మాతృ భాష
ఆపాతమధురమై
యానందమందించు
దివ్య వాక్సతి మన
తెనుగుభాష,
ఆలోచనామృత
ఆనందమందించు
తియ్యందనంబుల
తెనుగుభాష,
జగతినజంతభాషగ
కీర్తి గడియించు
తేటతెలుగునుడుల
తెనుగుభాష,
సరసాంగి యనుకూల సరళయై యొదిగెడు
దేవభాషాపుత్రి తెనుగుభాష
అట్టి భాష
నేర్చుకొనుట యట్టి దేశ
మందు
పుట్టుటయునునన్న నల్ప ఫలమె?
అది తపఃఫలంబనుట
యథార్థ మయ్య !
మాతృభాషను
సేవించి మనగదయ్య
కోకిలమ్మ పాటయు,
పసికూన ముద్దు
మాట, ముత్యాల మూటయు, మల్లె తోట,
తేటిపాట,నెమలియాట,తెనెయూట
జగతిని తెనుగు మాటకు సాటి్ రావు.
తే.గీ. చలువ
వెన్నెలయు,జిలుగు వలువ,
చెలియ
కులుకు, కలువచెలువమును,చిలుక పలుకు,
మలయ పవనంబు,
సెలయేటి కలరుతంబు
తులయగునె యిలను
తెలుగు పలుకుబడికి.
పరిరక్షించెను
పూర్వ సంస్కృతి కళాపారమ్య రమ్యాకృతిన్
వరలెన్నీత్యుపదేశ
వాఙ్మధురస స్వాదుత్వసంపన్నయై,
తరుణీసమ్మిత
కావ్యసౌరభలసత్సన్తుష్ట దిక్చక్రమై,
విరిసెన్
వేయిదళాలపద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే
డా .యస్వీ రాఘవేంద్ర రావు .