బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు / షోడశ గణపతులు
శ్రీ బాల గణపతి
ధ్యానం
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్
|
బాలసూర్యమిమం
వందే దేవం బాలగణాధిపమ్ || 1 ||
ఈ వినాయకుడి
రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి
చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.
శ్రీ తరుణ గణపతి
ధ్యానం
పాశాంకుశాపూపకపిద్థజంబూ స్వదంతశాలీక్షుమపి
స్వహస్తైః |
ధత్తే సదా
యస్తరుణారుణాభః పాయాత్స యుష్మాం
స్తరుణో గణేశః || 2 ||
ఈ వినాయకుడి
రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను
పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత
శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే
మంత్రంతో పూజించాలి.
శ్రీ భక్త గణపతి
ధ్యానం
నాలికేరామ్రకదలీగుడపాయసధారిణమ్
|
శరచ్చంద్రాభవపుషం
భజే భక్తగణాధిపమ్ || ౩ ||
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

శ్రీ వీరగణపతి
ధ్యానం
బేతాలశక్తిశరకార్ముకచక్రఖడ్గ
ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ |
ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ |
శూలం చ
కుంతపరశుధ్వజముద్ద్వహంతం
వీరం గణేశమరుణం సతతం స్మరామి || 4 ||
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

శ్రీ శక్తిగణపతి
ధ్యానం
ఆలింగ్య దేవీం
హరితాంగయష్టిం
పరస్పరాశ్లిష్టకటి
ప్రదేశమ్ |
సంధ్యారుణం
పాశసృణీ వహంతం
భయాపహం
శక్తిగణేశమీడే || 5 ||
నాలుగు చేతులున్న
ఈ గణపతి అంకుశం, పాశం, విరిగిన దంతం
పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం
పెరుగుతుంది.
శ్రీ ద్విజగణపతి
ధ్యానం
యం పుస్తకాక్ష
గుణదండకమండలు శ్రీ
విద్యోతమానకరభూషణమిందువర్ణమ్
|
స్తంబేరమాననచతుష్టయశోభమానం
త్వాం యః
స్మరేద్ద్విజగణాధిపతే స ధన్యః || 6 ||
ఈ వినాయకుడి
రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈ గణపతి తెలివి
తేటలు ప్రసాదిస్తాడు.
శ్రీ సిద్ధగణపతి
ధ్యానం
పక్వచూతఫలపుష్పమంజరీ
ఇక్షుదండతిలమోదకైస్సహ
|
ఉద్వహన్
పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత
హేమపింగళః || 7 ||
ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు.
ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు.
శ్రీ
ఉచ్ఛిష్టగణపతి ధ్యానం
నీలాబ్జదాడిమీవీణాశాలీ
గుంజాక్ష సూత్రకమ్ |
దధదుచ్ఛిష్టనా
మాయం గణేశః పాతుమేచకః ||
ప్రకాంతరేణ
సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ || 8 ||
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు.
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు.
శ్రీ విఘ్నగణపతి
ధ్యానం
శంఖేక్షుచాపకుసుమేషుకుఠారపాశ
చక్రస్వదంతసృణిమంజరి
కాశరౌఘైః |
పాణిశ్రితైః
పరిసమీహితభూషణశ్రీ-
-ర్విఘ్నేశ్వరో
విజయతే తపనీయగౌరః || 9 ||
గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు.

క్షిప్రగణపతి ధ్యానం
దంతకల్పలతా
పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం
ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ || 10 ||
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు.
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు.
శ్రీ హేరంబగణపతి
ధ్యానం
అభయవరదహస్తః
పాశదంతాక్షమాలా
సృణిపరశుదధానో
ముద్గరం మోదకం చ |
ఫలమధిగతసింహః
పంచమాతంగవక్త్రో
గణపతి రతిగౌరః
పాతు హేరంబనామా || 11 ||
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

లక్ష్మీగణపతి ధ్యానం
బిభ్రాణః
శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్
పాశం కల్పలతాం చ
ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః |
శ్యామే
నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో
వరదానహస్తసహితో లక్ష్మీగణేశోఽవతాత్ || 12 ||
ఈ వినాయకుడి
రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన
కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో
దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం
కలుగుతుంది.
శ్రీ మహాగణపతి
ధ్యానం
హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం
త్రినేత్రం రసాదాశ్లిష్టం
ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న
కలశాన్ హస్తైర్వహంతం భజే || 13 ||
ఈ వినాయకుడి
రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం
ధరించి, ఎడమ వైపు ఉన్న
చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన
కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
శ్రీ విజయగణపతి
ధ్యానం
పాశాంకుశస్వదంతామ్రఫలవానాఖువాహనః
|
విఘ్నం నిహంతు
నస్సర్వం రక్తవర్ణో వినాయకః || 14 ||
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు.
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు.
శ్రీ నృత్తగణపతి
ధ్యానం
పాశాంకుశాపూపకుఠారదంత చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్
|
పీతప్రభం
కల్పతరోరధస్థం భజామి నృత్తోపపదం
గణేశమ్ ||15 ||
సంతృప్తిని,
మనశ్శాంతినీ ఇచ్చే ఈ
గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి
దర్శనమిస్తారు.
ఊర్ధ్వ గణపతి
కల్హార శాలి
కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా
దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః ||16 ||
కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.