క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవ్ - 1

పూర్వం ఒక బ్రాహానోత్తముడు తన వ్రుత్తి వదిలి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు! కానీ ఇంకా సంపద మీద కోరిక తీరక దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు! అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారాలు తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతోపాటు బయలుదేరాడు!

అలా కొంత దూరం వెళ్ళిన తరువాతఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదకి ఉరికి కొందరిని తొక్కేసింది! అది చూసి ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు! ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి కనిపించింది! వెళ్లి దానికింద విశ్రాంతి తీసుకున్నాడు! 

ఆ చెట్టు మీద నాడిజంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది! ఆ కొంగ ఇతనిని చూసి మిత్రమా ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా వివరించి చెప్పాడు! నేను ఒక బ్రాహ్మణుడిని, నాకులవృత్తి వదిలి సంపద మీద వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను! వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారులతో కలిసి వెళ్తుండగా ఏనుగు కొందరిని తొక్కేసి చంపేసింది! నేను భయపడి ఇలా పారిపోయి వచ్చాను! అని తన ఆవేదనని విన్నవించుకొన్నాడు! 

అది విన్న నాడిజంగుడు మిత్రమా బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం ఈనాలుగు మానవుడి అభివృద్దికి తోడ్పతాయని ధర్మ శాస్త్రం, ధర్మవేత్తలు ఏకగ్రీవంగా ఒక్కానిస్తున్నారు! ఈ నాలుగింటిలో స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి! నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి నాతో ఏడు మాటలు మాట్లాడవు కనుక నువ్వు నామిత్రుడివి సందేహంలేదు! కాబట్టి నేను ఇచ్చిన ఆతిద్యం స్వీకరించి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో! ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం! అని తనగూటికి తను వెళ్ళిపోయింది! బ్రాహ్మణుడు ఆతిద్యమిచ్చిన తీయతీయని ఫలములు, కందమూలాలు, తేట నీరు, స్వీకరించి నిద్రపోయాడు! 

తెల్లారిన తరువాత నడిజంగుడు వచ్చి బ్రాహ్మణుడితో ఇక్కడికి దగ్గరలో న మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు! అతను ఎంతో ఉత్తముడు, నియమ నిష్టలతో యజ్ఞ యగాదులతో, దానధర్మలలో ఆయనకి ఆయనే సాటి!! ప్రతి కార్తిక పౌర్ణమి నాడు వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారపు కంచాల్లో భోజనాలు పెడతాడు! మళ్లి అతిధి సత్కారాలు ఆచరిస్తాడు! నాకు మంచి మిత్రుడు! నేను పంపానని చెప్పు! నిన్ను గౌరవించి సత్కరించి పంపుతాడు! వాటితో నువ్వు హాయిగా బ్రతకొచ్చు! ఇదిగో ఈ దారిలో వెళ్ళు అని దారి కూడా చూపించింది! 

ఆ మర్గంగుండా చాల దూరం వెళ్ళాక నాడిజంగుడు చెప్పిన విరుపాక్షుడు రాజ్యం వచ్చింది! ఆ రాజ్యంలోకి ప్రవేసిస్తుండగానే విరుపాక్షుడు ఇతడి రూపం చూసి ఇతడిని చుస్తే ఏదో కొంత కుటిల స్వభావం కలిగినవాడు అని సందేహం కలుగుతుంది! విషయం ఏంటో తెలుసుకుని రమ్మని భటుడిని పంపించాడు! 

బటుడికి నాడిజంగుడు పంపిన విషయం చెప్పగానే ఈ వార్త విరుపక్షుడికి చెప్తాడు! విరూపాక్షుడునాడిజంగుడు పంపించడా? అయితే ఎంతటి పనికిమాలినవాడు అయిన పర్వాలేదు ప్రవేశపెట్టు అన్నాడు! బ్రాహ్మణుడు రాగానే ఎవరు నువ్వు ఏమిటి నీ చరిత్ర! దానికి ఆ బ్రాహ్మణుడు నాపేరు గౌతముడు! పరమ పవిత్రమైన గౌతమ మహర్షి వంశంలో పుట్టిన నీచుడిని! నాకు లేని వ్యసనం లేదు తాగుడు, స్త్రీ వ్యామోహం, పొగ పీల్చడం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి అని జరిగింది చెప్పి వచ్చిన విషయం కూడా చెప్పాడు! 

విరుపాక్షుడు కనుబొమ్మలు విరిచి సరే నువ్వు ఎవరివైన కావచ్చు నాడిజంగుడు పంపించావ్ కనుక నిన్ను సత్కరించాలి! అని వచ్చిన బ్రాహ్మణులతో పాటు ఇతనికి కూడా భోజనం పెట్టి పెట్టిన పళ్ళెంతో సహా మోయలేనంత వెండి, బంగారం, ధనం ఇచ్చాడు! దానికి గౌతముడు ఎంతో సంతోషించి ఆ మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మోయలేక మోయలేక నాడిజంగుడు ఉన్న వృక్షం దగ్గరికి చేరుకున్నాడు! నాడిజంగుడు అలసిన మిత్రుడిని చూసి తన రెక్కలతో సేదతీర్చి అతిధి సత్కారం చేసి తన గూటికి వెళ్లి నిద్రించింది!
                                                                                               ఇంకా ఉంది .....