బ్రహ్మముడి

బ్రహ్మముడి
అనగా బ్రహ్మదేవుడు స్థిరపరచిన సంబందము అని అర్ధము.
ఈ పురుషునకు ఈ స్త్రీ
భార్యగాను, ఈ స్త్రీకి
ఈ పురుషుడు భర్తగాను
ఉండవాలయును అని బ్రహ్మ దేవుడు
ముందుగా సంబంధము స్థిరము చేయును.వధూవరులు కలసి గృహస్థాశ్రమమును
స్వీకరించి , భోగముల ననుభవించు ,సత్సంతానమును
పొందుచు , పుణ్యకార్యములు చేయుచు, తమ జీతము
సుఖమయము చేసుకొందురుగాక అని బ్రహ్మ దేవుడు
నోసట వ్రాయును. ఈ సంబందము
విడదీయరానిది. దీనికి చిహ్నముగావివాహములో వధూవరులకు
బ్రహ్మముడి వేయుదురు.