విఘ్నేశ్వర పూజ


వినాయక చవితి నాడు పార్థివ గణపతిని ఆరాధించాలి. పార్థివ లింగార్చన వలే పార్థివ విఘ్నేశ్వర పూజ శ్రేష్ఠం. నీటిలో కరగగలిగే పొలాల మట్టితో, బంకమట్టితో గణేశ ప్రతిమ చేయాలి. ఈ ఆకృతి కూడా పాశాంకుశ, వరద అభయ (లేదా - మోదకం, దంతం) కలిగిన నాలుగు చేతుల గణపతినే చేయాలి. ఏనుగు మోముతో ఉన్న ఈ లంబోదర ప్రతిమను గణపతి నామాన్ని పలుకుతూ భక్తితో తయారుచేయాలి. కొన్న మూర్తిని అయితే గణేశ నామంతో అభిమంత్రించాలి. పర్యావరణానికి ముప్పు కలిగించే పద్ధతులు హిందూశాస్త్రాలు అంగీకరించవు.
గణపతికి దుర్వాంకురాల పూజ ప్రీతి. రెండు దూర్వాల చొప్పున పడి నామాలు పలికి చివరికి ఒక దూర్వాన్ని సమర్పించడం ఒక విధానం. గరికలు పన్నెండు అంగుళాల పొడవుతో ఉంటే మంచిది. పాపనాశానానికీ, అభీష్ట సిద్దికీ గరిక పూజకు మించిన అద్భుత విధానం లేదు.
శుద్ధ చవితిని వరదా చవితి అనీ,కృష్ణ పక్ష చవితిని సంకట హర చతుర్ధి అని అంటారు. అభీష్టాలను సిద్ధింప జేయటానికివరదా చవితి, కష్టాలను తొలగించడానికి సంకటహర చవితి. శుక్లపక్ష(వరద) చవితి తిథులలో భాద్రపద శుక్లాష్టమి విశిష్టం. సంకటహర చతుర్థిలలో మాఘ బహుళ చవితి ముఖ్యం. మధ్యాహ్నం వెల చవితి ఉన్న రోజుననే వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) ఆచరించాలి. - అని శాస్త్ర నియమం. మనస్సును నియంత్రించి ఉన్నతిని సాదిమ్పజేసే దేవత గణపతి. మనస్సుకి సంకేతమైన చంద్రుని చూసేవారు, గణపతిని ఆరాధించితే నీలాపనిందలు దూరమౌతాయంటారు. పరబ్రహ్మ తత్త్వమే గణపతి. ఆ తత్త్వ దృష్టితో కూడిన మనస్సు అజ్ఞానాన్ని అధిగమిస్తుందని - ఈ ఆనవాయితీలోని అంతరార్థం.
గణేశార్చనలో తెల్ల జిల్లేడు, ఎర్ర మందారం, శమీ పత్రం కూడా ప్రసిద్ధి. శమీ(జమ్మి) పత్రం ఏమాత్రం సమర్పించినా అద్భుత ఫలాలు జ్లభిస్తాయని గణేశ పురాణం చెబుతోంది. వైదిక యజ్ఞాలలో 21 సంఖ్య సంపూర్ణత్వానికి ప్రతీక. అందుకే యజ్ఞేశ్వరుడైన గణపతికి 21 సంఖ్య ప్రీతి. ఏకవింశతి పాత్ర పూజ, 21 సంఖ్యతో నివేదనలు హేరంబునకు ప్రత్యేకం.

మధ్యాహ్నం వేళ చవితి ఉన్న రోజుననే వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) ఆచరించాలి - అని శాస్త్ర నియమం. మనస్సును నియంత్రించి ఉన్నతిని సాది౦పజేసే దేవత గణపతి. మనస్సుకి సంకేతమైన చంద్రుని చూసేవారు, గణపతిని ఆరాధించితే నీలాపనిందలు దూరమౌతాయంటారు. పరబ్రహ్మ తత్త్వమే గణపతి. ఆ తత్త్వ దృష్టితో కూడిన మనస్సు అజ్ఞానాన్ని అధిగమిస్తుందని - ఈ ఆనవాయితీలోని అంతరార్థం.