లొట్టాయ్ కథ
అనగనగా
ఒక ఊళ్ళో సన్నగా ఉన్న
ఒక అబ్బయి ఉండేవాడు. వాడిని అందరూ "లొట్టాయి" అని పిలిచేవారుట. వాడికి
ఆ పిలుపు నచ్చేది కాదట. ఎవరన్నా అలా
పిలిస్తే బోలెడు కోపం వచ్చేసేదట. ఒకరోజు
నడుచుకు వెళ్తూంటే దారి పక్కగా ఉనా
తోటకూర మొక్కలు "రివ్వు రివ్వు లొట్టాయ్..రివ్వు రివ్వు లొట్టాయ్.." అని ఊగాయిట. వాడికి
కోపం వచ్చి ఆ తోటకూర
మొక్కలను కోసేసి ఇంటికి తెచ్చి పులుసు వండమని వాళ్ళమ్మకు ఇచ్చాడట.
ఆ
తోటకూర పులుసు ఉడుకుతూ ఉడుకుతూ "కుతకుత లొట్టాయ్..కుతకుత లొట్టాయ్..." అందట. వాడికి ఇంకా
కోపం వచ్చి పులుసంతా తీసుకెళ్ళి
పెరట్లో పారబోసాడుట. అది తిన్న ఆవు
పాలు ఇస్తూ "చుయ్ చుయ్ లొట్టాయ్..చుయ్ చుయ్ లొట్టాయ్..."
అందట. అప్పుడు లొట్టాయ్ కి ఇంకా కోపం
వచ్చి ఆ ఆవును చంపివేసి
చెప్పులు కుట్టించుకున్నాడట. నడుస్తూంటే ఆ చెప్పులు కూడా
"కిర్రు కిర్రు లొట్టయ్..కిర్రు కిర్రు లొట్టయ్.." అనటం మొదలెట్టాయిట. అప్పుడు
వాడు వాటిని దూరంగా విసిరేసాడట.
ఆ
చెప్పుల్ని తిన్న కుక్క ఒకటి
"భౌ భౌ లొట్టయ్..భౌ
భౌ లొట్టాయ్.." అని అరవటం మొదలెట్టిండట.
ఈసారి లొట్టాయికి అమితమైన కోపం వచ్చి ఆ
కుక్కను పక్కనే ఉన్న బావిలో పడేసాడట.
బావిలోంచి "బుడుగు బుడుగు లొట్టాయ్..బుడుగు బుడుగు లొట్టాయ్.." అని శబ్దమ్ రాసాగిందట.
ఇక వాడు ఊరుకోలేక మితిమీఇన
కోపంతో బావి లోకి దూకాడుట..."బుడుంగ్ లొట్టాయ్.." అని ములిగిపోయాడుట.
ఈ
కధలో ఆవుని చంపాడనగానే అదేంటమ్మా,
ఆవును ఎలా చంపుతాడు? తప్పు
కదా? అనడిగేవాళ్ళం అమ్మను. "ఏమో మా అమ్మ
అలానే చెప్పేది. "తన కోపమే తన
శత్రువు" అనే నీతిని తెలిపే
కథ ఇది. దీనిలో లాజిక్కులు
వెతకకూడదు" అనేది అమ్మ...