతి మూర్తులు సుబ్రమణ్యస్వామి,సూర్య శని గ్రహ మూర్తులు గూడా కలవు. వీరందరూ శ్రీ కాళహస్తిశ్వర స్వామికి పరివార దేవతలై యున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వరదరాజస్వామి,శ్రీ వీర రాఘవ స్వామి వారలు కుడా ఈ దేవాలయంన గలరు.నిలువెత్తు కన్నప్ప విగ్రహం చూడ గంభీరంగా నుండును. కాశి విశ్వేశ్వరుడు ఇచ్చట వెలసి యున్నాడు. శ్రీ శంకర చార్యుల వారి స్పటిక లింగం ఉదాత్తమైనది. 63 నాయనర్లు లోహ విగ్రహములు కుడా కలవు.


మండపములు
శిల్ప చిత్రకళా ఖండములుగా మండపములు,స్తంభములు,వర్ణ చిత్రములు ఈ దేవాలయంన పెక్కుగలవు.నగరేశ్వర మండపం, గుర్రపు సాని మండపం, నూరు కాళ్ళ మండపం, (రాయల మండపం) పదు నాల్గుకాళ్ళ మండపం, కోట మండపం పెర్ఖోనదగినవి. నూరు కాళ్ళ మండపం ఎంతో శిల్పమయమైనది. పదహారు కాళ్ళ మండపంలోనే 1529 లో శ్రీ కృష్ణ దేవరాయల సోదరుడైన అచ్చుత రాయల పట్టాభిషేకం మహోత్సవంజరిగింది. కోట మండపం బహు ఉదాత్తమైనది.అమ్మవారి దేవాలయ ప్రాంగణంన అస్త్తోతర లింగ ముఖ ద్వారమున ఫై కప్పులోని చిత్రకళ వైభవం వర్ణించనలవికాదు. ఆ రంగులు శత శతాబ్దాలుగా ఈనాటి వానివాలే నిత్య నూతనంగా కనబడుచున్నవి.

నటరాజ రంగ స్టలము- బ్రహ్మ గుడి

పల్లవుల నాటి శిల్ప కళ ఖండములకు,చతురస్రాకార సభా మండప వేదికలకు,నిర్మాణ కౌశల్యంకు ప్రతికములైన చోటు నటరాజ రంగ స్టలము,ఇచ్చట పంచముఖేశ్వరస్వామి విగ్రహం సుందరం అపురూపమైనది.దేవాలయ మాద్యంతంను శిల్పకళమాయం,రాతి దులములు,సహస్రమునకు ఫైగా గల రాతి స్తంభములు అత్యద్భుత మానవ కళా సృష్టికి నిదర్సనములు. దర్సనియములు,కనకదుర్గ చలమునన్నుది. ఈమె వార శృంగార మూర్తి,దసరా శరన్నవ రాత్రుల్లో ఉత్సవములు జరుగును.విద్య క్షేత్రంన శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం ఉన్నదీ.ఇచ్చటనే కుమారస్వామి నారదునికి బ్రహ్మోపదేసం చేసెను.ఆడి కృతిక ఉత్సవం ( ఆషాడ మాసం) ప్రఖ్యాతిగా జరుగును.

దేవాలయ పరిపాలక- వసతులు 

దేవాలయంకు పరిపాలన వ్యవస్టగా నొక ధర్మ కర్త్తల మందలి బోర్డు కలదు. దేవాదాయ శాఖలోని ఒక ఉప కమిషనర్ హోదాలో కార్యనిర్వహణఉద్యోగిగా నియమితులై పరిపాలన జరుపబడుతున్నది. శ్రీ కాళహస్తిశ్వర స్వామి వారి వసతి గృహం, బాలజ్ఞానంబ సత్రం,శంకర ముని వసతి గృహం,త్రినేత్ర నట రాజ వసతి గృహం,శివ సదన్,భరద్వాజ సదన్లు దేవస్తానం అద్వర్యంలో యాత్రికుల సౌకర్యార్ధం గలవు.