కర్తీక మాసము


కర్తీక మాసమున తులసి చెట్టును అర్చించిన, హరిహరులును అనందించుదురు. తులసి వృక్ష్మున్న గృహమున యమకింకరులు జొర్బడరు..అనగా జంకుతారు ! ఈ వృక్షపు పత్రములు, దళములను పితృకర్మల యందు వాడిన వారు తరిస్తారు.ఈ చెట్టు నీడలో పితృకర్మలోనర్చిన, ఆ పితురలకు పుణ్యలోక ప్రాప్తి కలుగును. అందుకే అనంత ఫలాన్ని ఇచ్చే ఈ తులసీ కార్తీక మాసమున అర్చించాలి అని ఈ కృంద శ్లోకం చెప్పింది...
తులసిదళ లక్షేణ కార్తికేయోర్ప యేద్ధరిం
పత్రే పత్రే ముని శ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే
తులసమ్మ సర్వ పాపలను తొలగిస్తుంది. అదియునుగాక, దివ్యౌషధ వృక్షరాజమిది.
కార్తీక మాసం అంతా చెయ్యలేనివారు కనీసం ముఖ్య తిధులలో (ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలు) అయిన సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం ఆచరించడం మంచిది.

నమః కమలనాభాయ నమస్తే జలశాయినే
నమస్తేస్తు హృషికేశ గృహణార్ఘ్యం నమోస్తుతే !!  అనే మంత్రం తో అర్ఘ్యం ఇచ్చి ,

కార్తీకేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్ధన
ప్రీత్యర్ధం తవ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యతః
తవప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు 
అనే మంత్రాలతో స్ననం చేసి తిరిగి ఈ క్రింద మంత్రాలతో అర్ఘ్యం ఇవ్వాలి. 

నిత్యేనైమిత్తికే కృష్ణ
కార్తీకే పాపనాశనే
గృహాణర్ఘ్యం మయా దత్తం
రాధయా సహితో హరే !! 
( నిత్యమునూ, నైమిత్తికమునూ అయిన పాపములను పోగొట్టే ఈ కార్తీక మందు నెను ఇచ్చే అర్ఘ్యం రాధా సహితుడై గ్రహింపుమో శ్రీ హరీ). ఈ విధంగా చేసే స్నానం పుణ్య ప్రదం.

స్మృత్వా భాగీరధిం, విష్ణుం, శివం, సూర్యం , జలంవిశేత్ !!
భాగిరథిని, విష్ణువుని, శివునీ, సూర్త్యునీ..స్మరించి స్నానం చెయ్యాలని స్మృతి వచనం. 

ఏకాదశి రోజున ఉపవసాం ఉండి యధా శక్తి విష్ణు పూజ చెయ్యాలి.