పురాణ శ్రవణ మహిమ

శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసములో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించిననూ పురాణాన్ని విన్నప్పటికీ, వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి. కార్తీక మాసములో జనార్ధనుని అవిసిపూలతో పూజించినట్ల యితే పాపాలు అన్నీ హరిస్తాయి. అంతేకాక, ఆ విధంగా పూజించిన వాడు చాంద్రాయణ వ్రతఫలాన్ని పొందుతాడు. అచ్యుతుని గరిక పోచలతోను, దర్భకొనలతోను పూజిస్తే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు.

దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఈ కథ శ్రవణం పాపాలన్నింటినీ హరించి ఆయురారోగ్యాలు కలిగిస్తుంది. ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు. సుశీల అనే శుభలక్షణాలు గల భార్య పతిభక్తి గలది ఆమె. మంద రుడు స్నానసంధ్యానుష్టాలు వదలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు.ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తిని చేయలేక బతికేతోవ తెలియక కత్తి పట్టుకొని అడవికిపోయి దారులడ్డగించి సొమ్మును దోచుకునేవాడు.

ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొనితెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు. అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణుని పట్టి మర్రిచెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు. ఇదంతా చూసిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి, ఆ సొమ్మును లాగు కున్నాడు. ఇంతలో గుహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటికి వచ్చి ఆ బోయవానిపై పడింది. అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులివల్లే మరణిస్తాడు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ నాలుగు జీవాలను తీసుకొనిపోయి నరకంలోకి తోసివేసారు.

భర్త చనిపోయిన విషయం తెలి యని మందరుని భార్య సుశీల సదాచారపరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుం టూ పతిభక్తి వదలక కాలం గడుపుకొస్తుంది. ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంట ికొక సాధువు వచ్చాడు. నేడు కార్తీక పౌర్ణిమ. ఈ వేళ దీపదానం చేసినవారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు. ఆమె ఆ ప్రకారమే చేసింది. కొన్నాళ్ళకు ఆమె మరణించింది. దేవదూతలు ఆమెను పుణ్యలోకాలకు తీసుకెళ్తుండగా, భర్త, బాటసారి, పులి, బోయవాడు శిక్షలు అనుభవిస్తూ కనిపిస్తారు.


వారి గురించిన వృత్తాంతాన్ని విని ఆమె బాధపడుతుంది. భర్తను, ఆయనతో ఉన్న వారిని కాపాడాలని భావిస్తుంది. అందుకు ఏమి చేయాలని దేవదూతలను అడుగగా, కార్తీక దీప దాన పుణ్యాన్ని వారికి ధారపోయాలని చెబుతారు. ఆమె అలాగే చేస్తుంది. ఆమె తన కార్తీక దీప దాన పుణ్యాన్ని వారికి ధారపోయగా వారు కూడా పుణ్యాత్ములైపోతారు. వారంతా కూడా శ్రీమహావిష్ణువు పదం పొందుతారు. కార్తీకమాసంలో ఈ దివ్యమైన చరిత్రను విను వారికి తాము న్మాంతరాలలో పొందిన పాపాలన్నీ నశించిపోతాయని స్కాంద పురాణాం తర్గత కార్తీకమహాత్య్మ మందలి పదకొండవ అధ్యాయం పేర్కొంటుంది.