మడి ఎలా కట్టుకోవాలి?
రేపు మడికి కట్టుకోవాలనుకున్న
పంచ లేక చీరలను ఈ
రోజు ఉదయం పూటే ( 11 లోపు
) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది
ఉత్తమం. ఉతికి
జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో
శుభ్రమైన బావి లేక మోటరు
నీటితో మరల తడిపి, పిండి
దండేముల మీద ఇంటిలో గానీ
లేక ఆరు
బయట గానీ ఎవరూ తాక
కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ
చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి
వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి
ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత
ఎత్తులో ఓ గోడకు దండెము
వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై
కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు.
) మరునాడు
ఉదయాన్నే మరలా స్నానము చేసి
తడి గుడ్డ తో వచ్చి
ఆరిన మడి బట్టలను తెచ్చుకొని
గోచీ పోసి కట్టు కోన
వలెను. మడి కట్టుకొన్న తరువాత
ఇక ఎలాంటి మైల వస్తువులను తాక
కూడదు. తాకితే మరలా స్నానము చేసి
మరలా వేరే మడి బట్ట
కట్టుకొని వంట / పూజ చేయ
వలెను. మడితో నే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి
భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే
భోజనము చేయాలి. ఆ తరువాత మడి
వదలి మైల తాకుతారు.
( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు
తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు
చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే
చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి
ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి
బట్ట పనికిరాదు.
మడి
బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా
పట్టు బట్ట కట్టుకోవడము మూడో
పద్ధతి. పట్టు బట్టతో గాని,
ధావళితో గాని భోజనము చేయకూడదు.
ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే
పట్టు బట్టతో మరలా తడిపి మడిగా
ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్)
ను కట్టుకొని వంట వండి, నైవేద్యము
అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ
తాక కుండా పెట్టుకొని, మరలా
ప్రక్క రోజు వాడు కొనవచ్చు.
అయితే ప్రతి అమావాస్యకు తడిపి
ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు
మడికి పనికి రావు. ధావళి
కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే
శ్రేష్టము. పట్టు బట్టలో కొంత
దోషము వున్నది, అదే జీవ హింస,
కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు
గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా
కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు
వస్త్రము.
మగ
వాళ్ళు పంచను లుంగి లాగ
కట్టుకొని గానీ,
ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ
లో పావడా తో గాని కట్టుకొని దైవ
కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున
మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ
గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట
వలెను. పంచ లేక చీరమాత్రమే
ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో
కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి
వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు,
మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు,
నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం.
ఇవన్నీ చాలా వరకు నేడు
పోయినాయి.