పురాణాలలో కైలాస పర్వతం


కైలసపర్వతం ఈ భూలోకంలో శివదేవుని నివాసస్థానంగా ప్రఖ్యాతి పొందింది. హిమాలయ పర్వతాలలోని ఎత్తైన శిఖరాలలో ఒక్కటిగా ఈ కైలాస పర్వతం భాసిస్తోంది. శివభక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని దర్శించుకోవాలనుకుంటారు.
ఈ పర్వతం "కేలాస" (స్ఫటికం) రూపంలో ఉంటుంది కాబట్టి, దీనికి "కైలాసం" అనే పేరు ఎర్పడింది. పురాణాలలో ఈ ప్రాంతాన్నే తీర్ధపురి అనే వారట . ఈ తీర్ధపురిలోనే భస్మాసురుడు బూడిదిగా మారాడు అని కధ!
ఒకసారి పాండవులు హిమాలయ పర్వతాలలో శివుని జాడని కనుక్కునేందుకు ప్రయత్నించారు. ఈ విషియాన్ని గమనించిన పరమశివుడు, పాందవులను ఆటపట్టించటానికి ఓ ఎద్దు రూపాన్ని ధరించాడు. పాండవులు ఈ విషియాన్ని గ్రహించారు కాని వారికి పరమ శివుడు ఏ వృషభ రూపంలో ఉన్నాడో తెలియలేదు. ఇందు కోసం భీముడు ఒక ఉపాయాన్ని అమలుపరిచాడు. తన శరీరాన్ని భారీగా పెంచేసి , హిమాలయాలలోని రెండు పర్వతాలపై చెరొక కాలు పెట్టి నిలబడ్డాదు. మిగిలిన పాండవ సోదరులు అక్కడున్న ఎద్దులను భీముని కాళ్ళ సందులోంచి తరమసాగారు. మానవమాత్రుడి కాళ్ళ సందులో నుంచి వెళ్ళడానికి మిగిలిన జంతువులు సంకోచించవు. కాని పరమ శివుడు అలా చెయ్యడని పాండవులకు తెలుసు. అన్ని జంతువులు భీముని కాళ్ళ మధ్యలో నుండి వెళ్ళినప్పటికి,ఒక పెద్ద ఎద్దు మాత్రం కదలకుండా అలాగే నిలుచుంది.
వృషభ రూపంలోని శివుడు భీముని కాళ్ళ మధ్యలో నుండి కాకుండా భూమి లోపలకి, చొచ్చుకుపోయి అవతలైవైపుకు వెళ్ళసాగాడు ఆ వృషభం యొక్క తల కైలాసం దగ్గర పైకి లేస్తే,మూపురం కేదారం దగ్గర కనబడింది అని ప్రతీతి. ఇప్పటికీ మనం కైలాసశిఖర అమరికను జాగ్రత్తగా గమనిస్తే, ఆ పర్వత శిఖిరం పై ఎద్దు ముక్కు, రంధ్రాలు చెవుల ఆకారం కనిపిస్తాయి.

ఇలా మన పురాణాలలో కైలాస పర్వత ప్రస్తావన కనిపిస్తు ఉంటుంది. భారత, రామాయణ, వరాహ పురాణాలలో కైలాసగిరి వర్ణాలు ఉన్నాయి.

హర హర పార్వతి పతయే మహా దేవ శంభో శంకర !