శ్రీ చక్రం




శ్రీ చక్రం శియోర్వపుః శ్రీ చక్రం కామేశ్వరి, కామేశ్వరుల శరీరం. శ్రీచక్రం లలితా మహాదేవి నివాసం. 'శ్రీ అను అక్షరం శ్రీచక్ర పవిత్రతను సూచిస్తుంది. శ్రీచక్రం మహిమలను, శక్తిని వర్ణింపజాలం. అందరి దేవతామూర్తుల మూల స్వరూప స్థితి శ్రీచక్రంలో ఇమిడి ఉన్నది. నిర్ణీత రేఖల సముదాయంతో క్రమబద్ధత కలిగి ఉన్నది. శ్రీ చక్రములో వృత్తం బిందువు సమాన దూరం తెలియచేస్తూ, ఆది, మధ్యాంతరములు లేని దైవ స్వరూప నియమ స్వరూపాలను తెలుపును. ఆత్మభావనతో శ్రీచక్రమును అర్చించవలెను. ఈ చక్రములోని త్రికోణాకారం ఆది, మధ్యాంతములు లేని సృష్టి రహస్యమునకు సంకేతం.అనగా సృష్టి, స్థితి, లయ, బద్ధమైన సంగ్రహరూపమును తెలుపు చున్నది. ఈ త్రికోణాలు రెండేసి ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండుట ఆదిశక్తిగా పవిత్రమూర్తిని స్ఫురింప చేస్తుంది. సూర్యోదయము, అస్తమయ ములందు వికసించి, కృశించు తామరపూవు వలె మానవుని ఆధ్మాత్మికారంభాలు వికసించుననే భావన తెలియచేస్తుంది.

త్రికోణం తరువాత చతురస్రం కలదు. నాలుగు కోణాలు మాయ, శుద్ధ, విద్య, ఈశ్వర తత్త్వము. శ్రీచక్రం మహాబిందువు. పరబ్రహ్మ స్వరూపం. చక్రం సోమ, సూర్య, అగ్నిఖండములుగా విభ జింపబడింది. శ్రీచక్రం, రత్నాకరం, నవచక్ర రూపం, సర్వానందమయ, సర్వ సిద్ధిప్రద, సర్వరోగహర, సర్వ రక్షాకర, సర్వార్థసాధక, సర్వసౌభా గ్యదాయక, సర్వపాపహర, త్రైలోక్య మోహనము. చతురా శ్రమ, వర్ణ ప్రపత్తులకు, ధర్మాచార ముల యందు కలిగిన లోపము లకు శ్రీచక్రార్చన నిశ్చితమైన పరిహారం. శ్రీచక్రస్థితమైన శ్రీవిద్యాదేవిని బిల్వ తులసి దళ ములతో, పద్మములతో పూజిం చవలెను.

ప్రతి శుక్రవారం శ్రీచక్రం పెట్టి ఇంటిలో పూజచేస్తే ఎటువంటి ఆపదలు కలగవని, అష్టైశ్వర్యాలు తమ ముంగిట్లోకి వస్తాయని పెద్దలు చెప్పారు. శ్రీచక్ర పూజను చేస్తున్నప్పుడు నియమ, నిష్టలు తప్పనిసరిగా పాటిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈచక్రాన్నిప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఉంచుకుంటే చాలా మంచిది.