భూలోకంలో చేసే పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? - 2


15. పూయోదకం:
చేసిన పాపం: వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా,మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు నరకంలో శిక్ష పడుతుంది.
శిక్ష: వైతరణిలో ఉండే కాలుష్య జలమే నరకంలో ఒక బావిలో ఉంటుంది. ఇక్కడా పాపి బావిలో నీటిని మాత్రమే తాగి బతకాల్సి ఉంటుంది.

16. ప్రాణరోధం:
చేసిన పాపం: కుక్కలు వగైరా జంతువుల్ని వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలుహరించే వారి కోసం నరకం తలుపులు తెరిచి ఉంటాయి.
శిక్ష: ఇక్కడ క్రూరజంతువులను వేటాడమని పాపి మీదికి వదులుతారుఅవి కండకొక ముక్కగా కొరుక్కు తింటుంటే, పాపి భయంకరమైన మరణవేదన పడతాడు.

17. వైశాశనం:
చేసిన పాపం: పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే, తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా నరకానికి వచ్చి పడతారు.
శిక్ష:  మింగ మెతుకు ఇవ్వకుండా, తాగడానికి నీళ్ళు చుక్క కూడా ఇవ్వకుండా యమభటులు మాత్రం పెద్ద ఎత్తున ఘుమ ఘుమలాడే వంటకాలు తింటూ పాపిని శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. ఇక్కడున్నంత కాలం పాపి ఆకలిదప్పులతో మలమలామాడిపోతాడు.

18. లాల భక్షణం:
చేసిన పాపం: అతి కాముకులు, భార్యను కట్టు బానిసగాకన్నా నీచంగా చూసేవాళ్ళు, పరాయి స్రీలను బలవంత పెట్టి తన ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగిస్తారు. ఇలాంటి వార్తలు తరచు వినబడుతుంటాయి.
శిక్ష: అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే నరకం ఉంది. అటువంటి వారిని ఇక్కడకు తెచ్చి వాడి వీర్యాన్నేకాదు మంది వీర్యాన్ని కూడా తాగిస్తారు. వీర్యపు సముద్రంలో పడేస్తారు. ఇందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తి చేయాలి.

19. సారమేయాదిదానం:
చేసిన పాపం: ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు నరకానికి వస్తాడు. సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసే వారు ఇక్కడకు వస్తారు
శిక్ష: వారికి నరకంలో తినడానికి కుక్క మాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే ఆలోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి పడి, పాపి మాంసాన్ని పీక్కు తింటాయి.

20. అవీచి:
చేసిన పాపం: తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, వ్యాపార వ్యవహారాల్లో అబద్దాలు చెప్పి మోసం చేసే వాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను నరకానికి తీసుకువస్తారు
శిక్ష: నీటిబొట్టులేని నరకం ఇది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే సముద్రమేదో ఉండే దోమో అనిపిస్తుంది.. అందులో ఎంతో ఎత్తైనకొండ ఉంటుంది. దాని మీద నుంచి కిందికి తోసేస్తారు. పాపి సముద్రంలో పడిపోతున్నానేమో అని కంగారు పడతాడు. కానీ కొండ కింద సముద్రం ఉండదు. రాతి పలకల మీదపడి ముక్కలు ముక్కలవుతాడు. కానీ చావడు. శిక్ష అదే పనిగా అమలు చేస్తారు.

21. అయోపానం:
చేసిన పాపం:  నరకం తాగుబోతుల కోసమే ఉందిమద్యం,మత్తుపానీయాలు మద్యకాలంలో మగవారితో సమానంగా ఆడవారుకూడా త్రాగడం ఒక సంస్కృతిగా మారిపోయింది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి.
శిక్ష: పాపులు బతికిఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు శిక్షలు విధిస్తారు. ఆడ తాగుబోతు అయితే ఇనుపద్రవాన్ని తాగాలి. మగ తాగుబోతు లావా తాగాలి. యజ్ఞ యాగాదుల్లో సోమపానం చేయడం ఆన వాయితి. ముసుగులో మద్యం పుచ్చుకునే వారికి కూడా ఇక్కడే శిక్ష పడుతుంది. యముడు స్వయంగా పాపి గుండెపై నించుని శిక్షను అమలు చేస్తాడు.


22. రక్షోభక్షం:
చేసిన పాపం: జంతు బలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం నరకం ఉంది.
శిక్ష: బలి పశువు ఎంత బాధ పడుతూ ప్రాణాలు వదులుతుందో అలాగే పాపి కూడా హింసపడుతూ మరణించే విధంగా వాడి చేతిలో బలైన పశువులు, మనుషులు వచ్చి పాపిని హింసించి, చండాడి కసి తీర్చుకుంటాయి.


23. శూలప్రోతం:
చేసిన పాపం: ఎదుటి వాడు అపకారం చేయక పోయినా నిష్కారణంగా ప్రాణాలు తిసేవాళ్ళను, నమ్మకద్రోహం చేసేవాళ్ళను నరకానికి పంపు తారు.
శిక్ష: అక్కడ వాళ్ళను శూలానికి గుచ్చి వేలాడ దీస్తారు. భరించరాని బాధకుతోడు అన్నం పెట్టరు. తాగడానికి నీళ్లు ఇవ్వరు. దీనిక తోడు దెబ్బలతో హింసిస్తారు.


24. రకర్దమం:
చేసిన పాపం: మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను నరకానికి తీసుకువస్తారు.
శిక్ష: వాళ్ళను తలక్రిందులుగా వేలాడదీసి అతి క్రూరంగా హింసిస్తారు


25. దంద శూకం: 
చేసిన పాపంతన తోటి మానవుల్ని జంతువుల్లా వేటాడటం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కుల్ని హరించడం లాంటివి చేస్తాడో వాడు నరకానికి వస్తాడు.
శిక్ష: వాడు జంతువుల్ని హీనపరుస్తూ, సాటి మనిషిని వాటితో పోలుస్తూ హింసిస్తాడో, జంతువులు పాపిని చీల్చి చెండాడుతాయి.


26. వాతరోదం:
చేసిన పాపం: అడవుల్లో చెట్లమీద, కొండ కొమ్మల్లో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువుల్ని పట్టి పల్లార్చేవారు నరకానికి వస్తారు.
శిక్ష: వారిని నిప్పుతో కాల్చి, విషం ఇచ్చి, ఆయుధాలతో హింసిస్తారు



27. పర్యావర్తనకం:
చేసిన పాపం: ఆకలితో అలమటించే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడే వాడిని నరకంలో పడేస్తారు.
శిక్ష: ఇక్కడికి రాగానే కాకులు, గద్దలు కళ్ళుపొడిచి ఎక్కడికీ పారిపోయే వీలు లేకుండా చేస్తాయి. తర్వాతరోజు ముక్కలు ముక్కలుగా కండలూడదీస్తాయి.
  
28. సూచీముఖం:
చేసిన పాపం: గర్వం, పిసినారి తనం ఉన్న వారిని, రోజు వారీ ఖర్చులకుకూడా డబ్బు తీయని వారినే, పరమ లోభులను ఇక్కడకు తీసుకువస్తారు.వీళ్ళు తమ కడుపు కోసం తినరు, ఇంకొకరికి పెట్టరు. అప్పుచేసి ఎగనామం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు.
శిక్ష: ఇక్కడ పాపుల్ని నిరంతరం సూదులతో పొడుస్తారు. ఇవి కాక దుర్భుదం, నిరర్భుదం, యెయెయె, హిహిన, ఉత్పల, పద్మ, మహా పద్మలని చల్లటి నరకాలు కూడా ఉన్నాయి. నరకాల్లో పడిన వాళ్ళు చలికి బిగుసుకుపోయి గడ్డకట్టుకుపోతారు.