పారిపోయన దొంగ

వీధితలుపు చప్పుడు కావటంతో వంట గదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది. ఆసరికే బాగా చీకటి పడింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చప్పున తలుపుమూసి, ‘అరిచావంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను. కారాగారం నుంచి పారిపోయి వస్తున్నానుఅన్నాడు కరకుగా. వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దం అయింది. వాళ్లు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు. వాళ్లను దూరం కానిచ్చి రమ నవ్వుతూచెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం బావుకుందామని పారిపోయి వచ్చావు?’ అని దొంగను అడిగింది. దొంగ కోపంగా, ‘ విషయం నీకు అనవసరం. ఇంట్లో ఇంకా ఎవరు ఉన్నారు?’ అని అడిగాడు. ‘నీకేమీ భయం లేదు. నేను ఒంటరిగానే ఉన్నాను. వంట సగం అయింది. వంట గదిలోకి వస్తావా?’ అంటూ దారితీసింది రమ. దొంగ ఆమె వెనకనే వంట గదిలోకి వెళ్లి, ఆమె వేసిన పీటమీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్లనీళ్లు పెట్టుకుని, కొంగుతో తుడుచుకున్నది. ‘నేను నిన్ను ఏమీ చెయ్యలేదే? ఎందుకు కన్నీళ్లు?’ అని దొంగ అడిగాడు. ‘నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి చెరసాలకు పోయాడు

అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుంచీ వాడికి శాంతి లేదు. నిద్రలేదు. ఇల్లు కదలాలంటే భయం. బయట చప్పుడు వినిపించినా రక్షకభటులు వస్తున్నారని భయం. పిచ్చివాడిలా తయారయ్యాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాటి భయాలు ఉండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును. ఆమాట నేను చెప్పాను. వాడు వినలేదు. పది రోజులపాటు ఇంట్లోనే అజ్ఞాత వాసం చేశాడు. పదో రోజు రాత్రి హఠాత్తుగా రక్షక భటులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడమీది నుంచి దూకేసి, దెబ్బలు తగిలి, రెండురోజుల అనంతరం చచ్చిపోయాడు..’ అంటూ రమ చెప్పటం ముగించింది.

దొంగ ఆమెను చూసి జాలిపడుతూ, ‘గొంతు తగ్గించు- ఎవరైనా రాగలరుఅన్నాడు. వంట అయింది. భోజనం చేస్తావా? అన్నది రమ. దొంగకు తినాలనే ఉన్నది కానీ.. సందేహించాడు. ‘ఇందులో విషం కలపలేదులే. నీ ఎదటేగా వంట చేశాను?’ అంటూ రమ, దొంగ ముందు అన్నం కూరలూ వడ్డించింది. వాడు భోజనం చేస్తూంటే రమచూడబోతే మంచివాడివి లాగున్నావు. చెరసాలలో ఎలా పడ్డావు?’ అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు. ‘నా తల్లిదండ్రులెవరో నాకు తెలీదు. ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది. నన్ను గారాబంగా పెంచడానికి తాను అష్టకష్టాలూ పడింది. ఆమె చనిపోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు. మా పల్లెలో పనిలేక పట్నం వచ్చాను. పనీ ఇచ్చినవారు లేరు. నాలుగురోజులు తిండి లేదు. ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచీని లాక్కుని పారిపోయి పట్టుబడ్డాను. రెండునెలలు శిక్ష పడింది.’

అయ్యో.. పాపం! మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు?’ అని రమ అడిగింది. ‘అక్కడ అడ్డమైన చాకిరీ చెయ్యాలి. పెద్దఎత్తున వంటలు చేయాలి. తోట పని చూడాలి, బట్టలు పిండాలి. చాపలూ దుప్పట్లూ నేయాలి. బట్టలు కుట్టాలి. ఇలా ఎన్నోరకాల పనులు. అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడుదొంగ విసుక్కుంటూ.

రమ నవ్వి, ‘బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్లావు. అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు?’ అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు. రమ మళ్ళీ ఇలా అన్నది. ‘ఇప్పటినుంచీ నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి. నిద్రాహారాలుండవు. భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు చెరసాలలో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయి వచ్చి నీ కారాగార శిక్షను పెంచుకున్నావు. అంతే! చెరసాలలోనే పనులు చేస్తూ- ప్రావీణ్యం సంపాదించి ఉంటే, విడుదల అయి వచ్చాక, నీ బతుకు నువ్వు స్వతంత్రంగా, గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతోబాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరికేది. నువు చాలా తెలివి తక్కువ పనిచేశావు. పారిపోయి వచ్చావు.’

దొంగకు కళ్లు తెరుచుకున్నాయి. తాను చేసిన పొరపాటు గ్రహించాడు. నిజమే! పొరపాటు జరిగిపోయింది. ‘దీన్ని దిద్దుకోవడమెలా?’ అని అతను రమను అడిగాడు.


మించిపోయిందేమీ లేదు. నీ అంతట నీవే చెరసాలకు వెళ్లి పట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించరు. కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అదీ మంచిదేఅంది రమ. దొంగ సంతోషంగాసొంత చెల్లెలి లాగా మంచి సలహా చెప్పావు. నీ ఋణం తీర్చుకోలేను. వస్తా!’ అని వెళ్లిపోయాడు. దొంగ వెళ్లిన కొంతసేపటికి మళ్లీ తలుపు చప్పుడు అయింది. ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. ‘ఎప్పుడూ లేనిది ఇంత ఆలస్యం అయిందేం నాన్నా?’ అని రమ తండ్రిని అడిగింది. చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు. అందుకే ఆలస్యం అయింది అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. ‘మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది. చెరసాలలు కేవలం ఖైదీలను శిక్షించటానికే కాదు. వాళ్లలో పరివర్తన కలిగించేవిగా కూడా ఉండాలి. మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. ‘నేను దొంగలో ఉన్న దొంగను పారదోలాను. అందుకోసం ఒక అన్నయ్యను కూడా సృష్టించానుఅంటూ రమ జరిగిందంతా చెప్పింది. ‘్భష్! చెరసాల అధికారి కూతురివి అనిపించుకున్నావు. అతను చెరసాల చేరాడో లేదో చూసి వస్తానుఅంటూ లేచాడు. ‘ భయం నీకు వద్దు, చెప్పానుగా? అతనిలో దొంగ పారిపోయాడు. భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చుఅన్నది రమ.