జపమాల జపం



ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.

అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-
వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము
రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు
నేలపై కూర్చునిచేస్తే - ధుఖము, కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,
గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.
జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము
వస్త్రాసనం మీద- ధన సమృద్ధి
పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.

ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.

కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును పునఃపునఃఉచ్చరించటము.

గణనావిధిముల్లంఘ్య యో జపేత్తజ్జపం యతః!
గృహ్ణంతి రాక్షసాస్తేన గణయేత్ సర్వథా బుధః!!

లెక్కను విడిచి చేసే జపాన్ని రాక్షసులు గ్రహిస్తారు. అందుచేత పండితుడైనవాడు ఎప్పుడూ జపమును లెక్కించుతూనే చేయవలెను. జపసంఖ్యను అరచేతి యందలి వ్రేళ్ళ పర్వలపైన సువర్ణ మణిహారములతోను, ఇంద్రాక్షమాలలతో, పద్మాక్షమాలతో, రుద్రాక్షమాలతో, లెక్కించవచ్చును. వీటన్నింటియందు రుద్రాక్షలతో లెక్కించడం సర్వశ్రేష్ఠమైనది.

అరచేతిలో సంఖ్యను లెక్కించే పద్ధతి:

తర్జనీ, మధ్యమ, అనామికా, కనిష్టకలనే నాలుగు వ్రేళ్ళకూ అరచేతివైపు ఒక్కొక్కదానికి మూడేసి పర్వాలు (కణుపులు) ఉంటాయి. వాటిలో అనామిక మధ్య పర్వము నుండి మొదలుపెట్టి ఒక్కొక్కపర్వానికి ఒక్కొక్క సంఖ్య చొప్పున కనిష్ఠిక మీదుగా లెక్కించుతూ తర్జనీ మాల పర్వతో పది సంఖ్యను పూర్తిచేయాలి. మధ్యమవ్రేలి మధ్య పర్వ, మాల పర్వ మేరువుగా చేసుకొని లెక్కనుండి తప్పించాలి. నవరత్నమాల, రుద్రాక్షమాల మొదలగు వాటిని మేరు పూసను ఎట్లు లెక్కించకూడదో అదేవిధంగా నడిమి వేలి మధ్య మూలపర్వలను కూడు మేరువు అని భావించి లెక్కించకూడదు. ఇలా పది ఆవృతములు పూర్తి చేస్తే నూరు సంఖ్య పూర్తి అవుతుంది. ఆపైన ఎనిమిది లెక్కించడానికి అనామిక మూలపర్వనుండి లెక్క మొదలుపెట్టి తర్జని మధ్యమ పర్వతో పూర్తిచేయాలి. ఈ విధానం అష్టోత్తర శత సంఖ్య జపానికి ఉపయోగపడుతుంది.