శివుడికి త్రిశూలం, నంది ఎలా వచ్చాయి?

కృతయుగంలో
కణ్వ మహాముని కొన్ని వేల
సంవత్సరాలపాటు తీవ్రమైన తపస్సు చేశాడు.
వేల సంవత్సరాలు కావడంతో ఆయన మీద
పుట్టలు పెరిగి వెదురు చెట్లు
మొలిచాయి. అప్పట్లో శివుడికి గాని
విష్ణువుకి కానీ ఆయుధాలు లేవు.
దీన్ని గమనించిన బ్రహ్మ ఆ
వెదురు చెట్లలో మూడు కొట్టి
మూడవ దానితో త్రిశూలం చేసి
శివుడికి ఇచ్చాడు. రెండవ దానితో
శార్ జ్గధన్వా చేసి విష్ణువుకి
ఇచ్చాడు. మిగిలిన మొదటి దానితో
గాండీవం చేసి బ్రహ్మ తీసుకెళ్ళాడు.
తరువాత ఎన్నో చేతులు మారి
కాండవ దహనం సమయంలో అగ్ని
దేవుడు అర్జునుడికి ఇస్తాడు.
నంది:
సృష్టి ప్రారంభ సమయంలో శివుడు
హిమవత్గిరి పర్వతాలమీద తపస్సు చేస్తుంటే అక్కడే
ఉన్న గోవులు శివుడి చుట్టూ
పరివేష్టించి ఇబ్బంది కలిగించాయి. దానితో
శివుడికి కోపం వచ్చి ఆ
గోవుల వంక చూసేసరికి అగ్ని
బయటికి వచ్చి గోవుల్ని దహించడం
మొదలుపెట్టింది. ఆఘోర సంఘటన చూసి
బ్రహ్మ శివుడి దగ్గరికి వచ్చి
నందిని బహుమానంగా ఇచ్చి గోవులు దేవతలతో
సమానం కనుక వెంటనే అగ్నిని
వుపసంహరించమన్నాడు. దానితో శివుడు ఆనందించి
నందిని వాహనంగా , కేతనంగా స్వీకరించాడు. ఆనాటి
నుండి శివుడికి నంది వాహనం
అయింది.