లలిత సహస్రనామాలు వంట చేసుకుంటూ చదవవచునా ?

లలితాసహస్రంలోని ప్రతి నామమూ మంత్రమే, అది అంతా మంత్రాలతో బీజాక్షరాలతో నిండి ఉండడం మూలాన నిలబడి చదవరాదు, చాలా మంది వంటింట్లో వంట చేస్తూ లలిత చదువుతాం దానిద్వారా పిల్లలకి ఇంటి వారికి
చక్కని అమృత తుల్యమైన భోజనం పెడతాం అని అంటూంటారు. నిస్సందేహంగా ఇతర ఏ స్తోత్రాలైనా నామాలైనా చదువుతూ వంటచేసి పవిత్రమైన చక్కనైన వంటలను ఇంట్లో వారందరికీ పెట్టవచ్చు అటువంటి వంట భగవత్ప్రసాదమే అవుతుంది. కానీ కదలకుండా కూర్చుని వంట చేసే పరిస్థితులలోఐతేనే లలితను చదవాలి అటువంటి పరిస్థితి కష్టం కనుక 
లలితా సహస్రాన్ని విడిగా ప్రశాంతంగా కూర్చుని ఇతర ఏ యావ లేకుండా కూర్చుని పారాయణ చేయాలి.