అష్టాదశ (18) పురాణాల ఏమి టేమిటి? వాటిలోని శ్లోక సంఖ్య ఎంతెంత?
వ్యాసమహర్షి కృతమైన ఈ
పురాణాలన్నీ గుర్తుపెట్టుకోడానికి అనువుగా వాటి పేర్ల మొదటి అక్షరాలతో ఉండే ఈ శ్లోకం చూడండి.
శ్లో|| మద్వయం, భద్వయంచైవ
భ్ర త్రయం వ చతుష్టయం.
భ్ర త్రయం వ చతుష్టయం.
పురాణ్యష్టాదశా స్మృతా !
మద్వయము = రెండు
మాలు
1. మత్స్య పురాణం - శ్లోకాల
సంఖ్య : 14,000 ('మ' ద్వయం)
2. మార్కండేయ పురాణం - శ్లోకాల
సంఖ్య : 9,000
భ ద్వయము = రెండు
భాలు
3. భవిష్యత్ పురాణం - శ్లోకాల
సంఖ్య : 14,000 ('భ' ద్వయం)
4. భాగవత పురాణం - శ్లోకాల
సంఖ్య : 18,000
భ్ర త్రయం = మూడు
భ్రాలు
5. బ్రహ్మ పురాణం - శ్లోకాల
సంఖ్య : 10,000 ('బ్ర' త్రయం)
6. బ్రహ్మాండ పురాణం - శ్లోకాల
సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం -
శ్లోకాల సంఖ్య : 18,000
వా చతుష్ఠయం = నాలుగు వాలు
8. వామన పురాణం - శ్లోకాల
సంఖ్య : 10,000
9. వాయు పురాణం - శ్లోకాల
సంఖ్య : 24,600
10. విష్ణుపురాణం - శ్లోకాల
సంఖ్య : 23,000 ('వ'చతుష్టయం)
11. వరాహ పురాణం - శ్లోకాల
సంఖ్య : 24,000
అనాపలింగ కుస్కాని
12. అగ్ని పురాణం - శ్లోక సంఖ్య
: 16,000 - అ
13. నారద పురణం - శ్లోక సంఖ్య :
25,000 - నా
14 పద్మ పురణం - శ్లోక సంఖ్య
: 55,000 - ప
15. లింగ పురాణం - శ్లోక సంఖ్య
: 11,000 - లిం
16. గరుడ పురాణం - శ్లోక సంఖ్య
: 19,000 - గ
17. కూర్మపురాణం - శ్లోక సంఖ్య
: 17,000 - కూ
18. స్కాంద పురాణం - శ్లోక
సంఖ్య : 81,000 - స్కా
ఇవికాక - 18 ఉప పురాణాలున్నాయి. అవి :
1. సనత్కుమార పురాణం,
2. సాంబ పురాణం, 3. సౌర పురాణం, 4. నారసింహ పురాణం,
5. నారదీయ పురాణం, 6. వారుణ పురాణం, 7. వాసిష్ఠ పురాణం,
8. కాపిల పురాణం, 9. కాళికా పురాణం, 10. దౌర్వాస పురాణం,
11. ఔశసన పురాణం, 12. ఆదిత్య పురాణం, 13. మాహేశ్వర పురాణం,
14. శివపురాణం, 15. భాగవత పురాణం, 16. పారశర పురాణం,
17. నంది పురాణం, 18. మానవ పురాణం.