కాకులను పితృదేవతలుగా భావించి

కాకులను
పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే
పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం.
జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి.
దీనిప్రకారం శని భగవానునికి కాకి
వాహనంగా పరిగణిస్తారు.
సాధారణంగా
ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే..
నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో
కాస్త దానం చేయడం ద్వారానో,
కాకులకు పెట్టడం ద్వారా ఆ
వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి
ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం
చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం
చేయాలి.
కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం
పొందింది. అందుచేత కాకి అన్నం
పెడితే అది శనిభగవానునికే దానం
చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే
పిలిచిన వెంటనే వచ్చే కాకికి
అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో
ఉంటారని, అందుకే వారు మరణించిన
తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం
పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ప్రకృతి
- పురుషుడికి బేదం
జనకమహీజాని
ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి అని
యాజ్ఞవల్క్య మహామునిని అడిగాడు.
యాజ్ఞవల్క్య
మహాముని : ఓ దీపిక
నుండి అనేక దీవులు ఉద్భవించినట్టు
సత్వరజస్తామోగుణ పరిణామాల వల్ల ప్రకృతి
నుండి విచిత్ర రూపాలు ఉద్భవిస్తున్నాయి.
సంతోషం, ఆనందం, ఆరోగ్యం, క్రోధరాహిత్యం,
ఋజత్వం, పరిశుద్ధి, ప్రకషత, సుస్తిరత్వము, అహింస,
నిర్మలశ్రద్ద, వినీతి, లజ్జ, శౌచము,
సమత, సదాచారము, కార్పణ్య రాహిత్యము, ఆదిగాగలవి
సత్వ గుణాలనిఆర్యులు ఉపదేసిస్తున్నారు. దర్పము, క్రోధము, అభిమానము,
మాత్సర్యము, కారుణ్య విహీనత, నిరంతర
భోగభిలాష, అహంకారము ఆదిగాగలవి రాజసమని,
మోహము, మౌర్ఖ్యము ఆదిగాగలవి తామసాలని విజ్ఞులు ఏకగ్రీవంగా
వినుతిస్తున్నారు.
తన గుణాల ప్రభావం వల్లనే
ప్రకృతి అంతరాత్మలో వేర్వేరు వికృతులు ఉద్భవింపజేస్తున్నది.
ఇది దాని సహజ స్వభావము.
పురుషుడు చైతన్యాత్మకుడు, ప్రక్రుతి జడ స్వభావం. ప్రకృతి
పురుషుని సదా తన గుణాలవైపు
ఆకర్షిస్తున్నది. పరతత్వం ప్రక్రుతి గుణాలచే
సమాకర్షితమైన యెడల సంసారబద్దమై వేర్వేరు
సుకృత, దుష్కృత కర్మలు ఆచరిస్తున్నది..
వివిధ రూపాలతో వివిధ జన్మలతో
స్వర్గ, మత్స్య పాతాళాది లోకాలలో
పరిబ్రమిస్తున్నది. పురుషుడు తనని తాను
ఎరిగిన యెడల అవ్యక్త గుణాలలో
చిక్కుకోజాలడు. నిర్మలుడై, నిరంజనుడై కేవలం స్వస్వరూపంతో వెలుగొందుతున్నాడు.
పురుష ప్రకృతి తత్వాలు రెండు
అనాది-నిదానాలు. ఆగ్రహ్యాలు-అచలాలు, ఈ రెండింటిలోనూ
పురుషతత్వం సచాతనమని, ప్రకృతితత్వం చైతన్య విహీనమని నీవు
ఆనతిస్తున్నావు! ఈ విభేదానికి
ఏమి కారణం అని అడిగాడు
జనకమహీపతి. ఈ సందేహం
మనకి కూడా వస్తుంది.
సగుణమైన
వస్తువు అగుణం కాజాలడు. అలాగే
అగుణమైన వస్తువు సగుణం కాజాలదు.
ప్రకృతి సర్వదా గుణ సమేతము
జడము. పురుషుడు ప్రకృతి స్వభావం
సంపూర్ణంగా గ్రహిస్తున్నది. ప్రకృతికి ఆ వివేచనా
జ్ఞానం లేదు. ప్రకృతి అచేతన.
పురుషుడు చైతన్యవంతుడు. ఇది వస్తుతత్వం గుర్తెరిగిన
మహామహులైన మునీంద్రుల అబివర్ణనం. ఇదిన్ని గాక ప్రకృతి
పురుషుల సహజగుణం. ఈ విభేదాలకు
ఇంతకన్నా మరొక హేతువేదిలేదు.
ఇద్దరూ విభిన్నులే. అయితే పురుషుడు క్రమ
క్రమంగా పురుషోత్తమ స్వరూపుడై ఇరువదిఆరవ తత్వంలో మేళవిస్తున్నాడు. ప్రకృతి
ఎన్నడూ పురుషుడిని కనుగోననేరదు. ప్రకృతి ఎడల పారవశ్యం
వల్లనే పురుషుడు మొహవిష్టుడై సదా
ప్రకృతి తన్మయుడై సంసారచక్రంలో పరిబ్రమిస్తున్నాడు.
పురుషుడు పురుషోత్తమ స్వభావం ఎట్టిదో గ్రహించనేరక
అనేకవిధాల పరిబ్రమిస్తున్నాడు. దీనిని కనుగొనిన ఎడల
ప్రకృతి సంసర్గం నిశ్శేషంగా పరిత్యజించి
అవలొకించుకొగలిగిన ఎడల పురుషుడు అనతికాలంలోనే
పురుషోత్తమునిలో మేళవించి పునర్జీవ రహితుడు
అవుతాడు. ఇది కేవలం నిర్మల
విజ్ఞాన మహిమవల్లనే అట్టి మహోత్తరమైన పరమపదం
అందుకోగలడు. ప్రశాంతి విహీనులకి ఇది
కేవలం దుస్సాద్యం. మోక్షానికి ఇంతకన్నా పరమ శ్రేష్టమైన
మార్గం మరొకటిలేదు. సుజ్ఞానం వల్లే కాని
మానవుడు ఎన్నటికీ జన్మ మృత్యు
బంధనాలనుండి విముక్తి కానేరడు. కనుక
సుజ్ఞాన సంపాదనకై సర్వదా ప్రయత్నించవలెను.
మోక్ష శ్రద్ధ లేని యెడల
జనన మరణ జంజాటం తప్పదు.
కేవలం అజ్ఞానం వల్లనే ఖర్మ
సంసర్గం కలుగుతున్నది. ఇది నిరంతర దుఃఖాల
హేతువు. ఈ మార్గంలో
సాధన చేసిన యెడల తప్పక
శుభం చేకూరగలదు...