కొబ్బరికాయ ఎందుకు కొడతారు. తరువాత కర్పూర హారతి ఎందుకిస్తారు?

కొబ్బరికాయ ముందుగా పైపోట్టుతో ఉంటుంది. దీనిని తీయడం కూడా కొంచం కష్టంతో కూడుకున్న పని. ఒకదానితో ఒకటి కలిసి అనేకానేక చిక్కులు కలిగి చాలా బలంగా ఉంటుంది పైన ఉండే పీచు. దానిని కొంచం కష్టపడి తీసి పగులగొట్టి లోపల తెల్లటి కొబ్బరిని దేవుడికి చూపిస్తున్నాం. ఇలా చూపడానికి ఒక కారణం ఉంది.
కొబ్బరికాయ పీచు విడతీసేటప్పుడు అది చిక్కులు చిక్కులుగా ఉంది మిక్కిలి కష్టముగా వస్తుందో అలానే స్త్రీ పురుషుల చర్మములు చూపునకు మాత్రమే నునుపుగా ఉన్నా లోపల మనస్సుకి అనేకానేక అశాపాశములు అనే చిక్కులు ఒకదానితో ఒకటి అనేకానేకములు జన్మజన్మలుగా వస్తున్నవి. ఇలాంటి లోపలి పాశములు అనే ఈ చిక్కుముడులను విడతీసినప్పుడు కొబ్బరికాయలోని తెలుపు వర్ణం ఉన్నట్లు నాలో శుద్దమైన పరమాత్మ స్వరూపము ఉన్నది. ఆ పరమాత్మా స్వరూపమును అనేక జన్మలనుండి కొంత కొంత కప్పుతూ వస్తున్న ఆశాపాశముల చిక్కులని అంత విడతీసి పరబ్రహ్మ స్వరూపమునందు నన్ను ఐక్యము చేయవలెనని విన్నవించుకొనుటకు గాను దేవునికి కొబ్బరికాయ పగులగొట్టి నివేదన ఇవ్వడానికి కారణం. ఈ కొబ్బరికాయ పైనున్న పీచువలె అనేక జన్మలనుండి అశాపాశాములనెడి చిక్కులు ఆత్మస్వరూపమును కప్పుకొని కనబడనీయకుండా చేయుచున్నది. కనుక ఈకర్పూరపు గడ్డ అంతా ఏవిధముగా వెలిగి ఏమాత్రము ముగాలక జ్యోతి స్వరూపములో ఎలా కలిసిపోవుచున్నదో నా యందు ఆత్మస్వరూపమును,పరమాత్మా స్వరూపమును నీయందు కలసిపోవునట్టు చేయుము అని దేవుని ఎదుట కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించుటకు కారణం అని పెద్దలు ఏర్పరిచారు.