శివుడికి ప్రదక్షిణ ఎలా చేయాలి?

శివుడికి ప్రదక్షిణ చేయటం అంటే ప్రణవం చేయటం లాంటిది . అత్యంత విసిష్టమయినది. శివ మహా పురాణం లో శివుడికి అభిషేకం చేసి, మహా నివేదన చేసి , హారతి ఇచ్చిన తరువాత అపరాధాని క్షమించమని ప్రదక్షిణ చేయాల.
108 సార్లు ప్రదక్షిణ చేస్తే శివుడు సంతుస్తుడు అవుతాడు . సకల పాపాల్ని తుడిచేయగల ఫలితం ప్రదక్షిణ ఇస్తుంది. ప్రణవం చేయటం వలన , ఓంకారం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుందో అలంటి పుణ్యం కేవలం శివుడికి ప్రదక్షిణ వలన వస్తుంది .
మహన్యాస రుద్రాభిషేకం , ఏకవార రుద్రాభిషేకం , మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం , రుద్రం , మహా రుద్రం , అతి రుద్రం , ఘోర రుద్రం చేస్తుంటాం . నమకం , చమకం , శివ శివ సహస్రనామం , శివ పంచాక్షరి చేస్తుంటారు .
విద్య హీనులు ఉండచు , నేర్చుకోలేని వాలు , మూగ వాలు ఉండచు కానీ అందరు చేయగలిగినది శివుడికి ప్రదక్షిణ. శివుడికి ప్రదక్షిణ చేయటం వలన షోడసోపచార పూజ చేసిన పుణ్యం వస్తుంది . సకల పూజ చేయలేని వాలు శివుడికి ప్రదక్షిణ చేయడం వలన అనంతమయిన పుణ్యం వస్తుంది .

శివుడికి ప్రదక్షిణ ఎలా చేయాలి :
శివమహా పురాణం లో చెప్పబడింది , నంది దగర నుంచుని నంది కొమ్ముల మద్య నుంచి శివుడ్ని దర్శించి శివుడికి నమస్కరించి, మనకి ఎడం వైపు (left ) శివుడికి (కుడివైపు ) clock wise ga ప్రదక్షిణాలు చేయాలి .
శివునికి అభిషేకం చేసిన నీరు అయన పానమటం మీద నుంచి జాలువారిన నీరు కిందకి రాలుతుంది . దీనిని సోమసుత్రం అంటారు. ఎవరు కూడా సోమసుత్రం దాటకూడదు . అక్కడివరుకు ప్రదక్షిణ చేసి మల్లి అప్రదక్షినగా వెన్నక్కి నంది దగరకి వస్తే అది ఒక ప్రదక్షిణ కింద లెక్క . నంది కి నమస్కరించి మల్లి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలి . ఏ పూజలు చేయలేనివారు 108, 1000 , 100000, ఎన్ని చేస్తే అంత పాపని మనం పోగొట్టుకున్న వాలం అవుతం . ఈ జన్మలో పూర్వ జన్మలో చేసిన పాపాలని కూడా మనం ప్రదక్షిణాలు చేయడం ద్వార పరిహరించుకోవచ్చు .

విశేషంగా చాతుర్ మాసం లో మొదలు పెట్టి , కార్తీకం మొదలు పెట్టి , శ్రావణ మాసం లో మొదలు పెట్టి , మాఘ మాసం లో మొదలు పెట్టి , వైశాఖ మాసం లో మొదలు పెట్టి , శివరాత్రి మొదలు పెట్టి , పుట్టిన నక్షత్రం రోజున మొదలు పెట్టి , మాస శివ రాత్రి మొదలు పెట్టి ప్రదక్షిణాలు చేయవచ్చు అని శివ మహా పురాణం చెప్తుంది .

ప్రదక్షిణ ఎప్పుడు గభ గభ చేయకూడదు . దీనికి ఒక కదా ఉంది .
పుష్పదంతుడు అనే ఒక గన్దరువుడు ఉండేవాడు . అయన ఒక సారి భూలోకానికి వచ్చాడు . అయన తెలీక సోమసుత్రని , శివుని నిర్మల్యని దాటాడు , ఇంకేముంది గంధర్వుడు అయి ఎగరగలిగే శక్తి ఉంటుంది . ఎలా ఎప్పుడయితే దాటాడో అయన శక్తి మొత్తం పోయింది . అయన గ్యానం మొత్తం పోయింది . అప్పుడు ఎం చేయాలో తలీలేదు . అప్పుడు ఈశ్వరుడ్ని ప్రార్ధించి క్షమాపణ వేడుకోవడం వలన ఆయనకి ఒక ఆలోచన వచ్చింది . అప్పుడు అయన శివ మహ్నిమ స్తోత్రాని అయన రాసారు . శివుడికి అంకితం చేసి కాశి క్షేత్రం లో శివలింగం ప్రతిష్టించాడు. ఇలా చేయడం వలన మల్లి అయన మహిమలు ఆయనకి వచాయి . అందువల్ల ఎవరైనా తెలియకుండా శివ నిర్మల్యని దాటినా పుష్పదంతెస్వరుడు అనే శివలింగాని దర్శించడం వలన అ దోషం పోతుంది లేదా , ప్రదక్షిణ క్రమం తెలుసుకుని ప్రదక్షిణ చేయడం వలన కూడా అ దోషం పోతుంది .