జ్ఞాననేత్రం - మహాశివరాత్రి

మన కళ్ళతో చుట్టూ పరికించినపుడు, సూక్ష్మపరిశీలను చేస్తే సృష్టిలోని సూక్ష్మాతిసూక్ష్మాలన్నీ గోచరిస్తాయి. అలాగే బ్రప్మండంగా ఆలోచిస్తే, ఈ సృష్టిలో అతి పెద్దదైన శూన్యం కనబడుతుంది. కొన్ని ప్రదేశాలు నక్షత్రమండలాలతో ఉంటూ మిగతా విశ్వమంతా అనంతశూన్యమే కనబడుతుంది. ఆ శూన్యం అందరి దృష్టికి రాదు. ఆ అనంత శూన్యమే శివఅనబడుతుంది. నేతి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడ ప్రతీ వస్తువు శూన్యంలోనుంచే ఉద్భవించి, శూన్యంలోనే లయమవుతున్నట్లు చెబుతోంది. ఇది శివుని విషయంలో పరిశీలించగా, ఈ అనంత శూన్యమే మహాదేవుడు అని తెలుస్తోంది.

మనం శుభం కోరుకుంటూ భగవంతుని ఓ వెలుగుగా భావిస్తాము. కానీ, మనం ఆ పరిధి దాటి జీవితాన్ని శొధిస్తే, శూన్యంలో ఉండే దైవత్వం తెలుస్తుంది. ఈ భూమిపై మనకు తెలిసిన కాంతి సూర్యుడు మాత్రమే. ఆ సూర్య కాంతిని కూడ చేతిలో ఆపి, చీకటిని లేక చీకటినిఛాయను చేయవచ్చు. కానీ, చీకటి అన్నిచోట్ల అల్లుకుని ఉంటుంది.

కొందరు ఈ చీకటిని భూతంగా వర్ణిస్తారు. కానీదైవత్వం అన్నిచోట్ల వ్యాపించి ఉన్నదని తెలిసినవాడు, ఆ దైవత్వమే ఈ అందకారమని తెలుస్తుంది. ఎందుకంటే, విశ్వమంతా అంధకారం కనుక, వెలుగు అనేది ఒక మూల నుంచి వస్తుంది. ఆ మూలం మండుతుంటుంది. ఆ మంటకు ఆద్యంతాలున్నాయి. ఆ మూలకు ఓ నియమిత పరిమాణం ఉంది. కానీ, చీకటికి మూలం లేదు. దానికి అదే ఆధారం.

అందువల్ల శివఅంటే విశ్వంలోని శూన్యం. ఈ శూన్యం నుండే సృష్టి వచ్చింది. అంతా శివమయం. శివరాత్రిరోజు శివుడు చలనరహిత, నిశ్చల, నిర్మల స్థాణువైనరోజు, కనుక సన్యాసులు మహాశివరాత్రి అచేతన దినంగా భావిస్తారు.

మహాశివరాత్రిరోజు, సంవత్సరంలోని మిగిలిన రోజులన్నింటినీ తలపించేరోజు. ప్రతినెల కృష్ణపక్షంలో 14వ రొజు శివరాత్రి దినమని మనకు తెలుసు. ఆధ్యాత్మికులు ఈరోజు ప్రత్యేక సాధనలు చేస్తారు. ఎందువల్లనంటే, నెలలో వచ్చిన ఈరోజున అనేక శక్తులు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి.

మహాశివరాత్రి రోజున నడుమును నిటారుగా వుంచి స్థిరాసనంలో కూర్చున్నవారు స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆరోజున నడుమును అడ్డంగా ఉంచి, శయస్థితిలో ఉన్నట్లుగా చేస్తే ఏటువంటి ఫలితం ఉండదు. ఆరోజున సహజంగా మన శర్శేఎరంలో జీవశక్తి (ప్రాణశక్తి) ఊర్థ్వముఖంగా పయనిస్తుంది. అప్పుడు పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అలా ప్రాణశక్తి ప్రవహించడం వల్ల మానవునికి సర్వవికాసాలు, శక్తులు సిద్ధిస్తాయి. మానవుడు అప్పుడు అమితానంద స్థితిని చేరుకుంటాడు. ఆధ్యాత్మిక సాధనలో చేసే ప్రతిసాధన, ఇలా ప్రాణాధారశక్తి శరీరంలో ఊర్థ్వముఖముగా ప్రవహించడానికే.

ఈ దైవత్వాన్ని మనం అనుభవించాలంటే మనలోని శక్తులను అతి బృత్తర రూపంలోనూ, అతి సూక్ష్మరూపంలోనూ దర్శించగలగడమే. మహాశివరాత్రినాడు భూమి యొక్క ఉత్తరగోళంలో ప్రత్యేకమైన స్వాభావిక మార్పులు ఏర్పడతాయి. వాటిని మన శరీరంలోని ప్రాణాధార శక్తి ఊర్ధ్వముఖంగా పయనింపజేయడాన్నిగమనించవచ్చు. ఈ శక్తిని పొందడానికి నిశ్చలంగా నడుమును నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవడమే. జీవశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం జీవరాశులకు అడ్డంగా, మానవులకు నిలువుగా వెన్నెముకను పెట్టి నడవడం. ఆ తర్వాతనే మానవునిలో తెలివి వచ్చింది. కనుక శివరాత్రినాడు నడుమును నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే సత్పలితాన్ని పొందగలం. ఈవిధంగా ఉండి జీవశక్తిని ఉపయోగించు కుంటే మరియు మంత్రోచ్చారణ లేక ధ్యానం చేస్తే దివ్యత్వానికి దగ్గరగా చేరుకోగలం.

అలాగే భారతీయ సంస్కృతిలో ఒకానొకప్పుడు ఒక సంవత్సరంలో 365 పండుగలు ఉండేవి. అంటే, సంవత్సరంలో ప్రతిరోజూ పండుగే. ఈ పండుగలు అనేక కారణాలవల్ల, అనేక జీవితావసరాల కోసమై ఏర్పడినాయి. అనేక పండుగలు చారిత్ర్యాత్మక సందర్భాలలో, శత్రువిజయాలకో, జీవిత పరమార్థాలకో, లేక పంటలు చేతికి వచ్చిన సందర్భాలలోనో జరుపబడుతున్నాయి. విత్తనాలు ఇంటికి వచ్చినప్పట్నుంచి, పంట చేతికి వచ్చేంతవరకు పండుగలు ఉండెవి. కానీ, మహాశివరాత్రి ప్రత్యేకత, ఆవశ్యకత వేరు.  మహాశివరాత్రి ఆధ్యాత్మికావాదులకు, ప్రపంచాభిలాషగల వారికి చాలా అవసరం. మనం శివఅనగానే ఓ దేవుని రూపాన్ని ఊహించుకుంటాం. అది అన్నింటికన్నా అతీతం. శివపురాణంలో శివుని జీవన గమనం మామూలు మనిషి జీవనంవలెనే కనబడుతుంది. ఆయన ఒకే సమయంలో అనేక రూపాలలో కనబడుతుంటాడు. ఆయన అతిసుందరుడు అనాకారి, గొప్పసన్యాసి గృహస్తు కూడ. ఒకే సమయంలో అన్ని కలిగినవాడు. ఆ పరమశివుని నమ్ముకుంటే ఈ జీవితచక్రాన్ని అధిగమించినట్లే. గృహస్తులంతా ఆయన్ని, ఈ మహాశివ రాత్రిని శివుని వివాహదినంగా భావించి కొలుస్తారు. సన్యాసులు, తాపసులు ఈ దినాన్ని శివుని అత్యంత అచేతన రూపదినముగా కొలుస్తారు. అనంతకాల తపఃశక్తి వలన శివుడు అచేతనుడైయ్యాడు. ఆయన చాల అచేతనుడైన శుభదినమే ఈ శుభరాత్రి, మహాశివరాత్రి. కాబట్టి మహాశివరాత్రి నాడు మనం చేయవలసినవి:

1. సాష్టాంగస్థితిలో పరుండరాదు. నడుమును నిటారుగా ఉంచి కూర్చోవలెను.

2. అలా ఉన్నంతమాత్రాన సరిపోదు. మనం మన ఉనికిని గుర్తించలెనంత స్థితికి చేరుకొనవలెను. ఇలా చేసినపుడు మనకు, ఈ జీవితం ఓ కొత్తకోణంలో కనిపిస్తుంది. ఫలితంగా ప్రతి విషయంలో ఓ స్పష్టత ఏర్పడుతుంది. ఇలా జీవితంలొ కొత్తదృష్టిని ఏర్పరచుకోనిదే శివ దర్శనం దుర్లభం. శివరాత్రిన ఆ ఆవకాశం లభిస్తోంది.