అష్ట విధ గురువులు - వారి లక్షణములు



1. బోధక గురువు - అనుభవ జ్ఞానము అవంతయును లేక, గ్రంధములలో ఉన్న విషయాన్ని మాత్రమే బోధించేవారు. వీరు బోధక గురువులుగా వ్యవహరింపబడతారు.

2. వైదిక గురువు - వేదాలలోని, వేదాంత భావములను వివరించువారు వైదిక గురువులుగా ప్రఖ్యాతి కెక్కుతారు.

3. ప్రసిద్ధ దేశికులు - ప్రతిఫలాన్ని ఏమీ ఆశించకుండానే, ఆధ్యాత్మిక బోధనను చేసేవారు ప్రసిద్ధ దేశిక గురువులనబడతారు.

4. కామ్యక గురువు - పాపపుణ్య క్రియల వల్ల సంభవించే, పాపపుణ్యముల ఫలితాల గురించి చెప్పేవారు కామ్యక గురువులు.

5. వాచక గురువు - అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువారు వాచక గురువు అనబడతారు.

6. సూచక గురువు - ఏకాగ్రతతొ చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధ్యమవుతాయో తెలుపు గురువులు సూచక గురువులు అనబడతారు.

7. కారణ గురువు - ఇహలోక, సంపద సుఃఖాలపై, మోహమును పోగొట్టి, ముక్తి అనే సంపదను కైవసము చేయించగల గురువులు కారణ గురువులు అనబడతారు.


8. విహితోపదేష్ట - అంతు చిక్కని, అతి నిగూఢమైన , సృష్టి తత్వాన్ని బోధించి, విశ్వరూపుని దర్శించు మార్గమును చూపించే గురువులు విహితోపదేష్ట గురువులు అనబడతారు