దుర్గా నామ మంత్రం
ద్ + ఉ + ర్ + గ్ + అ అనే ఐదు బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ.
ద కారం - దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను) పోగోడుతుంది.
ఉ కారం - మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది.
ర కారం- రోగాలు రాకుండా రక్షిస్తుంది.
గ కారం- మనం చేసిన పాపాలను పోగొడుతుంది.
అ కారం - శత్రు నాశనం చేస్తుంది.
అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.