నిర్జల ఏకాదశి
నిర్జల ఏకాదశి రోజున నీలు తాగకూడదు . మిగిలిన
ఏకాదశి లో మంచినీలు తాగావచ్చు . ఎప్పుడు ఏకాదశి చేసిన 3 రోజులు నియమ నిష్టలు పాటించాలి దశమి రోజే
సంకల్పం చెప్పుకుని , దశమి రోజు రాత్రి
భోజనం చేయకూడదు , నెల మీద పడుకుని ,
బ్రహ్మచర్యం పాటించాలి . మర్నాడు అంటే ఏకాదశి రోజున తెలవరుఝామున స్నానం
చేసి రోజు ఉపవాసం చేసి నారాయణ నమ సంకీర్తన చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ సాయంత్రం
స్నానం చేసి దీపం పెట్టుకుని రామాయణం లేదా , హరి వంశం , లేదా భాగవతం లేదా భరతం భరతం కానీ రాత్రి అంత
చదువుతూ గడపాలి . ఒకరే చేయడం కష్టం కాబట్టి సామూహికంగా చేస్తే నిద్ర రాకుండా
ఉంటుంది , జాగరణ చేయాలి .
మర్నాడు ద్వాదశి తిధి వచ్చిన తరువాత, ద్వాదశి ఘడియలు పోకుండా లక్ష్మి
నారాయణ తులసి దళాలతో పూజ చేసి
బ్రాహ్మణునికి భోజనం పెట్టి తరువాత భోజనం చేయాలి .
ఉండలేని వారు , ఏకాదశి రోజు ఏమి తినకుండా సాయంత్రం పాలు నివేదన
చేసి అ పాలు తగవాచు . లేదు ఖటినం గానే ఉండాలి అనుకుంటే పాలు పళ్ళు తినకుండా కేవలం
తీర్థమ్ తీసుకుని ఉండవచు . ఒక వేల ఏదో రోగం ఉంది తినకుండా ఉండలేము అనే వాలు ఏదయినా
ఉపహారం లాంటిది తినవచ్చు అంటే , సైదవ లవణం వేసుకుని ధాన్యం లాంటిది తినకుండా
సగ్గుబియం లేదా దుంపలు లాంటివి తినవచ్చు . ముక్యం గ కర్తీక సుద్ధ ఏకాదశి కి తులసి
తో పూజ చేయడం వలన విశిష్ట పహ్లితం వస్తుంది . దీపం పెట్టడం వలన విశిష్ట పహ్లితం వస్తుంది. ఏకాదశి రోజు ఏమి
తినకూడదు , ఎవరికీ ఏమి
తినకూడదు .
అపర ఏకాదశి
ఈ నెలలో మొట్టమొదట వచ్చే ఏకాదశి వైశాఖ బహుళేకాదశి. దీనినే అపర ఏకాదశి, వరూధినీ ఏకాదశి అని పిలుస్తారు. దీనిని ఆచరించడం వలన తీర్థయాత్రలు చేసిన ఫలితం దక్కుతుందని, రాజ్యప్రాప్తిని కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజించి, ఏకాదశీ వ్రత నియమాలతో జాగరణ చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని, గోదానం చేసిన ఫలితంతోపాఆటు సమస్త తీర్థయాత్రలను చేసిన ఫలితం దక్కుతుందని పురాణణలు చెబుతున్నాయి.
నిర్జల ఏకాదశి
సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించలేవారు ఈ ఒక్క నిర్జల ఏకాదశని ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతారని పురాణాలు చెబుతున్నాయి. మేరుపర్వతమంత పాపాలను మూటగట్టుకున్న వారికైనా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ పుణ్యఫలం ఆ పాపాన్నంతటినీ ప్రక్షాళన చేస్తుంది. పేరులోనే ఉన్నట్టుగా ఈ రోజున ఎవరైతే చుక్కనీరైనా తాగకుండా నియమంగా ఏకాదశిని ఆచరిస్తారో వారికి అనంతమైన పుణ్యఫలితాలు దక్కుతాయి.
పరమేశ్వరుడు చెప్పిన వ్రత మహత్యం
నిర్జల ఏకాదశి మహత్యాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించాడట. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భీముడికి దీనిని గురించి వివరించినట్టు పురణాలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. దీనినే త్రివిక్రమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజును త్రివిక్రముడిని ఆరాధించాలి. ఈ రోజును స్వామిని పంచామృతాలతో అభిషేకించి, తులసిదళాలతో అర్చిస్తే సకల పాపాలు ప్రక్షాళనమయి అద్భుతమియన పుణఫలితాన్ని మూటగట్టుకోవచ్చాని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మిగిలిన ఏకాదశి ఉపవాసాలలో నీళ్ళు తాగి ఉపవాసం ఉండవచ్చని చెప్తారు పెద్దలు. కానీ ఈ నిర్జల ఏకాదశి రోజున ఆచమనం సమయంలో తప్ప ఇంకెప్పుడు నీళ్లు తాగకుండా నియమం పాటించాలి. వ్రతం పుర్తయిన తరువాత బెల్లం, వడపప్పు, నెయ్యి, వస్త్రం, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు, బ్రాహ్మణుడికి దానమివ్వాలి.
భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి
ఈ ఏకాదశికి భీమ ఏకాదశి అని పాండవ ఏకాదశి అని కూడా పేర్లున్నాయి. ఈ పేర్లు రావడానికి కూడా ఒక పురాణం ఉంది. ఒకసారి ధర్మరాజు ఏకాదశి వ్రతాన్ని గురించి వివరించమని వేదవ్యాసుని కోరాడు. అప్పుడు వేవవ్యాసులనే ప్రతినెలలోనూ రెండు చొప్పున సంవత్సరం మొత్తం మీద వచ్చే పన్నెండు ఏకాదశులను వివరించి, ఆయా ఏకాదశులకు నియమబద్ధంగా ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువును పూజిస్తే అక్షయమైన పుణ్యఫలితాలు చేకూరుతాయని, కాబట్టి ఆ వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. అఇుయతే ఆకలికి ఏమాత్రం సహించలేని భీముడు ఇలాంటి వ్రతాన్ని ఆచరించడం తనవల్ల కాదనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు వేడుకున్నాడు. నిరాహారంగా ఉంటూ చేయవలసిన ఈ వ్రతాలు చేయడం తనవల్ల అయ్యే పనికాదు కాబట్టి తనకు మర్గాంతరం ఉపదేశించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడికి ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని వివరించి ప్రతిమాసంలోనూ ఏకాదశులకు ఉపవాసం ఆచరించలేని నువ్వు ఈ నిర్జలేకాదశిని ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితాన్ని పొందవచ్చని తెలిపాడు. ఆ విధంగానే భీముడు కూడా నిర్జలేకాదశిని నియమబద్ధంగా ఆచరించి పుణ్యఫలాలను పొందాడు. అందుకే దీనికి భీమ ఏకాదశి అని, పాండవేకాదశి అని కూడా వ్యవహరిస్తారు.
జ్యేష్ట బహుళ ఏకాదశి
దీనినే సిద్ధఏకాదశి అని, యోగిని ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ ఏకాదశిని ఆచరించడం వలన సర్వపాపాలను హరిస్తుంది.