దస అవతారం
దుష్టులను
శిక్షించి, శిష్టులను
రక్షించి, ధర్మాన్ని
నిలపడానికి శ్రీమహావిష్ణువు ఈ భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తూ వచ్చాడని హిందువుల
నమ్మకం. 'అవ తారం' అనే మాటకు 'దిగి రావడం' అని అర్థం ఉంది. ధర్మసంస్థాపనానికి
శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారా లలో ప్రధానమైనవి పది. వాటినే దశావతారాలు అంటారు.
మత్స్య, కూర్మ, వరాహశ్చ నారసింహశ్చ వామన:|
రామోరామశ్చ
రామశ్చ బుద్ధ కల్కి రేవచ||
దశావతరాలలో 1.
మత్స్యావతారం 2. కూర్మావతారం 3. వరాహావ తా రం, 4. నరసింహావతారం, 5. వామనావతారం, 6. పర శురామా వతారం, 7. శ్రీరామావతారం, 8. బలరామావతారం, 9. బుద్ధావత రాం, 10. కల్కి అవతారం. ఇవికాక విష్ణుమూర్తి దాల్చిన 18 అవతా రాలను కూడా భాగవతం తెలియ చేస్తుంది. శ్రీ
మహావిష్ణువు ధరించిన అవతారాలలో మత్స్యావతారం మొదటిది.
ద్రవిడ దేశపు
రాజైన సత్యవ్రతుడు కృత మాలిక ఒడ్డున జల తర్పణం చేయుచుండగా మత్స్య మొకటి అతని దోసిట
పడెను. అది నన్ను రక్షించు రక్షించు అని రాజును వేడు కొనెను. రాజు ఆ మత్స్యాన్ని
ఒక భాండం నందుచెను. మరుసటి రోజు ఆమత్స్యం పది నారంగుళములు పెరిగిను. ఈ విధంగా పెరు
గుతూపోతున్న చేపను చివరికి సముద్రంలో వేస్తూ నీవేవరివి? అని అడిగెను. దానికి ఆ చేప తాను, జనార్దుడనని చెప్పెను. బ్రహ్మదేవుడు
నిద్రిస్తున్న సమయంలో నాలుగు వేదాలను సోమకుడు అనే ఒక రాక్షసుడు దొంగ లించా డని,
అతడు కౄర స్వభావుడని
చెప్పాడు. అంతేకాక, ధర్మ బద్దమైన
జీవన విధానానికి రాక్ష సులు వ్యతిరేకులని కూడా చెప్పాడు.
సోమకుడు తాను
దొంగిలించిన నాలుగు వేదా లతో సహాసముద్రం అడుగుభాగాన దాగి ఉన్నా డు. మహాజల ప్రళయం
రానున్న కార ణంగా ముల్లోకాలు నీట మునుగుతాయి. నేను మీ కోసం ఒక నావను పంపుతాను.
మీరు, సప్తఋషులు,
ఔషధవృక్షజాతులతో కలిసి,
ఆనావలో ఎక్కండి. వాసుకి
అనే మహా సర్పంతో ఆనావను కట్టండి. మహాజల ప్రళయం ముగిసేదాకా ఆ నావ నీటిలో తేలియాడేలా
నేను చూసుకుంటాను అని ఆ మత్స్యం అభ యమిచ్చింది.
చేప రూపంలో ఉన్న
విష్ణువు చెప్పిన విధం గానే సత్య వ్రతుడు చేశాడు. అప్పుడు ఆ చేప సముద్రం అడుగు
భాగానికి ఈదుకుంటూ వెళ్లాడు. సోమకుడు దాగి ఉన్న చోటికి చేరు కున్నాడు. ఘోర యుద్ధ
అనంతరం సోమ కుడు మరణించాడు. శ్రీమహావిష్ణువు నాలుగు వేదాలు రక్షించి తెచ్చి
బ్రహ్మదేవునికి అందించాడు. బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారికోసం భద్రపరిచాడు.
ఆ విధంగా వేదాలు మనకు లభ్య మైన కారణంగా మానవులు సకల ధర్మాలను, శాస్త్రాలను, అభ్యసించే అవకాశం కలిగింది.