ద్వారకా తిరుమల
దీనినే "
చిన్న తిరుపతి " అని కూడా అంటుంటారు.ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర
స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన
దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి
తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు
వచ్చినది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ది చెందినది.
ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి
దక్షిణాభిముఖుడై యున్నాడు.
"పెద్దతిరుపతి"
(తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును
"చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో
తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా
భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము.
ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ
విగ్రహము.
Visheshalu :
1. శేషాచలము,
అనంతగిరి అని పిలువబడే ఈ
ద్వారకా తిరుమల క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.
2 .మూలవిరాట్టు
దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
3 .ఒకే గోపురం కింద
రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. స్వామి అసలు విగ్రహం వక్షస్థలం వరకు మాత్రమే
కనిపిస్తుంది. మిగతా భాగం కొండలోనే నిక్షిప్తమై ఉంది.
స్వామి వెనుక
భాగంలో ఉండే పూర్తి విగ్రహాన్ని (రెండోది) పదకొండో శతాబ్దంలో శ్రీమద్రామానుజుల
వారు ప్రతిష్ఠించారు.
4. పెద్దతిరుపతి"
(తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును
"చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో
తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తుల
నమ్మకం.
5 .ఇక్కడ స్వామి
వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది
స్వామి విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఆ పుట్టలో స్వామి వున్నట్లున్న
పాద ముద్రికలు ఇప్పటికి కనబడుతున్నాయట.
6. ఇక్కడ ఒక కుంకుడు
చెట్టుంది. ఈ చెట్టు మీద గరుడ పక్షి కొన్ని సమయాల్లో వచ్చి వ్రాలుతుందట. ఆనాడు
శ్రీవేంకటేశుడు తిరుపతి నుండి ద్వారకా తిరుమలకి వస్తారని ప్రతీతి.
ఇక్కడ దొరికే
ప్రతిశిల యందు సుదర్శన ముద్ర కన్పిస్తుంది. ఇది చాలా గొప్ప విశేషమయిన సంగతి.
7. ఆలయ
సింహద్వారములు వేసినా, మబ్బుపట్టి
చీకట్లు కమ్ముకొన్నా ఆలయగోపురము నుండి ఒక దివ్యమైన జ్యోతి దర్శనమిస్తుంది. దగ్గర
నుంచి అయితే చిన్న దీపంగాను 200 మీటర్ల దూరం
నుంచి చూస్తే పెద్ద వెలుగుగాను చూడవచ్చు
స్థల పురాణము
ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు.
"ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక
పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది.
విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ,
అందరూ స్వామి పాదపూజ
చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త
ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని అంటారు.
స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం
దర్శనమిచ్చే, ప్రతిమను
కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ
పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
ప్రతియేటా రెండు
కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం-
స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో
ప్రతిష్టించారనీ చెబుతారు.
గర్భగుడిలో
స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన
వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు
అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి)
అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.
కొండపైన
ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా
మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ
సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు,
తోక పైన విష్ణువు కొలువు
తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి
కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున
"శివోద్యానం" అనే పూలతోట ఉంది.
ఆలయం కొండకు 1
కి.మీ. దూరంలో
"కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి
దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ
ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.