ధనుర్మాసం -ధనుస్సంక్రమణం

మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక. ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే.

ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు.

ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఈకాలంలో విష్ణుపూజదాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం.
గొబ్బిళ్ళు అనే పేరు ఎలా వచ్చింది

ఇంటి ముందు ముగ్గు పెట్టడం ద్వార లక్ష్మిని ఆవాహనం చేస్తాం . పూర్వం ద్వాపర యుగం లో గోపికలు గోమయం తో  గొబ్బిళ్ళు చేసి ముగ్గులు వేసి కాత్యాయని వ్రతం శ్రీ వ్రతం అని చేసేవారు. వారి ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టికృష్ణుడే భర్త గ రావాలి అని ప్రార్ధన చేసే వాలు . గోపికల చేసారు కబ్బటి కాలమానం లో గొబ్బిళ్ళు అని పేరు వచ్చింది.

ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. 

ధనుర్మాసం వ్రతం
గోపికలు కృష్ణుడినే భర్త గ కావాలి అనుకునే వాలు ఈ మాసం లో ధనుర్మాసం వ్రతం చేస్తారు .

సంతాన కోసం
విష్ణు చిత్తుడు కేవలం మహాలక్ష్మే తనకి కూతురిగా కావాలని నెల రోజుల పాటు ధనుర్మాసం లో వ్రతం చేసినందు వల్ల గోదాదేవి తనకి దొరికింది . గోదాదేవి కూడా కృష్ణుడిని పూజ చేసి కృష్ణుడినే భర్త గ పొందింది .


ఈ వ్రతం చేయాలి అనుకునే వారు కానీ భక్తీ తో ఈ మాసం పూజ చేయాలి అనుకునే వారు కానీ తెల్లవారుఝామునే లేచి స్నానం చేసి లక్ష్మి నారాయనులకి పూజ చేసి సూర్యుడికి నమస్కరించి పులగం కానీ పాయసం కానీ పెరుగు అన్నం కానీ నైవేద్యం చేసి నివేదన చేయండి . ఇంట్లో పూజ చేసుకోవడం కుదరక పోతే గుడికి వెళ్లి అర్చన చేయించుకుని ప్రదక్షిణ చేసి ప్రసాదం తినడం (గుడిలో పెట్టిన ప్రసాదం ) వలన కూడా కోరిన కోర్కెలు తప్పక తీరుతాయి .

భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ.


ధనస్సు రాశి లోకి రవి ప్రవేసిస్తునాడు దీనినె ధనుర్మాసం అంటారు . రవి ధనస్సు రాశి లో నుంచి మకర రాసి లోకి వచ్చే వరుకు ఉన్న గడియ ధనుర్మాసం అంటారు . ధనుర్మాసం లో లక్ష్మినారయనలుని పూజ చెయలి. సూర్యుడికి కి పూజ చేయడం .  ఈ మాసం లో కేవలం దేవత కార్యం మాత్రమే చేయాలి .
ధనుర్మాసం లో సూర్యుడికి కి పూజ చేస్తారు . అంటే సూర్యోదయానికి దీపం పూజ నివేదన అయిపోవాలి . సూర్యుడు వచ్చే సమయానికి సూర్య నమస్కారాలు కానీ సూర్యుడికి అర్ఘ్యం ఇవతమ్ కానీ చేయాలి . ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి గొబ్బెమ్మ సంక్రాంతి వరకు పెట్టుకోవాలి.

రవి ఏ రాశి లో ఉంటె అ మాసానికి అ రాశి పేరు వస్తుంది. ధనస్సు రాశి లో కానీ మీన రాశి లో కానీ రవి ఉన్నపుడు శుభకార్యాలు ఏమి చేయకూడదు. రవి ఇంట్లో గురువు ఉన్నపుడు గురువు ఇంట్లో రవి ఉన్నపుడు శుభకార్యాలు ఏమి చేయకూడదు. చంద్రమానం బట్టి - అమావాస్య నుంచి అమావాస్య సూర్య మనం బట్టి - పూర్ణిమ నుంచి పూర్ణిమ.