శివమహా పురాణము - మాతా పిత

శ్లో || పిత్రోశ్చ పూజనం కృత్వా - ప్రక్రాంతించ కరోతియ :
తస్యవై పృథివీజన్యం - ఫలం భవతి నిశ్చితం ||

పుత్రుడు మాతా పితరులను పూజించి ప్రదక్షిణముచేసిన యెడల భూప్రదక్షిణము చేసిన పుణ్యము లభించును. ఇది నిశ్చయము.

శ్లో || అపహాయ గృహేయోవై - పితరౌ తీర్థ మావ్రజేత్
తస్యపాపం తథాప్రోక్తం - హననేచ తయోర్యథా ||

ఎవడు స్వగృహమందుగల తల్లిదండ్రులను తిరస్కరించి పుణ్యక్షేత్రమునకు వెళ్లునో అట్టివానికి పుణ్యక్షేత్రఫలము-
రాకుండుటయే గాక వారిని జంపిన పాపము సమకూరును.