ఆంజనేయస్వామి వారి వాహనం 'ఒంటె' అని అంటారు. స్వామి ఏ సందర్భంలో ఒంటెను వాహనంగా ఉపయోగించారు?
ఇది కథా సంబంధ విషయం కాదు. కథ స్థూలమైనది. ఉపాసన సూక్ష్మమైనది. ఇది ఉపాసనకి సంబంధించిన అంశం. మంత్రమూర్తి అయిన హనుమ వివిధ మంత్రాలలో వివిధ మూర్తులుగా దర్శనమిస్తాడు. మంత్రం వాక్కులు దేవతలు. ఒక హనుమన్మంత్రంలో దీపించే మూర్తి 'ఉష్ట్ర' (ఒంటె)వాహనుడు. ఎడారులలో సైతం పయనించేది ఒంటె. అలా అన్నిచోట్లా గమనం చేసి కాపాడే దైవమితడు అనే భావం ఇందులో ఉండవచ్చు. అంతేకాక ఒక్కొక్క దేవతా వాహనంలో కొన్ని మంత్రశక్తులుంటాయి. అలాంటి శక్తులకి ప్రతీకయే ఒంటె.