శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ మంత్రాలు
ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు
సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది.
** శ్రీకృష్ణ
భగవానుని మూల మంత్రం :
" కృం
కృష్ణాయ నమః "
ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే
తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో
అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు
జపించాలి. ఇలా ప్రతి రోజూ
చేస్తుంటే మనిషి అన్ని రకాల
బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి.
** " ऊँ
శ్రీం నమః శ్రీ కృష్ణాయ
పరిపూర్ణతమాయ స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ
మంత్రాన్ని ఐదు లక్షల సార్లు
జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది.
జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి
సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం
చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో
వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు.
** " గోవల్లభాయ
స్వాహా "
ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ
మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి.
** " గోకులనాథాయ
నమః "
అష్టాక్షర
శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే
జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.
** " క్లీం
గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః
"
ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని
జపిస్తే అన్ని కోరికలు నెరవేరి
అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.
** " ॐ
నమో భగవతే శ్రీ గోవిందాయ
"
దీనిని
ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం
అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే
జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది.
** " ఐం
క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం
గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది.
** " ॐ
శ్రీం హ్రీం క్లీం శ్రీ
కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ
"
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి
శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.
** " ॐ
నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే
గోపీజనవల్లభాయ స్వాహా "
ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు
లభిస్తాయి.
** " లీలాదండ
గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా
"
ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ
నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు
అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో
వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది.
** " నందపుత్రాయ
శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "
ఎవరైతే
ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన
పాయసం ద్వారా హోమం చేస్తారో వారి
మనోభీష్టాలు నెరవేరుతాయి.
** " ॐ
కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ
త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ
విద్యామాశు ప్రయచ్ఛ మే "
ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు
నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.