మహా మనీషి ! ఆది శంకర యతీంద్రులు............

పూర్వం గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు,విద్యార్ధులు మధుకర వృత్తితో జీవించేవారు.అనగా ప్రతి ఇంటి ముందు నిలబడి"భవతీ !భిక్షాం దేహీ"అని భిక్షార్ధమై,ఎలుగెత్తి పిలిచేవారు.ఎంత సంపన్నుడైనా కూడా చదువుకునే విద్యార్ధి ,ఈ మధుకర వృత్తిని ఆశ్రయించవలసినదే!అలా ఎందుకు చేసే వారంటే !విజ్ఞాన సముర్పార్జనకు, సుఖానుభవమునకూ, చుక్కెదురు!ఎంతటి వారికైనా గురుకుల వాస క్లేశము అనుభవించక తప్పదు!అటువంటి సమయాల్లో,ఆ విద్యార్ధిని పోషించుకోవలసిన బాధ్యత సమాజానిదే!సమాజంలోని గృహస్థులు సాదరంగా ఇచ్చేభిక్షతో, విద్యార్ధి జీవించాలి.చదువుకుని,విజ్ఞాని అయ్యాకా,తన విద్యా వివేకాలను సమాజ హితమునకు తప్పక వినియోగించాలి.ఆ విధంగా తన చుట్టూ ఉన్న సమాజ ఋణాన్ని,విద్యార్ధి తీర్చుకోవాలి.ఆ రీతి లోనే ,ఆది శంకరా చార్యులు మధుకర వృత్తి చేస్తూ,విద్యాభ్యాసం చేసేవారు.


ఒక నాడు ఒక ఇంటి ముంగిటనిలబడి"భవతీ! భిక్షాం!దేహీ"అని ఎలుగెత్తి పిలిచారు.చాలా సేపటికి కానీ,ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కొంత సేపటికి ,దైన్యంతో,మూర్తీ భవించిన లేమిలా ఒక ఇల్లాలు వెలుపలికి వచ్చింది.ఏ రోజుకారోజే! దిన భత్యాలు సమకూర్చే, యజమాని ఆ రోజు ఇంట లేడు.కాబట్టి ఇంటిలో భిక్ష వేయడానికి ఏమీ లేదు. కానీ ఆమె ఊరుకోలేదు.ఇల్లంతా వెదికింది చివరికి ఒక మూలన,బాగా మాగిన ఒక ఉసిరి కాయను తెచ్చిశంకరుని భిక్షాపాత్రలో భిక్షగా వేసింది ."ఇంతకన్నా వేరే ఆహారం మా ఇంట లేకపోయిన దని" తన దైన్యాన్ని శంకరునికి విన్నవించింది .ఆ మాటకు శంకరుని హృదయం చలించి పోయింది. ఇరుగు పొరుగు వారంతా సంపన్నులు కాగాఈ ఇంటనే దరిద్ర దేవత ఎందుకు తిష్ట వేసిందా! అని ఆశ్చర్య పడ్డాడు. ప్రక్క వారి బాగోగులను పట్టించుకోనిసంపన్నుల సంపద సమాజ పుస్టికి నిదర్శనంకాదు. లేమిలో కూడా మధుకరమడిగితే ఏదో, ఇచ్చి తీరవలెననే,ఆమె సమర్పణ భావం సమాజ సంపద.పైగా మానవతకదిలక్షణం కూడాను. సమాజం పట్ల తన కర్తవ్యాన్ని,గుర్తించి , సమర్పణ భావం కల వారి వద్దనున్న సంపదే సమాజాన్ని నిలబెడుతుంది కూడ! అట్టి వారిని చేరిన సంపదేసద్వినియోగం అవుతుంది. దీని గుర్తించిన మన ఆది శంకరులుఆత్మాను సంధానం గావించి,ఐశ్వర్య లక్ష్మిని ఆవాహన చేశాడు. "కనకధారా స్తవం" అనే స్తోత్రం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకున్నాడు. ఫలితం ఆ గర్భ దరిద్రుని ఇంట కనక మహా లక్ష్మి బంగారు ఉసిరి కాయలను ధారగా కురిపించిఆ ఇంటికి పట్టిన దరిద్ర దేవతను తరిమికొట్టింది. చివరికి ఈ కధే! తన నిత్య జీవన వ్యాఖ్యానానికి తోలి బీజం శంకరునికి గురుకుల వాసం కాలం లోనే లభించింది.మానవుడు తోటి మానవుని,ద్వేషించడానికిహింసించడానికి తోడ్పడే నాస్తిక కల్లోలం నుండి,ఆ నాటి మానవ సమాజాన్నిఉద్ధరించి, విశ్వ శాంతిని నెలకొల్పిధర్మ రక్షణకు ఉద్భవించిన ఆ మహా మనీషి. ఆ జగద్గురువే! పుట్టకుండాఉంటేజగత్తు రక్త సిక్తమై,మానవ కంకాళ భూయిష్టమై ఉండేది.వారి భక్తి రాసామ్రుతాన్నిప్రజ్ఞా పాటవాల్నీ, ఆలోచనా రీతులను ఆక ళించుకున్నవారు,అనుసరించినవారు ప్రపంచం మొత్తం లోనే లేరని చెప్పాలి. నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆ జగద్గురువులకు నా వందన సహస్రాలు