గుడిపూడి జంగములు


మనము సాధారణంగా ఎవరైనా అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ప్రగల్భాలు పలికి తరువాత వాటి వూసే ఎత్తని వాళ్ళను చూసి వీళ్ళు గుడిపూడి జంగముల వంటి వాళ్ళు అంటుంటారు. మరి ఈ గుడిపూడి జంగముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా

అనగనగా గుడిపూడి అనే ఊరిలో ఎక్కువగా జంగమ దేవరలు నివాసముండేవారు. మీకు జంగమదేవరలు అంటే ఎవరో తెలుసా. ఉదయాన్నే పెద్ద పెద్ద విభూతి రేఖలతో, ఒక చేతిలో గంట, వేరొక చేతిలో త్రిశూలం ధరించి అపర శివునిలా వస్తారే వారు.
వీరు ఊరూరూ తిరుగుతూ బిక్షాటన చేసి సాయంత్రం ఊరిలో ఒకచోట చేరి ఆ రోజు వారు వెళ్ళిన ఊరిలో చూసిన వింతలు విశేషాల గురించి మాట్లాడుకుంటూ అక్కడ ఉన్న మంచి (ఉదాహరణకు మంచినీళ్ళ చెరువు, పెళ్ళి మండపాలు, ఆసుపత్రి, సమావేశ మందిరములు వంటివి) మన ఊరిలో కూడా చేద్దాం అంటూ ఎవరు ఏమిచేయాలో తీర్మానించి దానికి తగ్గ ప్రణాళిక కూడ తయారు చేసుకుంటారు. అవన్ని తప్పనిసరిగా రేపు జరిగిపోవాలంటారు. 

కాని తెల్లారేసరికి ఎవరి జోలె వారు చంకన వేసుకుని బిక్షటనకు వెల్లిపోతారు. రోజూ ఇదే తంతు. అంతే కాని ఆ పనులు ఎప్పటికీ జరగవు. అదండీ గుడిపూడి జంగాల కధ.