కావు కావుకావుకావుకావు


కాకి ప్రతి ఊరిలో ప్రతి ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది.. ఏమని ?
కావు కావు కావు ఏవి శాశ్వతం కావు.. నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు.
ఏ బంధాలు శాశ్వతం కావు.
ఏ కోరికలు శాశ్వతం కావు.
నువ్వు చూసేవి, చేసేవి ఏవీ శాశ్వతం కావు.
ఎందుకు ఇంత తపన నీదికాని దానికోసం. నువ్వు ఎంత తపించినా, ఎంత సాధించినాఏవీ శాశ్వతం కావు.