అభిషేకఫలం
పరమశివునికి
ఉన్న అనేక పేర్లలో " ఆశుతోషుడు"
ఒకటి !
ఆస్తోషుడు
అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్ధం.
అందుకే
శ్రీనాధ సార్వ భౌముడు స్వామి
భక్తసులభుడు అని ఈ కృంద
విధముగా వర్ణించాడు.
శివుని
శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత
నెవ్వాడు పారవైచు
కామధేనువతడింట
గాడి పసర
మల్ల
సురశాఖి వానింట మల్లేచెట్టు
అంటే
శివుని శిరస్సుపైన కాసిన్ని నీళ్ళు జల్లి, కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే , ఆ భక్తుని ఇంట
కామధేనువు గాట కట్టిన పశువు
అవుతుందట.
అలాగే
దేవతా వృక్షము అయిన కల్ప తరువు
ఆ భక్తుడి ఇంట మల్లే చెట్టు
అవుతుందట! ఆ స్వామి అభిషేకప్రియుడు. ఆయ్నకి
వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ
ఫలితాలను కలుగ చేస్తుంది అని
శాస్త్ర వచనం
శివునికి
నెయ్యతో భిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
పెరుగు
తో అభిషేకం చేస్తే కీర్తి, ఆరోగ్యం కలుగుతాయి.
తేనెతో
అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది.
చెరకు
రసంతో అభిషేకం ధనవృద్ధి!
పంచధార
తో చేస్తే దుఃఖ నాశనం!
కొబ్బరి
నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపదల వృద్ధి,
విభుతి
నీటి తో చేసే అభిషేకం
మహా పాపాలను నశింపచేస్తుంది.
నవరత్న
జలాభిషేకం ధనధాన్య ,పశుపుత్ర లాభాన్ని,
మామిడి
పండ్ల రసంతో చేసే అభిషేకం
చర్మ వ్యాధుల నిర్మూలనం,
పసుపు
నీరు తో చేసే అభిషేకం
సౌభాగ్యాన్ని కలిగిస్తాయి.
నువ్వుల
నూనేతో అభిషేకిస్తే అపమృత్యువు భయం తొలగిపోతుంది.
పుష్పోదకాభిషేకం
భూలాభాన్ని , బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను
ప్రసాదిస్తాయి.
రుద్రాక్ష
ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని,
గరికి
నీటి తో అభిషేకం చేస్తే
ధన కనక వస్తువులు, మరియూ
వాహనాలను ప్రసాదిస్తుంది.
సువర్ణ
ఉదకాభిషేకం దారిద్ర్యాన్ని పోగొడుతింది.
కస్తురికా
జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.
హర హర మహా దేవ
షంభో శంకర!