శ్రీ కాళహస్తీశ్వర శతకము - 1


శా.          శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా
        రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
        దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా
           సేవం దామరతంపరై మనియెదన్శ్రీకాళహస్తీశ్వరా!         1

శా.          వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
             ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక
           ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ
                       శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా!            2