అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం
అసురులు తాగేది శురాపానం,
దేవతలు తాగేది సోమపానం (యజ్ఞంలో ఇచ్చేది
సోమపానం).. సురాపానం తగినవారికి పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అని శాస్త్రం!
సృష్టి ప్రారంభం అయిన
తరువాత ఒకసారి దేవతలకి, అసురులకి యుద్ధం జరిగింది!
ఆ యుద్ధంలో దేవతలు అసురులని చంపుతున్నారు! కానీ అసురులు మళ్లి దాడులు చేస్తున్నారు
ఇలా కొన్నాళ్ళు జరిగింది! అయితే దేవతలకి అనుమానం కలిగింది!
మనం
సంహరిస్తుంటే మల్లి బ్రతికి వస్తున్నారు! అసలేం జరుగుతుంది అని ఆరా తీస్తే రాక్షస
గురువు శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో బ్రతికిస్తున్నాడని తెలిసింది! అప్పుడు
దేవతలు వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకుంటే బాగా అలోచించి దీనికి ఒకటే విరుగుడు ఉంది!
మీలో ఎవరైనా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సంజీవని మంత్రం నేర్చుకోండి అనగానే
దేవతలు భయపడి అయ్యబాబోయి శుక్రాచార్యుడ రాక్షస గురువు అయన! మనమంటే నేర్పడు!
కాబట్టి ఇంకో మార్గం అలోచించి చెప్పండి అన్నారు! అయితే మీరు వెళ్లి బృహస్పతిని
కలిసి విషయం నేను చెప్పానని చెప్పండి అనగానే దేవతలంత వెళ్లి బృహస్పతిని కలిసి
విషయం చెప్పారు!
బృహస్పతి అలోచించి తన కొడుకుని పంపిస్తానన్నాడు! దేవతలు సంతోషించి
వెళ్ళిపోయారు! ఆ తరువాత బృహస్పతి తనకోడుకుని శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి విద్య
అభ్యసించి రమ్మన్నాడు! కొడుకు తన తండ్రికి వినయంతో నమస్కరించి వీడ్కొని
శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు! గుమ్మం దగ్గర శుక్రాచార్యుడు కుమార్తె దమయంతి
కుర్చుని ఉంది! ఇతనిని చూడగానే కళ్ళు రెపరెపలాడిస్తూ ఆ అందం చూసి మురిసిపోయి
సిగ్గుపడి కుడికాలి బొటనవ్రేలు నేలపై రాస్తూ ఉంది!
అది గమనించి నేను గురువుగారిని
చూడటానికి వచ్చాను! ఎక్కడున్నారో తెలుపండి! దమయంతి సిగ్గుపడి లోపలున్నాడని చెప్పి
సిగ్గుపడుతూ చెంగు చెంగు మంటూ ఎగురుకుంటూ వెళ్లి తండ్రి చాటున దాగి ఇతనినే చూస్తూ
ఉంది! ఇదేమి పట్టించుకోకుండా వెళ్ళగానే గురువుగారిని చూసి వినయంగా నమస్కరించి నేను
బృహస్పతి తనయుడిని, మీ వద్ద విద్య అభ్యసించాలనే
అభిలాషతో మీ దగ్గరికి వచ్చాను! ఆ మాట విన్న శుక్రాచార్యుడు ఓహో నువ్వు బృహస్పతి
కొడుకువా! మీ తండ్రి గారు ఉత్తములు! గొప్పవాడు! ఆపైన దేవతలకి గురువు అలాంటి
బృహస్పతి కొడుకు నాదగ్గర విద్య కోసం వచ్చినందుకు సంతోషం నాయానా! తప్పకుండా
నేర్పిస్తాను!
ఇక్కడ మనం తెలుసుకోవలసింది
ఏంటంటే? శత్రువుని అయిన తన దగ్గరికి
ఆదరించాలి! విద్య అనేది తన పర భేదం లేకుండా నేర్పించాలి! శత్రువు ఎంతటి వాడైన తన
గుణ గణములు పొగడవలసిందే! అలాగే నిజం దాచకుండా ఎక్కడ నుంచి ఎందుకు వచ్చామో అన్ని
చెప్పడం వల్ల మనమీద అభిమానం ఇంకా పెరుగుతుంది! అలాగే అవసరం అనుకుంటే ఎవరినైనా
(మనకంటే ఎక్కువా కావచ్చు, తక్కువా కావచ్చు)
ఆశ్రయించాల్సిందే!
అలా ఒక 1000 సంవత్సరాలు
పాటు గురు సుశ్రుష చేసుకుంటూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడు! మరి రాక్షసులు
ఊరుకుంటారా? (మనలోనే కొందరు
బాగుపడుతున్నారంటే కొందరు చూసి ఓర్వలేక ఎలాగైనా పడుచేయాలని చుస్తున్నారుకదా!
వారుకూడా ఈ రాక్షస జాతిలోని వారే).
అప్పట్లో ఒక నియమం ఉండేది! విద్య
నేర్చుకోవాలంటే గురువు చెప్పిన పని ఏదైనా సరే చేయాలి ఆరోజుకి విద్య చెప్తారు!
ఎందుకంటే గురువు దగ్గరే ఉంటారు శిష్యులు!
అన్ని పనులు పూర్తీ చేశాక విద్యాబ్యాసం
మొదలు పెడతారు! ఉదయం అవులని మేపడానికి అడవికి వెళ్ళాడు! అక్కడ రాక్షసులు వీడిని
పట్టుకొని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారు! సాయంత్రం అయ్యింది! దమయంతి గుమ్మం
దగ్గర కుర్చుని వస్తాడు నారాజు అని ఎదురు చూస్తుంది! ఆవులు వచ్చాయి కానీ ఇతను
రాలేదు! చాలాసేపు ఎదురుచూసింది చీకటి పడుతుంది కానీ రావడంలేదు! అప్పటికే ఈ
రాక్షసులమీద దమయంతికి ఏదైనా చేస్తారేమో అని అనుమానం ఉంది!
ఏడ్చుకుంటూ వెళ్లి
నన్నాగారు ఆయన రాలేదు అని ఏడుస్తుంది! వస్తాడులేమ్మ అని ఒదారుస్తుంటే! ఆవులు అన్ని
వచ్చేశాయి కానీ అయన రాలేదు! వీళ్ళు ఆయన్ని ఏదైనా చేశారేమో నాన్న అని మళ్ళి మళ్ళి
వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూడలేక శుక్రాచార్యుడు కళ్ళు మూసుకొని మొత్తం వెతికాడు!
అడవిలో ఒకచోట రాక్షసులు వీడిని చంపడం, చంపి చెట్టుకి
కట్టేయడం అంతా తన మనోనేత్రం తో చూసి ఎంతపని చేశారు అని సంజీవనిని పిలిచి
బ్రతికించి తీసుకుని రామన్నాడు! సంజీవని స్త్రీ రూపు దాల్చి చంపి చెట్టుకి
కట్టేసిన చోటికి వెళ్లి బ్రతికించి తీసుకొచ్చింది! దమయంతి తండ్రిని కౌగలించుకుని
కృతజ్ఞతలు చెప్పి ఇతనిని చూసి సిగ్గుపడుతూ లోపలి వెళ్ళింది! శుక్రాచార్యుడు
జాగ్రత్త నాయన వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు ఎంత చెప్పినా రాక్షస బుద్ది ఎక్కడికి
పోతుంది! బయటకి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండు అని అయన పనిలో అయన మునిగిపోయాడు!
ఇలా
ఇంకొన్నాళ్ళు గడచిన తరువాత రాక్షసులు అరేయ్ వీడు అసాధ్యుడిలా ఉన్నాడు!
గురువుగారిని వదిలిపెట్టడంలేదు! ఎలాగైనా సంజీవని మంత్రం నేర్చుకోకుండా వెళ్ళేల
లేడు! అని బాగా అలోచించి ఒకనాడు ఇతను అవులని తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు
రాక్షసులు అంతా ఒరేయ్ వీడిని చంపి వదిలేస్తే మళ్లి బ్రతికిస్తున్నాడు కాబట్టి
ఈసారి కాల్చి బూడిద చేద్దాం అని చంపి భూడిద చేశారు! మళ్లి రాక్షసులకి ఒక సందేహం
వచ్చింది ఒరేయ్ ఇలాకాదు కానీ ఈ బూడిద తీసుకొని గురువు గారు తాగే సురలో కలిపేద్దాం
అని ఆ బూడిద తీసుకెళ్ళి సురాపానం ఉన్న పీపాలో సురలో కలిపేశారు!
సాయంత్రం అయ్యింది
ఆరోజు శుక్రాచార్యుడు రోజు తాగే సురకంటే ఎక్కువ తాగి ఊగిపోతున్నాడు! రోజు ఒక పీపా
తాగితే ఆరోజు 6పీపాలు తాగాడు! దాంతో మైకం ఎక్కువ కమ్మింది! మళ్లి అదే సంఘటన!
దమయంతి తండ్రి దగ్గరికి వచ్చింది నన్నారు అయన రాలేదు! అని వలవలా ఏడ్చింది!
శుక్రాచార్యుడు ఊగిపోతూ వస్తాడులేమ్మా అని తూలిపోతూ మాట్లాడుతున్నాడు! దమయంతి కూడా
ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టింది! శుక్రాచార్యుడు తూలిపోతూనే అంతా వెతకడం
ప్రారంబించాడు! అడవిలో ఎక్కడ కనపడలేదు! ఎక్కడా కనపడలేదని అన్ని లోకాలు గాలించాడు
అయిన కనపడలేదు! శుక్రాచార్యుడుకి క్రమంగా మైకం తగ్గడం మొదలయ్యింది!
ఏంటి వీడు
ఎక్కడ వెతికినా కనపడలేదు అని సందేహం వచ్చి తన ఉదరంలో చూశాడు! ఇంకేముంది బూడిద
రూపంలో కడుపులోకి వెళ్ళిపోయాడు! మైకం దెబ్బకి దిగింది! ఒక్క క్షణం పాటు
ఆశ్చర్యపోయాడు! జరిగిందంతా మనోనేత్రంతో చూసాడు! ఎంతపని చేసారు
అనుకున్నాడు!దమయంతికి విషయం చెప్పాడు! భోరు భోరున ఏడ్చి ఎలాగైనా బ్రతికించమని
ప్రదేయపడింది! కుదరదు అన్న వినలేదు! పట్టుపట్టింది! సరే అని తన ఉదరంలో ఉన్న
శిష్యుడిని బ్రతికించాడు కానీ బయటకి తీసుకురావాలంటే కుదరదు ఎలా?
బాగా అలోచించి శిష్యుడితో నాయనా నీకు ఇలా జరిగి ఉండకపోతే
నీకు జీవితంలో ఎప్పటికి మృత సంజీవనిని నేర్పించేవాడిని కాదు! కాని తప్పడంలేదు!
నువ్వు రాకపోతే మా అమ్మాయి ఊరుకోదు! ఈ విద్య తెలియకుండా నువ్వు బయటికి వచ్చావా
నేను చచ్చి పోతాను! కాబట్టి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నన్ను బ్రతికించు అని మృత
సంజీవని విద్య విద్య నేర్పించాడు! అది నేర్చుకుని శుక్రాచార్యుడు ఉదరం చీల్చి బయటకి
వచ్చి గురువు గారిని బ్రతికించాడు!
శుక్రాచార్యుడు శిష్యుడిని
మెచ్చుకుని దీనికంతటికి కారణం అయిన ఈ మద్యాన్ని(సుర) ఎవరు సేవిస్తారో (త్రాగుతారో)
వాళ్ళకి ఘోరమైన నరకం ప్రాప్తిన్చుగాక! సకల పాతకాలు (బ్రహ్మ హత్య పతకం, బ్రూణ హత్య ఇలాంటి పాతకాలు) ఇలా సకల పాతకాలు చుట్టుకొను గాక
అని ఘోరమైన శాపం పెట్టాడు! ఆనతి నుండి సుర తగినవారికి మనో నిగ్రహం కోల్పోయి ఏమి
మాట్లాడతారో, ఏమి చేస్తారో కూడా తెలియని
స్థితికి వెళ్ళిపోతున్నారు! కొందరు తాగిన వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు
చేస్తుంటారు! ఇవన్ని ఆ శాప ప్రభావమే!
ఇక వచ్చిన పని అయిపొయింది
కాబట్టి వెళ్లి వస్తాను గురువుగారు అని నమస్కారం పెట్టి బయలుదేరాడు! దమయంతి చూసి
నన్నాగారు నేను ఇతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను! అంటే శిష్యుడు ఆ మాట విని
గురు పుత్రి సోదరితో సమానం, పోనీ అలాకాదు అనుకున్న నేను
మీ తండ్రి గర్బమ్ నుంచి మళ్లి జన్మ ఎత్తి వచ్చాను అల చూసుకున్నా నువ్వు నాకు
సోదరివి అవుతావ్ కనుక వివాహం మీద ఆశ వదులుకో అని వెళ్తుంటే దమయంతికి విపరీతమైన
కోపం వచ్చి నా మాట తిరస్కరిస్తావా? నువ్వు నేర్చుకున్న విద్య
నీకు ఉపయోగ పడకుండుగాక! అని శాపం పెట్టింది! దానికి ప్రతి శాపంగా నాకు తప్ప
అన్యులకి ఎవరికైన ఉపయోగపడు గాక అని ప్రతిశాపం పెట్టి వెళ్ళిపోయాడు!
అలా సుర తగిన వారికీ సకల
పాతకాలు చుట్టుకోవాలనే శాపం, దమయంతి శాపం, ఇతని ప్రతిశాపం మూలంగా దేవతలందరికీ సంజీవని విద్య వచ్చింది!