భూలోకంలో చేసే పాపాలకు నరకలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? - 1

1 తమిశ్రం:
చేసిన పాపం : నమ్మిన వారి ధనాన్నిమోసగించి తీసుకోవడం ఇతరుల నుంచి బెదిరించి సొమ్ముని కాచేయడం  ఇతరుల భార్యాపిల్లలను నిర్భందించడం కక్షతో వారిని హింసించడం పెద్దలు పై ఉన్న కక్ష వారి పిల్లలుపై చూపించడం ఇలా చేసినా వారికి శిక్ష వేస్తారు.  
శిక్ష: యమదూతలు కాలపాశంతో కట్టేసి చిమ్మ చీకటిగా ఉండే  నరక కూపం పడేస్తారు . అక్కడ పాపిని సొమ్మసిల్లి పడిపోయేదాకా కర్రతోకాని, కడ్డీతో కాని మెరకు తాళ్ళతో కానీ చావబాదుతారు. దెబ్బలకు తట్టుకోలేక గావు కేకలు పెట్టినా, చావుకేకలు పెట్టినా పట్టించుకోరు. తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి ఇవ్వకుండా చితకబాదుతారు పాపి ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా వదలరు. స్పృహలోకి వచ్చాక శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా శిక్షాకాలం పూర్తయ్యేవరకు చావబాదుతూనే ఉంటారు

  
2. అంథతమిశ్రం:
చేసిన పాపం ఒకరినొకరు మోసపుచ్చుకుని స్వార్ధ బుద్దితో నా పొట్ట నిండితే చాలు అనుకుంటూ నేను భాగుంటే చాలు అని అధిక తిండి తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని తరువాత వెంట్రుకముక్కలో వదిలిపారేసే భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు నరకానికి పంపుతాడు. నిష్కారణంగా విడాకులిచ్చే భార్యకు, భర్తకు కూడా ఇక్కడే శిక్షపడుతుంది
శిక్ష: ఇదో భయంకరమైన చీకటి నరకం. ఇక్కడ కళ్ళు పీకి పడేస్తారు ఏమీ కనబడదు. ఇక్కడకు వచ్చేలోపే పాపిని చితకొట్టేస్తారు. దెబ్బలకు దిమ్మతిరిగిపోయి ఉండగా పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి ఇందులో పారేస్తారు



3. రౌరవం:రురుఅంటే భయంకరమైనవిషనాగుఅని అర్థం.
చేసిన పాపం శరీరం శాశ్వతమని తనకోసం, తనవారి కోసం ఇతరుల
ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇతరుల కష్టాన్ని సోమ్ముచేసుకొని అనుభవిన్చేవారిని ఇక్కడికి వస్తారు
శిక్ష: వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు మిన్నాగులుగా మారి విషం కక్కుతూ మొర్రొమని మొత్తుకున్నా, ఇంతకన్నా చావేసుఖం మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు

  
4. మహారౌరవం:
చేసిన పాపం :  న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తుల్ని అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు మంత్ర విద్యలు,క్షుద్ర పూజలు ఇతలులపై ప్రయోగాలుచేసే వారు ఇక్కడకు వస్తారు
శిక్ష:  వీళ్ళను భయంకరమైన విషనాగులు చుట్టచుట్టుకుని మెలిపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటినేక్రవ్యాదులుఅంటారు. బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే, పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి


 5. కుంభిపాకం:
చేసిన పాపం: వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి, కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.
శిక్ష: ఇక్కడ ఎప్పుడూ సలసలకాగే నూనె ఉంటుంది. అందులో పడేసి వేపుతారు


6. కాలసూత్రం:
చేసిన పాపం: తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసుడిగిపోయిన పెద్ద వారిని గౌరవించి ఆదరించని వాళ్ళు పెద్దలను జ్ఞానులను అవహేళన చేసేవారు గర్వంతో ఇతరులను కించపరచడం ఇలాంటివారు ఇక్కడకు వస్తారు.
శిక్ష నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పై నుంచి సూర్యుడు, కింద నుండి భగ్గున మండుతున్న మంటతో రాగి కొలిమి విపరీతంగా వేపెక్కి ఉంటుంది.కూచోడానికి ఉండదు. నుంచోడానికి ఉండదుతప్పించుకునే మార్గంలేని నరకంలో చచ్చేలా పరిగెత్తించి తర్వాత ఈడ్చి పారేస్తారు



7. అసిత పత్రవనం:
చేసిన పాపం: విద్యుత్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలుపెట్టి వాళ్ళన చెడుమార్గంలో పోయేలా చేయడం అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి, ఇదే గొప్ప జీవితం అని వాధించేవాళ్లు కూడా నరకానికే వస్తారు
శిక్ష: కత్తుల్లా మహాపదునుగా ఉండే ముళ్ళచెట్లూ,రాళ్ళూ ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ, పరుగులెత్తిస్తారుఒళ్ళంతా కోసుకుపోయి, చీరుకుపోయి పాపి హాహాకారాలు చేస్తున్నా వదలకుండా వెంటపడి హింసిస్తారు. పాపి స్పృహతప్పి పడిపోతే ఆగి, తెలివి వచ్చాకా మళ్ళీ కొడతారుయముడు విధించిన శిక్ష పూర్తయ్యే దాకా శిక్ష అమలు జరుగుతుంది.


8. సుకరముఖం:
చేసిన పాపంఅధికార దుర్వినియోగానికి పాల్పడిఅక్రమాలు అన్యాయాల్లో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులుఅధికారులు  కలియుగంలో మన రాజకీయ నాయకులు, IAS, IPSమరియు చిన్నస్థాయి ఉద్యోగులు నుంచి ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవారు కూడా ఇలాంటి పాపాలు చేస్తున్నారు ఇలాంటి వారు ఇక్కడకి వస్తారు
శిక్ష: ఇక్కడ వాళ్ళను చితకకొట్టి పచ్చడి పచ్చడి చేస్తారుచెణకు గడను పిండి పిప్పిచేసినట్టే పాపిని భయంకరంగా శిక్షిస్తారుతెలివి తప్పి పడిపోయినా ఉపేక్షించరుతెలివి రాగానే  శిక్ష మళ్ళీ అమలు జరుగుతుంది.



9. అంధకూపం:
చేసిన పాపం: చిట్టి చీమను బుద్ధి పూర్వకంగా తొక్కిపెట్టి బాధించేవాళ్ళుకాపాడమని ప్రేధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్లు అలాగే ఉత్తిపుణ్యానికి సాటి జీవుల్ని చంపిపారేసే వాళ్ళు కూడా ఇక్కడకు చేరతారు.
 శిక్షవాళ్ళను పులులుసింహాలుగద్దలుతేళ్ళుపాములు నిండి ఉండే లోయలో పారేస్తారుచేసిన పాపం పరిహారమయ్యే వరకు ఇవి అదే పనిగా దాడి చేస్తూ చంపుకు తింటాయిఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియడానికే యముడు  నరకంలోనికి పాపులను నెడతాడు


10. తప్తమూర్తి:
చేసిన పాపం: బంగారంవిలువైన రత్నాలురత్నాభరణాలు కాజేసిన వారు
శిక్ష:  నరకం ఒక కొలిమిలా ఉంటుందిఇక్కడ పెనుమంటలు భయంకరమైన వేడి అనగా కొన్ని వందల డిగ్రీల నుండి వేల ఉష్ట్నోగ్రతలో ఉంటాయి ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు


11. క్రిమి భోజనం:
చేసిన పాపం: ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా చిన్న చూపు చూడడం నాకంటే మీరు తక్కువవారు అని అసహ్యంతో గర్వంతో చెడిపోయిన అన్నం పెట్టడంఆకలితో పక్కనవారు అలమటిస్తున్నా మెతుకు విదల్చకుండా మింగేవాళ్ళనుఎదుటివాళ్ళను సొంత పనులకుస్వార్ధ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్ళను,ఆహారపదార్థాలు,పప్పుదినుసులు కల్తీ చేసి వ్యాపారం చేసేవారు  నరకంలోకి యమ భటులు తీసుకొస్తారు
శిక్ష: ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండే నరకంఇక్కడ కొన్ని వేలరకాల క్రిమికీటకాదులు ఉంటాయి ఇక్కడకి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారుఅవి ఆవురావుమంటూ కండలు పీక్కుతింటాయిఇదో రకం చిత్రహింసపాపి శరీరాన్ని పీక్కు తినడం పూర్తయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదువాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలుచేస్తారుఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకూ శరీరాలు ఇస్తూ  శిక్ష విధిస్తూనే ఉంటారు.


12. శాల్మిలితప్త శాల్మిలి:
చేసిన పాపం: వావీ వరస పట్టించుకోకుండా సంస్కృతి,సంప్రదాయాలుకు విరుద్ధంగా అక్రమ సంబంధాలు ఎగబడే ఆడమగ వాళ్ళను  నరకానికి తెస్తారు.
శిక్ష: ఇక్కడ కణ కణ మండే ఒక ఇనుపలోహ మూర్తి ఉంటుందిఒంటికి పట్టిన మదం ఒదిలిపోయే దాకా  బొమ్మను కౌగిలించుకోవాలిఒళ్ళంతా భగ్గున మండిపోతున్నా వదలకుండా పాపిని  బొమ్మను కౌగిలించుకునేలా చేస్తారుపారిపోవడానికి ప్రయత్నిస్తే చితక బాది మరీ తీసుకువస్తారు.

13. వజ్రకంటకశాలి:
చేసిన పాపం: జాతి రీతి లేకుండా మనం మానవులం అని మానవజన్మ యొక్క విలువలును,పవిత్రతను ,భూమిపై ఉన్న జీవరాసులు అన్నింటికంటే కూడా అతి విలువైనది మానవజన్మ అని మరచిపోయి అధికకామంతో జంతువులతోనూ శృంగారం నడిపేవారికి  నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది
శిక్ష: అలాంటి వారిని ఏదును దేరిన వజ్రాలతో తయారు చేసిన బొమ్మ ఉంటుందిఇలాంటి వాళ్ళంతా దాన్ని కౌగిలించుకు తీరాలిఅలా కౌగిలించుకోగానే  మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయిఇక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది చెట్టెక్కమనిఅక్కణ్ణించి బరబరా కిందకు ఈడ్చేస్తారుదాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది.

14. వైతరణి: 
చేసిన పాపంఅధికారాన్ని సద్వినియోగం చేసిప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగ పరిచిఅక్రమాలకుఅనుచితాలకు పాల్పడిత మరియు దానధర్మాలు ,ధార్మిక కార్యకలాపాలును పూర్తిగా వదిలేసిన వారు ఇక్కడకు వస్తారు
శిక్ష మరణం పొందిన వ్యక్తి పైలోకాలకు చేరాలంటే  వైతరణి అడ్డంగా ఉంటుందిదీన్ని దాటి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలిదీంట్లో పడకుండా బైట పడాలని చాలా మంది కోరుకుంటారుఇదొ భయంకరమైన నదిమల మూత్రాలుచీమునెత్తురుఉమ్మివెంట్రుకలుఎముకలుమాంసఖండాలు వంటివి మురిగి ముక్కిపోయి గబ్బు కంపుకొట్టె మహానది ఇదిచూడడానికే రోతగాపరమ అసహ్యంగా ఉండే  నదిలోకి క్రిమికీటకాల్లా బతుకుతూఆనీరే తాగుతూఅక్కడ దొరికేవే తిని శిక్షాకాలం గడపాల్సి ఉంటుంది.