శక్తిపీఠాలు


హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.


శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు

అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ
ఈ సమస్త ప్రాణకోటిలో శక్తి రూపంలో ఉండే దేవికి నమస్కారం.
 ధరణీమయీం తరణిమయీం
పవనమయీం గహన దహనహోతృమయీమ్‌
అంబుమయీ మిందుమయీం
అంబామనుకంపమాదిమా మీక్షే - అని మూక పంచశతి చెబుతోంది. అంటే,

భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశం, అగ్ని, యజమాని (యజ్ఞాన్ని చేయువాడు) నీరు, చంద్రుడు - ఇవన్నీ పరాశక్తి స్వరూపాలు. ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్న దయామయురాలైన అంబను దర్శిస్తున్నాను అని అర్థం.

'' అంటే ఐశ్వర్యం, 'క్తి' అంటే పరాక్రమమని అర్థం కాగా, ఐశ్వర్యపరాక్రమాలను అనుగ్రహించే ఆ పరశక్తిని పూజించుకుంటున్న భక్తులు, 'శాక్తేయుల' ని పిలువబడుతుంటారు. ఇటీవల వీరిని 'దేవీఉపాసకులు' అని కడా అంటున్నారు. వీరికి అష్టాదశ శక్తిపీఠాల దర్శనం అత్యంత ఉత్తేజకరం. జీవితకాలంలో ఈ పీఠాలలో కొన్నింటినైనా దర్శించుకోవలెనని ఉవ్విళ్ళూరుతుంటారు. అయితే ఈ శక్తిపీఠాల సంఖ్య విషయంలో రకరకాల వాదోపవాదనలను వింటుంటాం. వేదకాలంలో శక్తిపీఠాలు నాలుగని, కాదు...కాదు...ఐదు శక్తిపీఠాలని చెబుతూండగా, పలుపురాణాలు యాభైయొక్క శక్తిపీఠాలని చెబుతున్నప్పటికీ, మత్స్యపురాణం మహాభారతాలు మాత్రం శక్తిపీఠాలు నూట ఎనిమిది అని పేర్కొంటున్నాయి. శక్తిపీఠాలు ఆవిర్భవించిన కథమాత్రం ఆద్యంతం ఆసక్తికరం. పూర్వం బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన దక్షప్రజాపతికి తన భార్య వీరిణి వలన ఆరువేల మంది పుత్రులు జన్మించారు. (వీరి సంఖ్య కొన్ని పురాణాలలో భిన్నంగా వుంది) ఒకరోజు దక్షుడు లేని సమయాన అటుగా వచ్చిన నారదుడు, దక్షసంతతికి జ్ఞానోపదేశాన్ని చేయగా, వారంతా జ్ఞానార్జన కోసం దశదిశాంతాలకు వెళ్ళిపోయారు. మరలావారు తిరిగి ఇంటికిరాలేదు.

తన కుమారులు, తనను విడిచి పోవడానికి నారదుడే కారణమని తెలుసుకున్న దక్షప్రజాతి, "నువ్వొకచోట స్థిరంగా ఉండలేక దేశద్రిమ్మరిలా లోకసంచారం చేస్తూ కలహప్రియుడవన్న పేరు సంపాదించుకుంటావు" అని నారదుని శపించాడు. అనంతరం దక్షుడు, అశిక్నిని పెళ్ళాడగా, ఆ దంపతులకు 60 మంది కూతుళ్ళు పుడతారు. అందరికీ పెళ్ళిళ్ళు చేసి మెట్టినిళ్లకు పంపిన తరువాత దక్షుని మదిని మరలా విచారం చుట్టుముట్టింది. అలా దిగులుగా కూర్చున్న దక్షుని చూసిన నారదుడు, "అలా విచారిస్తూ కుమిలి పోవడమెందుకు? ఆ పరాశక్తిని పూజించి, ప్రసన్నం చేసుకుని, ఆమెనే నీకు కూతురుగా పుట్టేట్లు వరాన్ని పొంది, నీ జీవితాన్ని ధన్యం చేసుకో" అని సలహా ఇచ్చాడు. నారదుని సలహాప్రకారం, దక్షుడు అరణ్యాలకు బయలుదేరి, జగన్మాతను వేడుకుంటూ తీవ్రమైన తపస్సు చేశాడు. అలా నూరు సంవత్సరాలు గడిచిన పిమ్మట దక్షుని తపస్సును మెచ్చిన దేవి ప్రత్యక్షమై కావలసిన వరాన్ని కోరుకొమ్మని చెప్పింది. అప్పుడు దక్షుడు, "అమ్మా! ఆరవైమంది కొడుకులు ఉండి కూడా లేనట్లయింది. అలాగే అరవైవేలమంది కూతుళ్లుకు పెళ్ళిళ్లై అత్తవారిళ్ళకు వెళ్ళిపోయారు. వారందరి ముద్దూముచ్చట్లను నేను చూడలేకపోయానమ్మా! కాబట్టి నువ్వే నాకు కూతురుగా పుట్టి, నా జన్మను చరితార్థం చేయగలవు తల్లీ!" అని పాదాలపై పడ్డాడు.

దక్షుని ప్రార్థనను మన్నించిన జగన్మాత ఓ శుభముహూర్తంలో వీరిణి గర్భాన ఉదయించింది. అయితే మాయప్రభావం వలన దక్షునికి తాను వరాన్ని పొంది జగన్మాతను పుత్రికగా పొందిన విషయం గుర్తులేకుండా పోయింది. ఆ బిడ్డకు 'సతి' అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. ఆమె యుక్తవయస్కురాలైనప్పటికీ దక్షుడు సతీదేవికి వరాన్వేషణ చేయకుండా మిన్నకుండటాన్ని గమనించిన నారదుడు, దక్షునితో ఆమెకు తగినవాడు మహేశ్వరుడు మాత్రమే అని చెప్పాడు. ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి.

అయితే దక్షునికి శివుడంటే చిన్నచూపు. "అతడు దిగంబరుడై స్మశానాలలో, పిశాచగణాలతో, చితాభస్మాన్ని పూసుకుని తిరుగుతుంటాడట. తల్లితండ్రులెవరో తెలియని ఆ సంచారికి పిల్లనెవడిస్తారు?" అని ప్రశ్నించిన దక్షునితో నారదుడు శివుని మహత్మ్యాన్ని చెప్పి, పెళ్లికి ఒప్పించాడు. దక్షుడు తన తండ్రి బ్రహ్మతో, సతీదేవితో పెళ్ళికి శివుని ఒప్పించమని కోరడంతో, చతుర్ముఖుడు విష్ణువును, ఇంద్రాదిదేవతలను, సప్తఋషులను, నారదుని వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళి, పరమశివుని పెళ్ళికి ఒప్పించడంతో సతీశంకర కల్యాణం ఎంతో వైభవంగా జరిగింది.

 కొంతకాలం తరువాత, లోకహితాన్ని కోరిన మహర్షులు సత్రయాగాన్ని చేయదలపెట్టి త్రిమూర్తులతో పాటూ సమస్త దేవతలకు, ప్రజాపతులకు ఆహ్వానాలను పంపించారు. యాగసమయానికి అందరూ రాగా, దక్షుడు మాత్రం కాస్త ఆలస్యంగా యాగశాలకు చేరుకున్నాడు. దక్షుని చూడగానే, బ్రహ్మ విష్ణువులతోపాటూ సమస్త దేవతలు, ఋషులు గౌరవసూచకంగా లేచి నించున్నారు. కానీ, యాగక్రతువును దీక్షతో చూస్తున్న శివుడు దక్షుని రాకను గమనించక పోవడంతో లేచి నిలబడలేదు. శివుడు తనను కావాలనే అవమానపరిచాడని భావించిన దక్షుడు ఆగ్రహంతో, "ఇకపై యజ్ఞయాగాదులలో నీకు హవిర్భాగం లభించకుండును గాక!" అని శపించాడు. ఆ శాపాన్ని విన్న నంది కోపంతో ఊగిపోతూ, "అప్పుడు నీ శిరస్సు తెగి యజ్ఞకుండంలో పడి భస్మమవుతుంది" అని శపించాడు. అనంతరం యాగశాలనుంచి బయటపడిన దక్షునికి మనసులో క్రోధం తగ్గలేదు. ఎలాగైనా శివుని అవమానపరచాలనుకున్నాడు. అందుకు తగినవిధానాన్ని వెదికాడు.

చివరకు, తనకు యాగశాలలోనే అవమానం జరిగినందున యాగం ద్వారానే శివుని అవమానించాలనుకున్న దక్షుడు, యజ్ఞాన్ని చేయసంకల్పించి శివునికి తప్ప, బ్రహ్మ, విష్ణువులతో పాటూ సమస్తదేవతలకు ఆహ్వానాలు పంపాడు. దక్ష యజ్ఞానికి సమస్త దేవతలు వారి వారి దివ్యవాహనాలలో వెళ్తుండగా కైలాసంలో ఉన్న సతీదేవి గమనించి, అసలు విషయాన్ని తెలుసుకుంది. వెంటనే ఆ యాగానికి వెళ్ళాలని సతీదేవి నిర్ణయించుకోగా, పరమశివుడు మాత్రం పిలువని పేరంటానికి వద్దన్నాడు. అయినాసరే శంకరుని సమాధానపరచిన సతీదేవి పుట్టింటికి బయలుదేరింది. ఆమె యజ్ఞవాటికలోకి ప్రవేశిమంచగానే, అడ్డంకులు ఎదురయ్యాయి. పిలవని పేరంటానికి రాకపోతే సిగ్గు ఉండక్కర్లా?" అంటూ దక్షుడు, శివునిపై ఉన్న అక్కసునంతా తన కూతురిపై వెళ్ళగక్కాడు. అంతటితో ఆగకుండా నువ్వసలు నా కూతురివే కాదు పొమ్మన్నాడు.

అంతటి అవమానాన్ని భరించలేని సతీదేవి ఆగ్రహంతో, "దురహంకారా దక్షా! నీకు పోగాలం సమీపించింది. దీనికి తగిన ఫలితాన్ని ఈ యజ్ఞవాటికలోనే అనుభవిస్తావు" అని శపించి యోగాగ్నిలో దగ్ధమైంది. ఈ వార్త కైలాసానికి దావానలంలా చేరడంతో ప్రళయతాండవ నృత్యరూపుడైన పరమశివుడు తన జటలోని ఓ పాయను ఊడబెరకి నేలపై కొట్టి 'వీరభద్రా' అని గర్జించగా, ఆ జడపాయల నుంచి మహాభయంకరుడైన వీరభద్రుడు ఉదయించాడు. వెంటనే శివుడు మరో కేశపాశాన్ని విసిరేసి, 'భద్రకాళీ' అని కేక పెట్టాడు. దాన్నుంచి రౌద్రస్వరూపిణియైన భద్రకాళి అవతరించింది. వారిరువురితో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి రమ్మని పురమాయించాడు శివుడు. వారిద్దరు భూత, ప్రేత, పిశాచ గణాలను వెంటబెట్టుకుని దక్షపురిపైకి దండెత్తారు. బిగ్గరగా ధ్వనులు చేసుకుంటూ కనబడినవారిని కనబడినట్లుగా సంహరిస్తూ యజ్ఞవాటికను నేలకూల్చారు. వారిని చూసిన దక్షుడు, హుంకరిస్తూ ముందుకురికాడు. అంతే! వీరభద్రుడు ప్రళయరుద్రునిలా దక్షుని మీదికి లఘించి గండ్రగొడ్డలితో ఒక్క వేటున శిరస్సును తెగ నరికాడు. యజ్ఞవాటికలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ పరిస్థితి అలాగే కొనసాగితే సమస్తలోకాలకు అమంగళం జరుగుతుందని గ్రహించిన విష్ణు, బ్రహ్మాది దేవతలు కైలాసానికి చేరుకుని శివుని ప్రసన్నం చేసుకుని, ఆయనను తమతోపాటు దక్షపురికి తీసుకునివచ్చారు. వీరభద్ర, భద్రకాళిలను ఉపసంహరించి, మేకపోతు తలను దక్షుని మొండేనికి అతికించి, అతడిని పునర్జీవితుడిని చేసి, యాగం సక్రమంగా జరిగేటట్లు చేశాడు.

అనంతరం యోగాగ్నిలో చిత్కళా రూపములోవున్న సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకుని సతీ వియోగదుఃఖంతో మతిభ్రష్టునివలె సంచరించసాగాడు. శివుడు సమస్తాన్ని మరచి, ఆవిధంగా దుఃఖంలో మునిగిపోతే సృష్టికి అరిష్టం జరుగుతుందని తెలుసుకున్న దేవతలు, ఇందుకొక పరిష్కారమార్గాన్ని సూచించవలసిందంటూ విష్ణుదేవుని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను ఆలకించిన విష్ణువు, శివుని అనుసరిస్తూ ధనుర్భాణాలతో సతీదేవి చిత్కళారూపంలోని అవయవాలను ఖండించగా, అమ్మవారి అవయవాలు తెగిపడిన చోట శక్తిపీఠాలు వెలిశాయి. అనంతరం దేవి ఆత్మరూపిణియై తన స్వస్థలానికి చేరుకోగా, శివుడు స్వస్థత చెంది, విరాగియై కైలాసానికి చేరుకుని నిర్వకార తపస్సమాధిలో మునిగిపోయాడు.


ఆవిధంగా అమ్మవారి శరీరభాగాలు పడిన చోటు శక్తిపీఠాలు. 

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.